twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Mohammed Atta పై ఆర్జీవి సంచలన బయోపిక్.. ప్రపంచాన్ని గడగడలాడించిన ఉగ్రవాది ఎవరంటే?

    |

    దర్శకుడు రాంగోపాల్ వర్మ రూపొందించిన తాజా చిత్రం లడ్కీ. తెలుగులో ఈ సినిమాను అమ్మాయిగా రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాను జూలై 15వ తేదీన తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ, చైనా భాషల్లో విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా రాంగోపాల్ వర్మ తన తదుపరి సినిమా గురించి.. అలాగే పూజా భలేకర్ గురించి వెల్లడిస్తూ..

    పూజా భలేకర్ యాక్టర్ కాదు

    పూజా భలేకర్ యాక్టర్ కాదు


    పూణేకు చెందిన పూజా భలేకర్ యాక్టర్ కాదు. ఆమె మార్షల్ ఆర్ట్స్ ఫైటర్. జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొన్నారు. లడ్కీ సినిమా షూట్ సమయంలో తీసిన యాక్షన్ సీక్వెన్స్‌లో ఆమెకు ఏమైనా అవుతుందేమో అని భయపడ్డా. యాక్షన్ సీక్వెన్సుల్లో తనకు ఏమైనా అవుతుందా? సినిమా ఆగిపోతుందా? అని అనుకునేవాడిని. కానీ డైరెక్టర్‌గా నాకు ఆ షాట్ కావాలనిపించేది. అప్పుడు మనం ఆమెను కొంత మోరల్ సపోర్ట్ ఇచ్చి ప్రిపేర్ చేశాం. అయితే మా అంచనాలకు భిన్నంగా చాలా డేంజరస్ సీక్వెన్స్ చేసింది. గాల్లో ఆరు అడుగుల ఎత్తుకు ఎగిరి విలన్లను కొట్టింది అని రాంగోపాల్ వర్మ తెలిపారు. తాను రూపొందించే బయోపిక్ గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడిస్తూ..

    పూజా భలేకర్ కలిసి యాక్షన్ సీన్లు

    పూజా భలేకర్ కలిసి యాక్షన్ సీన్లు

    నేను మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోలేదు.. నేర్చుకున్నట్టు నటించాను. మార్షల్ ఆర్ట్స్ ఎంతో కష్టమైంది. ఓ రెండు కిక్కులు నేర్చుకుని, మనం ఎవ్వరినీ కొట్టకుండా.. బాక్సింగ్ బ్యాగ్‌ను కిక్‌లు కొట్టడం వరకు ఓకే. వచ్చినదాని కంటే నేను ఎక్కువగా షో చేశాను. అయితే మార్షల్ ఆర్ట్స్ గురించి చాలా రీసెర్చ్ చేశాను. నాకున్న నాలెడ్జ్‌తో నేను సినిమాను తీశా. ఈ సినిమాకు యాక్షన్ డైరెక్టర్ పనిచేయలేదు. నేను, పూజా భలేకర్ కలిసి యాక్షన్ సీన్లను డిజైన్ చేశాం అని రాంగోపాల్ వర్మ తెలిపారు.

     టైగర్ ష్రాఫ్, హృతిక్ రోషన్‌తో తీస్తే

    టైగర్ ష్రాఫ్, హృతిక్ రోషన్‌తో తీస్తే


    టైగర్ ష్రాఫ్, హృతిక్ రోషన్‌లతో తీస్తే ఇంకా భారీ చిత్రమయ్యేదనేది నిజమే. కానీ టైగర్ ష్రాఫ్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నవాడు కాదు. పంచింగ్ బ్యా‌గ్‌ను మాత్రమే కొట్టగలరు. మిగతాది అంతా కూడా వీఎఫ్‌ఎక్స్‌లో చేస్తారు. కానీ ఈ అమ్మాయి మాత్రం రియల్ టైంలో చేస్తుంది. ఆమెకు మార్షల్ ఆర్ట్స్ వచ్చు. వీఎఫెఎక్స్, గ్రాఫిక్స్ వంటివాటిని నేను తీయలేను. ఇప్పుడు మీరు సినిమాను చూస్తే రియల్ టైంలో జరిగినట్టు అనిపిస్తుంది.

    అల్ ఖైదా ఉగ్రవాది ఉగ్రవాది

    అల్ ఖైదా ఉగ్రవాది ఉగ్రవాది


    నా తదుపరి సినిమా ప్యాన్ ఇండియా మూవీగా చేస్తున్నాను. అల్ ఖైదా ఉగ్రవాది మహ్మద్ అట్ట బయోపిక్ చేయడానికి రెడీ అవుతున్నాను. అమెరికాలోని ట్వీన్ టవర్స్‌పై 9/11 దాడి చేసిన ఉగ్రవాది కథను తెరకెక్కిస్తున్నాను. దుబాయ్‌కి సంబంధించిన కొందరు ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. మహ్మద్ అట్ట ఈజిప్టుకు చెందిన వాడు. పాకిస్థాన్‌లో ఉగ్రవాదిగా శిక్షణ తీసుకొన్నాడు. అల్ ఖైదాలో చేరి పలు దేశాల్లో సంచరించాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అల్‌ఖైదా స్థావరాల్లో మహ్మద్ అట్ట తిరిగాడు. అఫ్ఘనిస్థాన్‌లో ఒసామా బిన్ లాడెన్‌ను కలిశాడు అని రాంగోపాల్ వర్మ తెలిపాడు.

    ప్యాన్ వరల్డ్ సినిమా బయోపిక్

    ప్యాన్ వరల్డ్ సినిమా బయోపిక్


    మహ్మద్ అట్టా బయోపిక్‌ను మిడిల్ ఈస్ట్ దేశాలకు సంబంధించిన ఆర్టిస్ట్‌లతో ఇంగ్లీష్, అరబిక్ భాషల్లో సినిమాను తీస్తున్నాను. ఈ సినిమాను ప్యాన్ వరల్డ్ సినిమా గురించి మాట్లాడలేదు. ప్యాన్ ఇండియా, ప్యాన్ వరల్ట్ సినిమాలు ఏమీ ఉండవు. ఇప్పుడు రెండు మూడు సినిమాలు హిట్ అయితే చాలు ప్యాన్ ఇండియా అంటున్నారు. సినిమాల పరంగా సౌత్, నార్త్ అని ఉండదు. మనమంతా కలిసి ఏడాదికి వేయి సినిమాలు తీస్తాం.కానీ ఆడినవి మాత్రం నాలుగు. ఇక్కడ పెద్ద పెద్ద సినిమాలు ఫ్లాప్ అయ్యాయి అని రాంగోపాల్ వర్మ తెలిపారు.

     ఎవరీ మహ్మద్ అట్టా అంటే?

    ఎవరీ మహ్మద్ అట్టా అంటే?

    మహ్మద్ అట్టా ఈజిప్టుకు చెందిన టెర్రరిస్ట్. హైజాకర్‌గా అల్‌ఖైదాలో పనిచేశాడు. కైరో యూనివర్సిటీలో ఆర్కిటెక్చర్ విద్యను అభ్యసించాడు. ఆ తర్వాత జర్మనీలో హంబర్గ్ యూనివర్సిటీలో ఉన్నత విద్యను అభ్యసించాడు. 2000 సంవత్సరంలో ఒసామా బిన్ లాడెన్‌ను, అల్ ఖైదా టాప్ లీడర్లను కలుసుకొన్నాడు. ప్లేన్ ఆపరేషన్ కోసం అట్టాను ఒసామా బిన్ లాడెన్ రిక్రూట్ చేశాడు. అమెరికాలోని ట్విన్ టవర్స్‌పై విమానంతో దాడులు చేయడం తెలిసిందే.

    English summary
    Sensational director Ram Gopal Varma is coming with Ladki. As part of the movie, RGV reveals about Mohammed Atta biopic.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X