రానా బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ.. ఆగిపోలేదని క్లారిటీ ఇచ్చిన దర్శకుడు
టాలీవుడ్ మోస్ట్ టాలెంటెడ్ హీరోలలో రానా దగ్గుబాటి ఒకరని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. కేవలం కథానాయకుడిగానే కాకుండా విలన్ గా సపోర్టింగ్ యాక్టర్ గా కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్నాడు. ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో తన పాత్ర ఎంతోకొంత విభిన్నంగా ఉండాలని చూస్తారు. అయితే రానా బాహుబలి కంటే ఎక్కువగా కష్టపడే సినిమా త్వరలోనే సిద్ధం కానుంది.
గుణశేఖర్ దర్శకత్వంలో రానా హిరణ్యకశిప అనే ఒక మైథలాజికల్ సినిమా చేయడానికి ఒప్పుకున్న విషయం తెలిసిందే. సురేష్ బాబు ప్రొడక్షన్ లోనే ఆ సినిమా సెట్స్ పైకి రాబోతోంది. అయితే ఆ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు గత రెండేళ్ల క్రితమే మొదలయ్యాయి. గుణశేఖర్ ఆ సినిమా కోసం స్క్రిప్ట్ ప్లాన్ మొత్తం రెడీ చేశాడు. పాన్ ఇండియా అని కాకుండా ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు.

అయితే అనుకోని కారణాల వల్ల మధ్యమధ్యలో బ్రేకులు పడుతూ వచ్చాయి. లాక్ డౌన్ స్టార్ట్ అవ్వగానే సురేష్ బాబు రిస్క్ చేయకూడదని హోల్డ్ లో పెట్టాడు. అయితే సినిమా ఆగిపోయినట్లు టాక్ రాగా దర్శకుడు వెంటనే క్లారిటీ ఇచ్చాడు. ఆ సినిమా ఆగిపోలేదని తప్పకుండా సెట్స్ పైకి వస్తుందని చెప్పారు. ప్రస్తుతం గుణశేఖర్ శాకుంతలం సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇక ఆ సినిమా తరువాత రానాతో హిరణ్యకశిప మొదలవుతుందని అన్నారు. అలాగే అల్లు అర్జున్ తో గోన గన్నారెడ్డి సినిమా కూడా ఉంటుందని వివరణ ఇచ్చారు.


Click it and Unblock the Notifications











