The Family Man 2 తెలుగు, తమిళ వర్షన్లు అందుకే లేట్.. ఎప్పుడు వస్తాయంటే?

సూపర్ క్రేజ్ తో పాటు ప్రేక్షకాదరణను సొంతం చేసుకొన్న వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్‌కు సీక్వెల్‌గా వచ్చిన ది ఫ్యామిలీ మ్యాన్ 2 కూడా ఈ నెల మొదట్లో రిలీజయిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్ అటు విమర్శకుల నుంచే కాక ప్రేక్షకుల నుంచి కూడా మంచి ప్రశంసలు అందుకుంటోంది. తమిళ ఈలం విషయాన్ని ప్రస్తావించడంతో అనేక వివాదాలు చెలరేగాయి. అయినా సరే అనేక అంచనాల మధ్య ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్‌లో మంచి పేరు తెచ్చుకుంటోంది. ఒక పక్క ది ఫ్యామిలీ మ్యాన్ 2 పట్ల ప్రశంసలు కొనసాగుతూనే ఉండగా, తెలుగు, తమిళ వెర్షన్లు ఇంకా రిలీజ్ చేయనందుకు కొంతమందిలో అసంతృప్తి కూడా ఉంది.

ఈ సెకండ్ సీజన్ తమిళ, తెలుగు వెర్షన్లు ఇప్పుడు ఆలస్యం కావడానికి కారణం ఏమిటో రాజ్ నిడుమోరు, డీకే కృష్ణలు వెల్లడించారు. లాక్డౌన్ మరియు రెండవ వేవ్‌తో పాటు అనేక కారణాల వల్ల ఈ సిరీస్ రిలీజ్ చేయడమే ఆలస్యం అయిందని వారు వెల్లడించారు. ఈ రెండవ సీజన్ ప్రకటించిన నాటికే ఆలస్యం అయిందని అందుకే రెండో సారి ప్రకటించిన సమయానికి అయినా రిలీజ్ చేయాలని భావించి అనేక నిద్ర లేని రాత్రులు గడిపి రిలీజ్ చేశామని వెల్లడించారు.

Reason Behind The Family Man 2 Telugu Tamil Versions Delay and new release date

"ప్రాజెక్ట్ ను సమయానికి విడుదల చేయడానికి మేము చాలా అడ్డంకులను అధిగమించామని ఆయన అన్నారు. అయితే తెలుగు మరియు తమిళ బాషలలో కూడా ఒకే సారి విడుదల చేయాలని ముందునుంచే ప్లాన్ లు ఉన్నాయని కానీ వాటిని ఆలస్యం కావడానికి కారణం మా స్వార్థమే మాత్రమే "అని రాజ్ చెప్పారు. తమ స్వార్ధం అంటే ఏంటో వివరిస్తూ, "మేకర్స్ గా మాకు ఇతర భాషలలో కథాంశం దాని సారాన్ని కోల్పోకూడదనే స్వార్థపూరిత ఆసక్తి ఉందని, ప్రతిదీ జనాల్లోకి వెళ్లాలని ఆ సారాన్ని తెలియజేయాలని మేము కోరుకుంటున్నామని, ఈ ప్రక్రియ జరుగుతోందని అది పూర్తయిన వెంటనే రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఇక ఇప్పుడు మూడవ సీజన్ కోసం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X