Don't Miss!
- Finance
nri taxes: బడ్జెట్ వల్ల NRIలకు దక్కిన నాలుగు ప్రయోజనాలు..
- Sports
IND vs AUS: ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్.. అతను ఆడటం భారత్‌కు కీలకం!
- News
టీఎస్ ఎస్పీడీసీఎల్లో 1601 ఉద్యోగాలకు నోటిఫికేషన్
- Lifestyle
Happy Propose Day 2023: మీరు ప్రపోజ్ చేయడానికి ఈ ప్లేసెస్ ది బెస్ట్, అవేంటంటే..
- Technology
ఈ ఫోన్లు వాడుతున్నారా? కొత్త OS అప్డేట్ చేస్తే ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
The Warriorr మాస్ ట్రైలర్‌కు రికార్డు వ్యూస్.. పవర్ ప్యాక్డ్‌లో రోల్‌లో రామ్ పోతినేని
రామ్ పోతినేని పోలీస్ ఆఫీసర్‌గా నటించిన ది వారియర్ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ అనూహ్యమైన క్రేజ్ లభిస్తున్నది. ట్రైలర్ విడుదలైన వెంటనే మిలియన్ల కొద్ది వ్యూస్ సొంతం చేసుకొంటూ రికార్డులు సృష్టించే దిశగా పరుగులు పెడుతున్నది. జూలై 14వ తేదీన రిలీజ్‌కు సిద్దమవుతున్న చిత్రానికి తమిళ దర్శకుడు ఎన్ లింగుస్వామి దర్వకత్వం వహిస్తున్నారు. కృతిశెట్టి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై రూపొందింది. ఇప్పటికే ఈ సినిమా పాటలు యూట్యూబ్‌లో రికార్డు వ్యూస్ సాధిస్తున్నది. ఈ క్రమంలో ఈ సినిమా ట్రైలర్‌ను అనంతపురంలోని రిలీజ్ చేశారు. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను చేతుల మీదుగా తెలుగు ట్రైలర్, శివకార్తీకేయన్ ట్విట్టర్‌లో తమిళ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.

ది వారియర్ ట్రైలర్‌లో పవర్ ప్యాక్ పెర్ఫార్మెన్స్, యాక్షన్ సీన్లకు మంచి రెస్పాన్స్ లభిస్తున్నది. విడుదలైన కొద్ది గంటల్లోనే ఈ చిత్ర ట్రైలర్ 2.5 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకొన్నది. ఇటీవల కాలంలో రిలీజైన ట్రైలర్స్‌లో అత్యంత మాస్ ట్రైలర్‌గా అభిమానుల నుంచి ప్రశంసలు అందుకొంటున్నది.
ది వారియర్ చిత్రంలో ఆది పినిశెట్టి విలన్‌గా నటిస్తున్నారు. ఇంకా ఈ చిత్రంలో అక్షర గౌడ, నదియా, రెడిన్ కింగ్ల్సే కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. అంబరివ్ మాస్టర్, విజయ్ మాస్టర్ యాక్షన్ కొరియోగ్రఫి చేశారు. సుజిత్ వాసుదేవ్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు.