రానా భలే భయంకరంగా ఉన్నాడే! దగ్గుబాటి హీరో ఇలా మారిపోయాడా..?

బాహుబలి సిరీస్‌లో బలవంతుడిగా భారీ శరీరంతో కనిపించిన దగ్గుబాటి రానా. ఇటీవలి కాలంలో బాగా సన్నబడ్డాడు. అయితే అనారోగ్యం కారణం గానే ఆయన సన్నబడటం జరిగిందని తెలిసింది. ఈ లోగా ఆయన నటించిన లేటెస్ట్ మూవీ హౌస్ ఫుల్ 4 నుంచి రానా లుక్ బయటకు రావడంతో అది చూసి షాక్ అవుతున్నారు ప్రేక్షకులు.

తెలుగుతోపాటు హిందీ, తమిళ చిత్రాల్లో మార్కెట్ పెంచుకుంటున్న రానా.. దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు సంపాదించాడు. ఈ బాటలోనే ప్రయాణిస్తూ ప్రస్తుతం బాలీవుడ్ భారీ చిత్రం హౌస్‌ఫుల్-4లో నటిస్తున్నాడు. ఈ సినిమాలో రానా నెగిటివ్ రోల్‌ పోషిస్తున్నాడని తెలిసింది. కాగా ఈ సినిమా నుంచి తాజా విడుదలైన రానా లుక్ ప్రేక్షకులను భయపెట్టేసింది.

Rana Daggubati Look From Housefull 4

తోడేలుతో పోరాడుతున్నట్లుగా ఈ లుక్ లో కనిపించాడు దగ్గుబాటి రానా. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ పోస్టర్ చూసి రానా ఇలా మారిపోయాడా..? అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Rana Daggubati Look From Housefull 4

ఫర్హాద్ సంజీ దర్శకత్వంలో హౌస్ ఫుల్ 4 తెరకెక్కుతోంది. హౌస్ ఫుల్ సిరీస్‌లో భాగంగా వస్తున్న ఈ సినిమాలో కృతి సనన్, అక్షయ్ కుమార్, పూజా హెగ్డే, బాబీ డియోల్, కృతి కర్భందా, రితీష్ దేశ్ ముఖ్, దగ్గుబాటి రానా తదితరులు నటిస్తున్నారు. డిఫరెంట్ కాథాంశంతో రూపొందుతున్న ఈ సినిమాను అక్టోబర్ 25 వ తేదీన విడుదల చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X