Don't Miss!
- Sports
U-19 ప్రపంచకప్ విజేతలకు ఘన స్వాగతం.. అంత కలలా ఉందన్న త్రిష!
- Finance
WhatsApp: వామ్మో, అన్ని భారతీయ ఖాతాలను వాట్సప్ నిషేధించిందా..?
- News
తెలుగు సినిమా ఉన్నన్ని రోజులు విశ్వనాథ్ ఉంటారు..!!
- Lifestyle
Women Money Habits: మహిళల ఈ అలవాట్లతో ఉన్నదంతా పోయి బికారీ కావాల్సిందే!
- Technology
ఈ ఫోన్లు వాడుతున్నారా? కొత్త OS అప్డేట్ చేస్తే ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Khiladi Twitter Review: నెగిటివ్ టాక్‌తో రవితేజ సినిమా గట్టెక్కుతుందా? ట్విస్ట్‌కు దండం అంటూ..
టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా రోజుల అనంతరం మళ్ళీ మంచి సినిమా వాతావరణం నెలకొంది. రవితేజ ఖిలాడి సినిమా గత రెండు వారాలుగా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా నిలుస్తోంది. ఈ సినిమాని చూసేందుకు అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు అని సోషల్ మీడియాలో బజ్ చూస్తేనే అర్ధమవుతుంది. ఇక ఇప్పటికే కొన్ని ఏరియాల్లో ఖిలాడి ఫ్యాన్స్ షోలు ప్రీమియర్ షోలు ప్రదర్శించబడ్డాయి. ఇక సినిమా చూసిన కొందరు ట్విట్టర్ ద్వారా వారి స్పందన తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఇంటర్వెల్ ట్విస్ట్ పై అందరూ ఆశ్చర్యపోయే విధంగా రియాక్ట్ అవుతున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..

రవితేజ.. మూడు విభిన్నమైన షేడ్స్ లో
మాస్ మహారాజ రవితేజ క్రాక్ సినిమాతో బాక్సాఫీస్ వద్ద మొదటిసారిగా భారీ విజయాన్ని అందుకొని మళ్ళీ అదే తరహాలో మరో విజయాన్ని అందుకోవడానికి సిద్ధమయ్యారు. రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఖిలాడి సినిమా నేడు భారీ స్థాయిలో విడుదల కాబోతోంది. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను రూపొందించగా రవితేజ మూడు విభిన్నమైన షేడ్స్ లో కనిపించబోతున్నాడు.

అది హైలెట్ అయ్యేలా..
గతంలోనే రమేష్ వర్మ, రవితేజ కలయికలో వీర అనే సినిమా వచ్చింది. కానీ ఆ సినిమా అనుకున్నంతగా సక్సెస్ కాలేదు. ఇక ఇప్పుడు ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని రవితేజతో ఈ దర్శకుడు పక్కా యాక్షన్ ఫిల్మ్ తో ప్రేక్షకుల ముందుకి వస్తున్నాడు. ఇక రవితేజకు జోడిగా ఖిలాడిలో మీనాక్షి చౌదరి, డింపుల్ హాయతి నటించారు. వారిద్దరి గ్లామర్ డోస్ సినిమాలో మేయిన్ హైలెట్ అయ్యాలా ఉందట.

మొదటిసారి రవితేజ లిప్ లాక్
ఇక సినిమాలో రవితేజ లిప్ లాక్ సన్నివేశంతో అందరికి షాక్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. మీనాక్షి చౌదరి, రవితేజకు సంబంధించిన రొమాన్స్ ఈ సినిమాలో మరొక హైలెట్ పాయింట్ అని టాక్. ఇక డింపుల్ హాయతి సాంగ్స్ లో అయితే గ్లామర్ తో తప్పకుండా హీటెక్కిస్తుందని అర్ధమవుతోంది. సినిమాలో యాక్షన్ కామెడీ రొమాన్స్ గ్లామర్ అన్ని సమానంగా ఉన్నట్లు మంచి బజ్ అయితే క్రియేట్ అయ్యింది.

ఎక్కువగా ట్విస్ట్ పైనే..
ఇక సినిమాని చూసిన కొందరు ట్విట్టర్ లో భిన్నాభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం తేడగానే ఉంది అంటున్నారు. ముఖ్యంగా ట్విస్ట్ పైనే ఎక్కువమంది కామెంట్స్ చేస్తున్నారు. ఫస్ట్ హాఫ్ అంతంత మాత్రంగానే ఉండడంతో సెకండ్ హాఫ్ సినిమాను కాపాడాలని చెబుతున్నారు.

అనసూయ క్యారెక్టర్..
రవితేజ ఈ సినిమాలో గతంలో ఎప్పుడు లేని విధంగా ఒక యాక్షన్ లుక్ సరికొత్తగా కనిపించడని అర్ధమవుతోంది. ఇక సినిమాలో అనసూయ భరద్వాజ్ క్యారెక్టర్ ఇంటర్వెల్ లో ఉహించని విధంగా ఉన్నట్లుగా చెబుతున్నారు. కానీ ఆ పాత్ర అంతగా ఆకట్టుకోక పోవచ్చని కూడా టాక్ నడుస్తోంది. ఏదేమైనా ఫస్ట్ హాఫ్ రొటీన్ గానే ఉన్నట్లు చెబుతున్నారు.

దారుణంగా..
సినిమా టీజర్ ట్రైలర్ చూసిన అనంతరం ప్రేక్షకులు తప్పకుండా ఈ సినిమాలో అలాంటివి ఉంటాయని ఒక అంచనతో థియేటర్ కు వస్తారు. ఇక చిత్ర యూనిట్ అలాంటి అంశాలతోనే ఆకట్టుకోవాలని చూసింది. ఇక ఇంటర్వెల్ లో ట్విస్ట్ అయితే చాలా దారుణంగా ఉందని చెబుతున్నారు. ఒక్క సింగిల్ పాయింట్ లో కూడా సీన్స్ బాగోలేవని టాక్ వస్తోంది.

టాక్ ఎలా ఉన్నా..
అయితే టాక్ ఎలా ఉన్నా కూడా ఖిలాడి అడ్వాన్స్ బూకింగ్స్ అయితే మామూలుగా లేవని అర్ధమవుతోంది. నార్త్ ఇండస్ట్రీలో సినిమాకు భారీ స్థాయిలో అడ్వాన్స్ బూకింగ్స్ క్రియేట్ అవ్వడం విశేషం. రవితేజ హిందీ డబ్బింగ్ సినిమాలు కొన్ని యూ ట్యూబ్ లో భారీ స్థాయిలో వ్యూవ్స్ ను సొంతం చేసుకోగా ఇప్పుడు ఖిలాడి సినిమాకు హెల్ప్ అయ్యింది. న్యూ ఢిల్లీ లో అయితే ఒక ఏరియాలో సినిమా టికెట్స్ మొత్తం అడ్వాన్స్ బుకింగ్స్ లోనే అమ్ముడవ్వడం విశేషం.