Just In
- 10 min ago
మహేశ్‌కు మళ్లీ కథ చెప్పిన సక్సెస్ఫుల్ డైరెక్టర్: ఈ సారి మరో ప్రయోగం అంటూ రిప్లై
- 12 min ago
పొట్టి బట్టల్లో పిచ్చెక్కిస్తోంది.. నిహారికను ఎప్పుడూ ఇలా చూసి ఉండరు!
- 44 min ago
RRR నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్.. డేట్ కూడా ఫిక్స్?
- 1 hr ago
గతం గురించి ఆలోచించకు.. అదిరిపోయిన ప్లే బ్యాక్ ట్రైలర్
Don't Miss!
- News
Same Sex marriage: మోడీ సర్కార్ నిర్ణయంపై భగ్గుమంటోన్న స్వలింగ సంపర్కులు: తొక్కేశారంటూ
- Lifestyle
ఈ 4 రాశుల వారికి లీడర్ షిప్ క్వాలిటీస్ ఉండవు... ఈ జాబితాలో మీ రాశి ఉందేమో చూసెయ్యండి...
- Sports
యువరాజ్ సింగ్ ట్వీట్‌పై దుమారం.. ఈ లెక్కన కోహ్లీ 200 సెంచరీలు చేసేవాడా?
- Finance
అయిదేళ్లలో 63% పెరగనున్న కుబేరులు, ప్రపంచంలోనే భారత్ టాప్
- Automobiles
525 హార్స్ పవర్ వి8 ఇంజన్‌తో వస్తున్న మోస్ట్ పవర్ఫుల్ డిఫెండర్ వి8
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
వాళ్ళిచ్చిన ఆ చెక్కులను చించి పారేశా.. మొత్తానికి ఫుల్లుగా ఎంజాయ్ చేశా: రవితేజ
గత కొంతకాలంగా సరైన హిట్ పడక కసిగా ఉన్న రవితేజ అదే కసితో ఇక 'డిస్కో రాజా' సినిమాతో రంగంలోకి దిగుతున్నాడు. వీఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నభా నటేష్, పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్లుగా నటించారు. ఇప్పటికే షూటింగ్ ఫినిష్ చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈ మేరకు ప్రమోషన్ కార్యక్రమాలు వేగవంతం చేశారు యూనిట్ సభ్యులు.

రవితేజపై రూమర్స్.. మాస్ మహారాజ్ స్పందన
ఇందులో భాగంగా ఆదివారం (జనవరి 19) ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. ఈ వేదికపై తన మీద వస్తున్న రూమర్లను ఖండిస్తూ క్లారిటీ ఇచ్చాడు మాస్ మహారాజ్ రవితేజ. రెమ్యునరేషన్ విషయంలో రవితేజ ఎక్కడా రాజీ పడడని, చాలా మొండిగా ప్రవర్తిస్తాడని చెప్పుకున్నారు జనం. తాజాగా ఈ ఇష్యూపై రవితేజ స్పందించారు.

అంత మొండివాడినే అయితే ఇలా జరిగేది కాదు
‘‘ప్రతీ సినిమాకు కూడా నాకు దక్కాల్సినంత పారితోషికమే తీసుకుంటాను. మీకు వచ్చే జీతం 1000 రూపాయలు అయినప్పుడు 800 మాత్రమే ఇస్తే మీరు ఊరుకుంటారా? ఒకవేళ నేను అంత మొండివాడినే అయితే నా కెరీర్ ఇలా ఉండేది కాదు. నేను ఇన్ని సినిమాల్లో నటించి ఉండేవాడిని కానేకాదు.

నిర్మాతలు చెక్కులు ఇస్తే చించేశా..
కేవలం మూడు సందర్భాల్లో మాత్రమే నేను పారితోషికం తీసుకోవడానికి నిరాకరించగా. నేను నటించిన మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అవడంతో ఫైనల్ పేమెంట్ తీసుకోవడానికి ఇష్టపడలేదు. నిర్మాతలు చెక్కులు ఇచ్చినా కూడా వాటిని చించేశాను అని రవితేజ అన్నారు.

అందరితో ఫుల్ ఎంజాయ్ చేశా.. కారణం ఆయనే
ఇక ఆ వెంటనే 'డిస్కో రాజా' సినిమా గురించి మాట్లాడుతూ.. ''ఈ సినిమాను నేను ఎంత ఎంజాయ్ చేస్తూ చేశానో.. రేపు మీరు కూడా థియేటర్‌లో అంతే ఎంజాయ్ చేస్తారని నమ్మకంగా చెబుతున్న. ఈ సినిమా ద్వారా బాబీ సింహా, రాంకీలతో తొలిసారి కలిసి పనిచేశాను. ఆ వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ చాలా బాగుంది. సునీల్‌తో చాలా గ్యాప్ తరవాత కలిసి పనిచేశాను. అందరితో ఫుల్ ఎంజాయ్ చేశా. ఈ సినిమాను బాగా ఎంజాయ్ చేయడానికి ముఖ్య కారకుడు వీఐ ఆనంద్'' అన్నారు రవితేజ.

జనవరి 24న డిస్కో రాజా
ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై రామ్ తాళ్లూరి డిస్కోరాజా చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే విడుదలైన అప్‌డేట్స్ సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి. దీంతో భారీ అంచనాల నడుమ ఈ నెల 24న డిస్కోరాజా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.