మిస్టరీ బాయ్‌తో రాంచరణ్.. సోషల్ మీడియాలో జోరుగా ట్రెండింగ్.. ఎవరంటే?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న మొదటి సినిమా RRRపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనక్కర్లేదు. ఇక కరోనా వలన బ్రేకులు వేసుకుంటూ వచ్చిన దర్శకుడు రాజమౌళి చాలా రోజుల తరువాత మళ్ళీ పట్టాలెక్కించాడు. అయితే లోకేషన్ కు సంబంధించిన కొన్ని ఫొటోలు రిలీజ్ అవ్వగా అందులో ఒక మిస్టరీ బాయ్ ఎవరని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఆ వివరాల్లోకి వెళితే..

జనాలు మాట్లాడుకునేలా
RRR సినిమా ప్రేక్షకుల ముందుకు రాకముందే ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు షాక్ ఇస్తున్నాయి. నాన్ థియేట్రికల్ రైట్స్ కూడా రికార్డు స్థాయిలో అమ్ముడయ్యాయి. ఏ దారిలో అయినా RRR నెవర్ బిఫోర్ అనేలా ట్రెండ్ అవ్వడం హాట్ టాపిక్ గా మారుతోంది. ఇక ఎప్పటికప్పుడు జనాలు మాట్లాడుకునేలా దర్శకుడు జక్కన్న వేస్తున్న ప్లాన్స్ బాగానే వర్కౌట్ అవుతున్నాయి. ఇక ఇటీవల లొకేషన్స్ ఫిక్స్ ను కూడా వైరల్ అవ్వాలనే వదిలారు.

బాడీ లాంగ్వేజ్ కూడా అదిరిపోయేలా
రామ్ చరణ్ ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా నటిస్తుండగా జూనియర్ ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో నటిస్తున్నాడు. ఇక షూటింగ్ లో రామ్ చరణ్ బ్లాక్ డ్రెస్ లో ఉండగా అతని పక్కనే ఒక పిల్లాడు కూడా ఉన్నాడు. కాస్త చబ్బీగా ఉన్న ఆ కుర్రాడి బాడీ లాంగ్వేజ్ కూడా అదిరిపోయేలా ఉందని కామెంట్స్ వస్తున్నాయి.

మిస్టరీ బాయ్ ఎవరు?
రామ్ చరణ్ పక్కనే జేబులో చేయి పెట్టుకొని స్టైలిష్ గా అడుగులేస్తూ ఉన్నాడు. అంతే కాకుండా ఒక ఫొటోలో రామ్ చరణ్ కు చాలా దీటుగా లుక్కిచ్చాడు. మరొక ఫొటోలో స్మైల్ తోనే అదరగొట్టాడు. మొత్తానికి ఫొటోలు మీడియాలో ట్రెండింగ్ అవుతుండడంతో ఆ మిస్టరీ అబ్బాయి ఎవరని కూడా ఆరా తీస్తున్నారు.

అందుకే వచ్చాడా..?
ఇక ఆ అబ్బాయి ఎవరనే విషయంలోకి వెళితే.. కథలో భాగంగా ఓ చిన్న అబ్బాయిని అల్లూరి సీతరామరాజు కాపాడుతారట. ఇక ఆ సీన్లకు సంబంధించిన షూట్ ప్రారంభంలో ఇద్దరు పాల్గొన్నట్లు తెలుస్తోంది. మళ్ళీ లాక్ డౌన్ అనంతరం అదే సీన్లకు సంబంధించిన మరికొంత ప్యాచ్ వర్క్ కూడా జరుగుతుందని.. ఆ క్రమంలో మళ్లీ అబ్బాయిని పిలిచారనే కథనాలు మీడియాలో జోరుగా వినిపిస్తున్నాయి. మరి ఆ న్యూస్ ఎంతవరకు నిజమవుతుందో చూడాలి.

రిలీజ్ ఎప్పుడంటే..?
ఇక సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ పై మళ్ళీ సస్పెన్స్ కొనసాగుతోంది. అసలైతే అక్టోబర్ లోనే విడుదల చేయాలని అనుకున్నారు. కానీ సెకండ్ వేవ్ వలన ప్లాన్స్ చేంజ్ అయ్యాయి. ఇక వచ్చే సంక్రాంతికి రావచ్చని టాక్ వస్తున్నప్పటికీ అది కూడా డౌట్ అనే అనిపిస్తోంది. కూల్ గా సమ్మర్ లోనే రిలీజ్ చేసుకుందామని జక్కన్న ప్లాన్ వేస్తున్నట్లు సమాచారం. కుదిరితే ఏప్రిల్ లో రావచ్చని అంటున్నారు. మరి ఈ విషయంలో ఎప్పుడు క్లారిటీ ఇస్తారో చూడాలి.


Click it and Unblock the Notifications











