For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బాలకృష్ణతో ఫైటింగ్‌కు రవితేజ రెడీ: అప్పుడు అలా మిస్తైనా ఇప్పుడు మాత్రం పక్కా ప్లాన్

  |

  ప్రస్తుతం టాలీవుడ్‌లో అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణను అందుకుంటూ స్టార్ హీరోగా వెలుగొందుతోన్న వారిలో మాస్ మహారాజా రవితేజ ఒకడు. చిన్న చిన్న పాత్రలు చేస్తూ కెరీర్‌ను ఆరంభించిన ఆయన.. ఆ తర్వాత కొంత కాలానికి హీరోగా మారాడు. అప్పటి నుంచి వెనుదిరిగి చూడకుండా దూసుకెళ్తూ స్టార్ హీరోగా ఎదిగిపోయాడు. ఇలా చాలా ఏళ్లుగా టాలీవుడ్‌లో హవాను చూపిస్తున్నాడు. మరీ ముఖ్యంగా బీ, సీ సెంటర్లను అలరించే మాస్ హీరోగా పేరు సంపాదించుకున్నాడు. దీంతో తనకంటూ భారీ స్థాయిలో మార్కెట్‌ను కూడా ఏర్పరచుకుని సత్తా చాటుతున్నాడీ సీనియర్ స్టార్ హీరో.

  మహేశ్ మూవీ నుంచి చెప్పకుండా తీసేశారు.. ఆ అమ్మాయి వల్ల నాపై కేసు పెట్టారు: నోరు విప్పిన ప్రకాశ్ రాజ్

  కొంత కాలం పాటు వరుస పరాజయాలతో సతమతం అయిన తరుణంలో ఈ ఏడాది ఆరంభంలో వచ్చిన 'క్రాక్' మూవీతో కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు టాలీవుడ్ స్టార్ హీరో మాస్ మహారాజా రవితేజ. ఇది భారీ సక్సెస్‌ను అందుకోవడంతో పాటు కలెక్షన్లనూ ఊహించని రీతిలో వసూలు చేసింది. దీంతో ఈ చిత్రం సంక్రాంతి విజేతగా నిలిచింది. అలాగే, అతడి కెరీర్‌కు బూస్ట్ ఇచ్చింది. ఈ మూవీ రిజల్ట్ ఇచ్చిన జోష్‌తో ఉన్న రవితేజ.. ఆ వెంటనే 'ఖిలాడీ' అనే సినిమాను మొదలు పెట్టేశాడు. టాలెంటెడ్ డైరెక్టర్ రమేష్ వర్మ తెరకెక్కిస్తోన్న ఈ సినిమా పుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది.

  Ravi Tejas Khiladi Movie Release on November 4th

  అన్ని హంగులతో యాక్షన్ బ్యాగ్‌డ్రాప్‌లో వస్తున్న 'ఖిలాడీ' మూవీ షూటింగ్ కరోనా ముందు వరకూ శరవేగంగా సాగుతూ వచ్చింది. సెకెండ్ వేవ్ వచ్చిన తర్వాత విదేశాల్లో జరగాల్సిన షెడ్యూల్‌కు బ్రేక్ పడిపోయింది. దీనికితోడు సదరు దేశానికి వెళ్లేందుకు పర్మీషన్ దొరకకపోవడంతో దీన్ని అలా ఆపేసి మరో సినిమాను మొదలు పెట్టాడు రవితేజ. ఇక, సుదీర్ఘమైన విరామం తర్వాత ఇటీవలే హైదరాబాద్‌లో 'ఖిలాడీ' సినిమా షూటింగ్‌ను పున: ప్రారంభించారు. అప్పటి నుంచి శరవేగంగా బ్యాలెన్స్ పార్ట్‌ను షూట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా విడుదల తేదీ గురించి తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది.

  బీచ్‌లో లవర్‌తో పాయల్ రాజ్‌పుత్ రచ్చ: బికినీలో అందాలన్నీ చూపిస్తూ.. షాకిస్తోన్న సెల్ఫీ వీడియో

  'ఖిలాడీ' మూవీని మే 28వ తేదీన విడుదల చేయాలని భావించారు. కానీ, అప్పుడు కోవిడ్ సెకెండ్ వేవ్ కారణంగా అది సాధ్య పడలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడీ చిత్రాన్ని దీపావళి కానుకగా నవంబర్ 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని చిత్ర యూనిట్ నిర్ణయం తీసుకున్నట్లు ఓ న్యూస్ బయటకు వచ్చింది. దీంతో మాస్ మహారాజ ఫ్యాన్స్‌కు ఒకేరోజు రెండు పండుగలు ప్లాన్ చేశారని అంటున్నారు. ఇదిలా ఉండగా.. అదే రోజు నందమూరి బాలకృష్ణ నటించిన 'అఖండ' కూడా విడుదల కాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక్కడ విశేషం ఏంటంటే.. గతంలోనూ ఈ రెండు సినిమాలనూ మే 28నే విడుదల చేయాలనుకున్నారు.

  Ravi Tejas Khiladi Movie Release on November 4th

  క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'ఖిలాడీ' మూవీలో రవితేజ డుయల్ రోల్ చేస్తున్నాడు. క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో రాబోతున్న ఈ మూవీ టీజర్‌కు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రీతిలో స్పందన వచ్చిన విషయం తెలిసిందే. ఇక, ఈ సినిమాను సత్యనారాయణ కోనేరు, రమేష్ వర్మ పెన్మెశ్చ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో మీనాక్షి చౌదరి, డింపుల్‌ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. హాట్ యాంకర్ అనసూయ భరద్వాజ్, యాక్షన్ కింగ్ అర్జున్ కీలక పాత్రలు చేస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చుతున్నాడు.

  English summary
  Mass Maharaj Ravi Teja Doing Khiladi Movie Under Ramesh Varma Direction. This Movie will Release on November 4th.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X