For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బాలీవుడ్‌లోకి రవితేజ ఎంట్రీ: పక్కా ప్లాన్‌తో ముందుకు వెళ్తోన్న ‘ఖిలాడీ’ హీరో

  |

  తెలుగు సినీ ఇండస్ట్రీలో హిట్లు ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ వెళ్లే హీరోల్లో మాస్ మహారాజా రవితేజ ఒకడు. స్వయంకృషితో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన అతడు.. చాలా కష్టాలను అనుభవించిన తర్వాత స్టార్ స్టేటస్‌ను సొంతం చేసుకున్నాడు. అప్పటి నుంచి వెనుదిరిగి చూడకుండా ముందుకు వెళ్తున్నాడు. ఇలా సుదీర్ఘమైన కెరీర్‌లో ఎన్నో విజయాలను కూడా ఖాతాలో వేసుకున్నాడు. అదే సమయంలో ఫ్యాన్ ఫాలోయింగ్‌కు భారీ స్థాయిలో పెంచుకోవడంతో పాటు తన మార్కెట్‌ను సైతం గణనీయంగానే విస్తరించుకుని యమ స్పీడును చూపిస్తున్నాడు.

  సినిమా ఛాన్స్ పట్టేసిన ప్రియాంక సింగ్: బడా రైటర్‌తో ముగిసిన చర్చలు.. న్యూస్ రాబోతుందంటూ!

  చాలా కాలం పాటు పరాజయాలు ఎదురు కావడంతో.. మాస్ మహారాజా రవితేజ విజయం కోసం ఎదురు చూస్తూ వచ్చాడు. ఇలాంటి పరిస్థితుల్లో గత ఏడాది సంక్రాంతికి వచ్చిన 'క్రాక్' మూవీతో మరోసారి సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. అంతేకాదు, యాభై శాతం ఆక్యూపెన్సీ ఉన్నా కలెక్షన్లను భారీగా రాబట్టాడు. దీంతో ఇది అతడి కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఈ ఉత్సాహంతోనే ఆ వెంటనే రవితేజ 'ఖిలాడీ' అనే సినిమాను ప్రారంభించేశాడు. రమేష్ వర్మ రూపొందిస్తోన్న ఈ సినిమా పుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతుంది. మూవీ షూటింగ్ కరోనా ముందు వరకూ శరవేగంగా సాగుతూ వచ్చింది. సెకెండ్ వేవ్ వచ్చిన తర్వాత కొంత భాగం బ్యాలెన్స్ ఉండిపోయింది.

  Ravi Tejas Khiladi Movie To Release in Hindi

  చాలా గ్యాప్ తీసుకున్న తర్వాత అంటే కొద్ది రోజుల క్రితమే హైదరాబాద్‌లో 'ఖిలాడీ' సినిమా షూటింగ్‌ను పున: ప్రారంభించారు. ఈ షెడ్యూల్‌లో పలు కీలకమైన సన్నివేశాలను పూర్తి చేసుకున్నారు. ఇందులోనే విదేశాల్లో చేయాల్సిన షూటింగ్‌ను సైతం ప్రత్యేకమైన సెట్లను నిర్మించి పూర్తి చేశారనే టాక్ వినిపిస్తోంది. ఇక, ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా దాదాపుగా పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో 'ఖిలాడీ' మూవీ రిలీజ్ డేట్ గురించి ఎన్నో రకాల వార్తలు సైతం వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా గురించి అదిరిపోయే న్యూస్ ఒకటి బయటకు వచ్చింది.

  జబర్ధస్త్ వర్షకు ఊహించని ఎదురుదెబ్బ: రక్తం కారుతూ ఆస్పత్రి బెడ్‌పై.. ఆ ముగ్గురి వల్లే అంటూ!

  ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న 'ఖిలాడీ' మూవీని తెలుగుతో పాటు హిందీలోనూ విడుదల చేయాలని చూస్తున్నారట. గతంతో పోలిస్తే ఇప్పుడు బాలీవుడ్‌లో మన మార్కెట్ భారీగా పెరిగింది. దీంతో తెలుగు సినిమాలకు అక్కడ మంచి డిమాండ్ ఏర్పడింది. ఈ కారణంగానే 'ఖిలాడీ' సినిమాను హిందీలోకి డబ్బింగ్ చేస్తున్నారని ఓ న్యూస్ వైరల్ అవుతోంది. ఇదే జరిగితే రవితేజకు కూడా అక్కడ ఫ్యాన్ బేస్ పెరిగే అవకాశాలు చాలా వరకూ ఉన్నాయన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇక, దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన జనవరి 26న వచ్చే అవకాశం ఉందని ఫిలిం నగర్‌లో ఓ న్యూస్ వైరల్ అవుతోంది.

  'ఖిలాడీ'లో రవితేజ డుయల్ రోల్ చేస్తున్నాడు. క్రైమ్ థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ మూవీ టీజర్‌కు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రీతిలో స్పందన వచ్చింది. అలాగే, సాంగ్స్ పరంగా మంచి రెస్పాన్స్‌ అందుకుంది. ఇక, ఈ సినిమాను సత్యనారాయణ కోనేరు, రమేష్ వర్మ పెన్మెశ్చ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో మీనాక్షి చౌదరి, డింపుల్‌ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. హాట్ యాంకర్ అనసూయ భరద్వాజ్, యాక్షన్ కింగ్ అర్జున్ కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చుతున్నాడు.

  English summary
  Mass Maharaj Ravi Teja Doing Khiladi Movie Under Ramesh Varma Direction. This Movie To Release in Hindi Also.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X