For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రష్మీ సర్‌ప్రైజ్.. అస్సలు ఊహించని సుడిగాడు! కన్నీరు పెట్టుకున్న సుధీర్

|

ప్రతీ ఒక్కరి జీవితంలో కొన్ని అనుకోని ఘటనలు, ఊహించని పరిణామాలు కన్నీరు పెట్టిస్తుంటాయి. ముఖ్యంగా బాగా ఇష్టమైన వ్యక్తులు ఊహించని సర్‌ప్రైజ్ చేస్తే ఆ ఆనందం కన్నీటి రూపంలో బయటపడుతుంది. అందుకే ఆనంద భాష్పాలకు అంతులేని విలువ. తాజాగా సుడిగాలి సుధీర్ ఇలాగే రష్మీని కన్నీరు పెట్టుకున్నాడట. ఇంతకీ ఏం జరిగింది? వివరాల్లోకి పోతే..

రష్మీ, సుడిగాలి సుధీర్ లవ్ ట్రాక్.. హాట్ టాపిక్

రష్మీ, సుడిగాలి సుధీర్ లవ్ ట్రాక్.. హాట్ టాపిక్

యాంకర్ రష్మీ, సుడిగాలి సుధీర్.. ఈ రెండు పేర్లు వింటే చాలు ఆడియన్స్ ఎక్కడికో వెళ్ళిపోతారు. ఎందుకంటే ఈ ఇద్దరి ఎఫైర్ గురించి వచ్చిన రూమర్స్ అలాంటివి. వీరిద్దరి లవ్ ట్రాక్, రొమాన్స్ అనేది జనాల్లో ఎప్పుడూ హాట్ ఇష్యూనే. అంతలా పాపులారిటీ తెచ్చుకున్న ఈ జోడీ ఇటీవలే సుడిగాలి సుధీర్ హీరో రాబోతున్న తొలి సినిమా 'సాఫ్ట్‌వేర్‌ సుధీర్‌' ట్రైలర్ లాంచ్‌లో పాల్గొన్నారు.

రష్మీ సహా శేఖర్ మాస్టర్, హైపర్ ఆది

రష్మీ సహా శేఖర్ మాస్టర్, హైపర్ ఆది

శేఖర ఆర్ట్స్‌ క్రియేషన్స్‌ బేనర్‌పై ప్రొడక్షన్‌ నెం: 1గా ప్రముఖ పారిశ్రామిక వేత్త కె. శేఖర్‌ రాజు నిర్మాణంలో రూపొందిన ఈ సినిమాలో ధన్య బాలకృష్ణ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా ద్వారా రాజశేఖర్‌ రెడ్డి పులిచర్ల దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఇటీవలే జరిగిన ఈ సినిమా ట్రైలర్ లాంచ్‌ ప్రోగ్రామ్ లో రష్మీ సహా శేఖర్ మాస్టర్, ప్రదీప్, వర్షిణి, హైపర్ ఆది సందడి చేశారు.

రష్మీ సడెన్ సర్‌ప్రైజ్.. సుధీర్ ఎమోషనల్

రష్మీ సడెన్ సర్‌ప్రైజ్.. సుధీర్ ఎమోషనల్

అయితే మొదటి ఈ సినిమా ట్రైలర్ లాంచ్‌ ప్రోగ్రామ్‌కి రష్మీ వస్తుందో.. రాదో అని సుధీర్ బాగా డౌట్ పడ్డాడట. కానీ రష్మీ వచ్చి సడెన్ సర్‌ప్రైజ్ చేయడంతో సుధీర్ ఆనందంతో ఉప్పొంగిపోయి ఆనందభాష్పాలు కార్చారట. ఈ సంఘటన చూసి అక్కడున్న ప్రదీప్, వర్షిణి, హైపర్ ఆది ఆశ్చర్యపోయారని సమాచారం. అంటే ఈ లెక్కన ఈ ఇద్దరి మధ్య బాండింగ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

చాలా హాట్‌గా ఉందన్న రష్మీ

చాలా హాట్‌గా ఉందన్న రష్మీ

'సాఫ్ట్‌వేర్‌ సుధీర్‌' ట్రైలర్ లాంచ్‌లో రష్మీనే స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఈ కార్యక్రమంలో సుధీర్ పై చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. టైటిల్ సాఫ్ట్‌గా ఉన్నా ట్రైలర్ మాత్రం చాలా హాట్‌గా ఉంది. సుధీర్ డాన్సులు, ఫైట్స్ ఇరగదీసాడు. డైలాగ్స్ ట్రెండీగా ఉన్నాయి. తప్పకుండా ఈ సినిమా ద్వారా సుధీర్ పెద్ద స్టార్‌ అవ్వాలని కోరుకుంటున్నా. రాజశేఖర్ గారి టేకింగ్ చాలా బాగుంది. ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా అని పేర్కొంది రష్మీ.

#CineBox : Nani's New Film Titled Tuck Jagadish
ప్రజా గాయకుడు గద్దర్‌.. ఇంద్రజ కూడా

ప్రజా గాయకుడు గద్దర్‌.. ఇంద్రజ కూడా

సుడిగాలి సుధీర్‌, ధన్య బాలకృష్ణ హీరోహీరోయిన్లుగా నటించిన 'సాఫ్ట్‌వేర్‌ సుధీర్‌' చిత్రంలో ప్రజా గాయకుడు గద్దర్‌ ఓ పాటలో నటించారు. సీనియర్‌ నటి ఇంద్రజ, పోసాని కృష్ణమురళి, నాజర్‌, షాయాజీ షిండే, డా. ఎన్‌. శివప్రసాద్‌, పృథ్వీ, సంజయ్‌ స్వరూప్‌, రవికాలే, విద్యుల్లేఖ, టార్జాన్‌ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. అతిత్వరలో ఈ సినిమా విడుదల కానుంది.

English summary
Jabardasth feam Sudigali Sudheer enter into the cinema as hero. His first movie Software Sudheer is comes shortly. Now this movie trailer released by Dhee team. In this event Rashmi Gautam surprised Sudigali Sudheer.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more