Don't Miss!
- News
బంగాళాఖాతంలో వాయుగుండం... ఏపీకి వానగండం; ఈ ప్రాంతాల్లోనే వర్షం పడే ఛాన్స్!!
- Sports
INDvsNZ: టీమిండియాకు సంప్రదాయ వెల్ కమ్.. వీడియో షేర్ చేసిన బీసీసీఐ
- Finance
it news: TCS రికార్డుల మోత.. 22 కంపెనీలను వెనక్కి నెట్టి అగ్రస్థానం కైవసం
- Automobiles
ఎట్టకేలకు హైరైడర్ CNG విడుదల చేసిన టయోటా.. ధర ఎంతంటే?
- Lifestyle
Vastu Tips: లక్ష్మీదేవి లాంటి చీపురు ఎప్పుడు కొనాలి, ఇంట్లో ఎక్కడ పెట్టాలో తెలుసా?
- Technology
Oppo నుండి కొత్త టాబ్లెట్, లాంచ్ కు సిద్ధం! ఆన్లైన్ లో స్పెసిఫికేషన్లు లీక్ ..!
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
Tollywood Drugs Case: ఈడీ విచారణకు హాజరైన రానా దగ్గుబాటి.. అతనితో సంబంధం ఏంటి?
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో గత కొన్నేళ్లుగా డ్రగ్స్ బాగోతం భూతంలా వెంటాడుతున్న విషయం తెలిసిందే. ఎవరెవరు డ్రగ్స్ తీసుకున్నారు అనే ఆరోపణల కారణంగా గతంలోనే కొంతమంది టాలీవుడ్ ప్రముఖులను విచారించారు. ఇక అప్పుడే ఈ వివాదానికి ముగింపు కార్డ్ పడుతుందని అందరూ అనుకున్నారు. కానీ హఠాత్తుగా ఇటీవల ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగంలోకి రావడంతో వివాదం మళ్ళీ మొదటికి వచ్చింది.
సంచలనం సృష్టిస్తోన్న టాలీవుడ్ మాదకద్రవ్యాల కేసులో ఇప్పటికే కొంతమంది సినీ తారలను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణ చేసింది. ఇక నేడు రానా దగ్గుబాటిని కూడా విచారణ చేసేందుకు సిద్ధమవ్వగా ఉదయమే ఈ దగ్గుబాటి హీరో ఈడీ కార్యాలయానికి చేరుకున్నాడు.

మొత్తం 12 మంది సెలబ్రిటీలు
డ్రగ్స్ విక్రేత కెల్విన్‌తో పాటు రీసెంట్ గా టాలీవుడ్ సెలబ్రెటీస్ పూరీ జగన్నాథ్, ఛార్మి, రకుల్ ప్రీత్ సింగ్, యాక్టర్ నందులను విచారించిన విషయం తెలిసిందే. టాలీవుడ్ ఇండస్ట్రీలో మొత్తం 12 మందికి ఈడీ అధికారులు నోటీసులు పంపారు. సెలబ్రెటీలకు ఇచ్చిన తేదీల రోజు ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసులు అందాయి.

విచారణకు ఉదయమే వచ్చిన రానా
ఇక పూరి జగన్నాథ్, ఛార్మి , రకుల్ అనంతరం రానా దగ్గుబాటి కూడా ఈడీ విచారణకు హాజరయ్యారు. బుధవారం ఉదయమే రానా దగ్గుబాటి తన సిబ్బందితో కలిసి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కార్యాలయంలో అడుగు పెట్టారు. ఇక మీడియా కెమెరా మెన్స్ ఆయనను వీడియోలు తీసేందుకు ఒక్కసారిగా ఎగబడ్డారు. రానా దగ్గుబాటి ఏ మాత్రం పట్టించుకోకుండా మెట్లు ఎక్కుతూ ఈడీ అధికారుల ముందు హాజరయ్యారు.

లావాదేవీలపై ఆరా
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు రానా నుంచి కీలక విషయాలు రాబట్టినట్లు సమాచారం. మనీ లాండరింగ్ కోణంలో విచారణ జరుపుతున్నారు కాబట్టి రానా బ్యాంకు ఖాతాలను అధికారులు పరిశీలిస్తున్నారు. గత కొన్నేళ్లుగా అనుమానాస్పద లావాదేవీలపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే కెల్విన్‌తో ఏమైనా సంబంధాలు ఉన్నాయా? అనే కోణంలో కూడా ప్రశ్నలు అడిగే అవకాశం సమాచారం. ఎఫ్ క్లబ్ గురించి అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది.

ముమైత్ ఖాన్ ను కూడా
రానా దగ్గుబాటితో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ముమైత్ ఖాన్ ను కూడా మనీ లాండరింగ్ చట్టం కింద విచారణ జరపనుంది. ఇప్పటికే సినీరంగానికి చెందిన 12 మందికి ఈడీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఒక్కొక్కరిని విచారిస్తున్నారు. ఇక రానా దగ్గుబాటి ఈ విచారణలో ఎలాంటి సమాధానాలు ఇస్తాడు అనేది హాట్ టాపిక్ గా మారింది.
Recommended Video

గతంలోనే క్లారిటీ ఇచ్చిన రానా
అయితే గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో రానా దగ్గుబాటి డ్రగ్స్ వ్యవహారంపై ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. బాలీవుడ్ పార్టీలకు రెగ్యులర్ గా వెళ్లడం వల్లనే నాకు సంబంధాలు ఉన్నాయని అనుకున్నారు. రోజు 20 కిలోమీటర్లు వాకింగ్ చేసిన అనంతరం వర్కౌట్స్ చేసుకునే నాకు డ్రగ్స్ అలవాటు చేసుకునే అవసరం అయితే లేదు.
ఎవరో సినిమా వాళ్ళు తీసుకుంటే నాకు సంబంధం ఏంటి? ఎవరి ఇష్టం వాళ్ళది. నాకు ఏ సంబంధం లేదు. స్కూల్ పిల్లలు డ్రగ్స్ కు బానిసలు అవుతున్నారని వినగానే షాక్ అయ్యాను. ఆ విషయంలో ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని రానా వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు.