రవితేజ అభిమానులకు న్యూ ఇయర్ గిఫ్ట్: క్రాక్ అంటూ దిగేశాడు చూడండి
మాస్ మాహారాజా రవితేజ హీరోగా కమర్షియల్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో రాబోతున్న కొత్త సినిమా 'క్రాక్'. క్యాచీ టైటిల్‌తో విలక్షణ కథాంశం ఎంచుకున్న గోపీచంద్ మలినేని ఈ సినిమాను శరవేగంగా ఫినిష్ చేస్తున్నారు. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. రవితేజతో డాన్ శీను, బలుపు లాంటి సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించిన గోపీచంద్ మలినేని.. మరో హిట్ సినిమా లైన్‌లో పెట్టానని టైటిల్ పోస్టర్ ద్వారానే చెప్పేశారు.
కాగా తాజాగా నూతన సంవత్సరం కానుకగా 'క్రాక్' సినిమా ఫస్ట్‌లుక్ విడుదల చేసింది చిత్రయూనిట్. ఇందులో ఖాకీ యూనిఫామ్ వేసుకుని ఇన్‌టెన్స్ లుక్, చేతిలో గోలీసోడాను పట్టుకున్న రవితేజ కనిపిస్తున్నాడు. టైటిల్ పోస్టర్ లాగే ఈ పోస్టర్ కూడా ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో రవితేజ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నారు.

ఇక ఈ డిఫెరెంట్ మూవీలో రవితేజ సరసన శృతి హాసన్‌ని హీరోయిన్‌గా తీసుకున్నారు. వరలక్ష్మీ శరత్ కుమార్ కూడా కీలక పాత్రలో నటించనుంది. సరస్వతి ఫిలిం డివిజన్ బ్యానర్‌లో బీ మధు నిర్మిస్తున్న ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో జరిగిన యథార్థ ఘటనలను ఆధారంగా చేసుకుని అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించేలా డైరెక్టర్ గోపీచంద్ మలినేని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు మేకర్స్.


Click it and Unblock the Notifications











