రామాపురం బీచ్‌లో రవితేజ క్రాక్.. ఇదీ మ్యాటర్
మాస్ మాహారాజా రవితేజ హీరోగా కమర్షియల్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో రాబోతున్న కొత్త సినిమా 'క్రాక్'. రవితేజ కెరీర్‌లో 66వ సినిమాగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. గతంలో ఎన్నడూ చూడని విధంగా రవితేజను చూపించనున్నారు డైరెక్టర్ గోపీచంద్ మలినేని.
గతంలో రవితేజతో డాన్ శీను, బలుపు లాంటి సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించిన గోపీచంద్ మలినేని.. మరో హిట్ సినిమా లైన్‌లో పెట్టారని టైటిల్ పోస్టర్ ద్వారానే చెప్పేశారు. నూతన సంవత్సరం కానుకగా 'క్రాక్' ఈ సినిమా ఫస్ట్‌లుక్ విడుదల చేసి జనాల్లో ఆసక్తి రేపిన యూనిట్ సభ్యులు చకచకా షూటింగ్ ఫినిష్ చేస్తున్నారు.

ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చీరాల సమీపంలోని రామాపురం బీచ్‌లో జరుగుతోంది. ఓ రొమాంటిక్ పాటతో పాటు కొన్ని కీలక సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో జరిగిన యథార్థ ఘటనలను ఆధారంగా చేసుకుని అన్నివర్గాల ప్రేక్షకులను మెప్పించేలా డైరెక్టర్ గోపీచంద్ మలినేని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో రవితేజ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నారు.
సరస్వతి ఫిలిం డివిజన్ బ్యానర్‌లో బీ మధు నిర్మిస్తున్న ఈ సినిమా క్రాక్ మూవీలో రవితేజ సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. మే 8న క్రాక్ మూవీ విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











