‘పూరీ’తో రమ్యకృష్ణ.. కేక పెట్టించే పాత్రలో..
అందం, అభినయంతో మెప్పించే రమ్యకృష్ణ సెకండ్ ఇన్నింగ్స్‌లో సత్తా చాటుతున్నారు. బాహుబలి తర్వాత రమ్యకృష్ణ కెరీర్ గ్రాఫ్ అనూహ్యంగా పుంజుకొన్నది. ఆ తర్వాత చాలా చిత్రాల్లో పవర్‌ఫుల్ పాత్రలను పోషించి మెప్పించారు. తాజాగా పూరీ జగన్నాథ్ రూపొందించే రొమాంటిక్ చిత్రంలో ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఈ విషయాన్ని పూరీ జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరీ కనెక్ట్స్ అధికారికంగా వెల్లడించింది. ఈ చిత్రంలో పూరీ తనయుడు ఆకాశ్ పూరీ హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే.
అనిల్ పాడూరి దర్శకత్వంలో రూపొందుతూ హైదరాబాద్‌లో జరుగుతున్న రొమాంటిక్ సినిమా షూటింగ్‌లో రమ్యకృష్ణ పాల్గొంటున్నారని ఓ ప్రకటనలో తెలిపారు. సినిమాకు హైలెట్‌గా నిలిచే సన్నివేశాల చిత్రీకరణ జరుగుతున్నట్టు సమాచారం. ఈ చిత్రానికి సునల్ కశ్యప్ సంగీతం అందిస్తుండగా, నరేష్ సినిమాటోగ్రఫర్‌గా వ్యవహరిస్తున్నారు.

ఇస్మార్ట్ శంకర్ లాంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత పూరీ జగన్నాథ్, చార్మీ కౌర్ రొమాంటిక్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను పూరీ జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరీ కనెక్ట్స్ సంయుక్తంగా రూపొందిస్తున్నాయి. ఇటీవల రిలీజైన ఫస్ట్‌లుక్‌కు మంచి స్పందన లభించింది.
నటీనటులు: ఆకావ్ పూరి, కేతిక శర్మ, మక్రంద్ దేశ్‌పాండే, ఉత్తేజ్, సునైనా తదితరులు
కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్: పూరీ జగన్నాథ్
డైరెక్టర్: అనిల్ పాదూరి
నిర్మాతలు: పూరీ జగన్నాథ్, చార్మీ కౌర్
సమర్పణ: లావణ్య
బ్యానర్: పూరీ జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరీ కనెక్ట్స్
మ్యూజిక్: సునీల్ కశ్యప్
సినిమాటోగ్రఫి: నరేష్
ఎడిటర్: జునైద్ సిద్ధిఖీ
ఆర్ట్: జానీ షేక్
లిరిక్స్: భాస్కరభట్ల
ఫైట్స్: రియల్ సతీష్


Click it and Unblock the Notifications











