twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రాంగోపాల్ వర్మకు తీరని విషాదం.. దేవుళ్లు, మోదీ, అమిత్ షా ఏం చేస్తున్నారంటూ ట్వీట్

    |

    కరోనావైరస్ విజృంభిస్తూ జీవితాలను విచ్చిన్నం చేస్తున్న నేపథ్యంలో ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ పదునైన ట్వీట్లతో ప్రభుత్వాలను రఫాడిస్తున్నారు. గత కొద్ది రోజులుగా కుంభమేళాను నిర్వహించిన అధికారులును, కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నలతో నిలదీస్తున్నారు. తాజాగా తనకు అత్యంత ఆప్తుడు, మిత్రుడు గౌరవ్ శర్మ కరోనా బారిన పడి మరణించడంతో విషాదంలో మునిగిపోయారు.

     Ram Gopal Varmas close friend Gaurav Sharma died with Corona, Gets emotional

    ఈ విషాద సమయంలో రాంగోపాల్ వర్మ ట్వీట్ చేస్తూ.. గత రెండు వారాల క్రితం కోవిడ్ పరిస్థితుల గురించి మేమిద్దరం చర్చించుకొన్నాం. స్ట్రామ్ శర్మగా పేరున్న గౌరవ్ శర్మను కోవిడ్ పొట్టన బెట్టుకోవడం జీర్ణించుకోలేకపోతున్నాను. ఆయన ఎంతో జీవితాన్ని చూశారు. అలాంటి వ్యక్తి మరణించారంటే నేను నమ్మలేకపోతున్నారు. మీకు ఆప్తులైన వారికి జరగకూడదని ఏదైనా జరిగితే వైరస్ ఇంత ప్రమాదకరమనేది అర్ధమవుతుంది అని అన్నారు.

     Ram Gopal Varmas close friend Gaurav Sharma died with Corona, Gets emotional

    కోవిడ్ విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వాలపై సెటైర్లు వేశారు. హాస్పిటల్‌లో బెడ్స్ లేవు. శ్వాస తీసుకోవడానికి ఆక్సిజన్ లేదు. వ్యాక్సిన్ల కొరత, చివరకు చస్తే కాల్చి వేయడానికి కట్టెలు కూడా లేవు. ఇలాంటి పరిస్థితుల్లో దేవతా దేవుళ్లు ఎక్కడ, నరేంద్రమోదీ, అమిత్ షా ఏం చేస్తున్నారు అంటూ ఘాటుగా రాంగోపాల్ వర్మ ట్వీట్ చేశారు.

    English summary
    Ram Gopal Varma's close friend Gaurav Sharma died with Corona, Gets emotional and wrote in twitter that, Me and him were discussing covid crisis in country just 2 weeks back and now I can’t believe Covid took away #GauravSharma #StormSharma He was so full of life and I just can’t imagine him dead .Only when it happens to someone near is when u understand the deadliness of the virus
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X