twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    The Warriorr Twitter Review: రామ్-లింగుస్వామి సినిమాకు అలాంటి టాక్.. సినిమా ఎలా ఉందంటే?

    |

    రామ్ హీరోగా కృతి శెట్టి హీరోయిన్ గా ఆది పినిశెట్టి విలన్ గా నటించిన తాజా చిత్రం "ది వారియర్". లింగుస్వామి దర్శకత్వంలో తమిళ, తెలుగు ద్విభాషా చిత్రంగా రూపొందిన ఈ సినిమా ఎట్టకేలకు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా గురించి ఇంకా రివ్యూలు బయటికి రాలేదు కానీ సినిమా చూసిన సాధారణ ప్రేక్షకులు తమ తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తున్నారు. ఇక ఈ సినిమా గురించి ట్విట్టర్లో టాక్ వైరల్ అవుతుంది. మరి ఈ సినిమా ట్విట్టర్ టాక్ ఎలా ఉంది? ట్విట్టర్ రివ్యూలు ఎలా ఉన్నాయి అనే దాని మీద ఒక లుక్కేద్దాం

    లింగుస్వామి దర్శకత్వంలో

    లింగుస్వామి దర్శకత్వంలో

    రెడ్ అని డిజాస్టర్ సినిమా తర్వాత ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని లింగుస్వామి దర్శకత్వంలో ఒక సినిమా చేశారు. ది వారియర్ పేరుతో రూపొందిన ఈ సినిమాలో రామ్ తన కెరీర్ లోనే మొట్టమొదటిసారిగా పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నారు. లింగుస్వామి దర్శకత్వంలో హీరోయిన్ కృతి శెట్టి నటించిన ఈ సినిమాలో ఆది పినిశెట్టి విలన్ గా నటించారు.

     జూలై 14 వ తేదీన

    జూలై 14 వ తేదీన

    సినిమా మీద ముందు నుంచే భారీ అంచనాలు ఉన్నా, ఆ అంచనాలను మరింత పెంచే విధంగా సినిమా నుంచి విడుదలైన ప్రమోషనల్ స్టఫ్ ఉంది. సినిమా నుంచి విడుదలైన ట్రైలర్లు, పోస్టర్లు సినిమా మీద భారీ అంచనాలను రేకెత్తించిన నేపథ్యంలో జూలై 14 వ తేదీన సినిమా విడుదలవుతోంది అనగానే ప్రేక్షకులలో కూడా ఆసక్తి ఏర్పడింది.

    మరింత పవర్ ఫుల్ గా

    మరింత పవర్ ఫుల్ గా

    ఈ సినిమాకి ట్విట్టర్లో వస్తున్న రివ్యూల ప్రకారం ఈ సినిమా పూర్తిస్థాయి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉంటుందని అంటున్నారు. రామ్ గ్రాండ్ గా తమిళ్ ఎంట్రీ ఇచ్చేందుకు గాను లింగుస్వామి ది వారియర్ కథను అద్భుతంగా డిజైన్ చేశారని ఆ కథను తెర మీద మరింత పవర్ ఫుల్ గా చూపించడంలో సక్సెస్ అయ్యారని అంటున్నారు.

    యాక్షన్ ఎపిసోడ్లు

    యాక్షన్ ఎపిసోడ్లు


    సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం సరదా సరదాగా ఎంటర్టైనింగ్ వేలో సాగుతుందని, మొదటి భాగం అయితే ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా నచ్చుతుందని అంటున్నారు. ఇక సెకండ్ హాఫ్ మొత్తం ఫుల్ మాస్ గా పూర్తిస్థాయి మాస్ ఎంటర్టైనర్ లాగా ఉంటుందని, రెండో భాగంలో వచ్చే యాక్షన్ ఎపిసోడ్లు బాగా నచ్చుతాయని అంటున్నారు. అటు రామ్ కి మాత్రమే కాకుండా లింగుస్వామికి కూడా ఇది ఒక మంచి కం బ్యాక్ మూవీ అవుతుందని నెటిజనులు పేర్కొంటున్నారు.

     బ్లాక్ బస్టర్

    బ్లాక్ బస్టర్

    లోకనాథ్ రెడ్డి అనే ఒక నెటిజన్ ది వారియర్ మూవీ సూపర్ ఎనర్జీ మాస్ మూవీ అని ఇస్మార్ట్ శంకర్ లాగానే డాన్స్ ఫైట్స్ అద్భుతంగా కుదిరాయని చెప్పుకొచ్చారు. ఇలాంటి సినిమా ఇచ్చినందుకు రామ్ కి ధన్యవాదాలు చెబుతూనే కృతి శెట్టి అందంగా కనిపించిందని, ఆది పినిశెట్టి విలన్ పాత్రలో ఒక డిఫరెన్స్ స్లాంగ్ లో మాట్లాడాడని మొత్తం మీద మూవీ ఒక బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పుకొచ్చారు. అయితే పూర్తిస్థాయి రివ్యూ వస్తే కానీ సినిమా ఎలా ఉంది అనే విషయం మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం లేదని కొందరు అంటున్నారు.

    English summary
    Ram Pothineni linguswamys The Warriorr movie released on 14th july, and here is the Twitter Review.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X