Just In
- 20 min ago
మహేశ్‌కు మళ్లీ కథ చెప్పిన సక్సెస్ఫుల్ డైరెక్టర్: ఈ సారి మరో ప్రయోగం అంటూ రిప్లై
- 22 min ago
పొట్టి బట్టల్లో పిచ్చెక్కిస్తోంది.. నిహారికను ఎప్పుడూ ఇలా చూసి ఉండరు!
- 54 min ago
RRR నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్.. డేట్ కూడా ఫిక్స్?
- 1 hr ago
గతం గురించి ఆలోచించకు.. అదిరిపోయిన ప్లే బ్యాక్ ట్రైలర్
Don't Miss!
- Sports
రెండు రోజుల్లోనే 22 టెస్టులు పూర్తి.. ఇంగ్లండ్ జట్టుదే ఆధిపత్యం!! భారత్ ఎన్నిసార్లంటే?
- News
Same Sex marriage: మోడీ సర్కార్ నిర్ణయంపై భగ్గుమంటోన్న స్వలింగ సంపర్కులు: తొక్కేశారంటూ
- Finance
గుడ్‌న్యూస్, 30,000 మందికి క్యాప్‌జెమిని ఉద్యోగాలు! ఫ్రెషర్స్, ఎక్స్‌పీరియన్స్‌కు అవకాశం
- Lifestyle
ఈ 4 రాశుల వారికి లీడర్ షిప్ క్వాలిటీస్ ఉండవు... ఈ జాబితాలో మీ రాశి ఉందేమో చూసెయ్యండి...
- Automobiles
525 హార్స్ పవర్ వి8 ఇంజన్‌తో వస్తున్న మోస్ట్ పవర్ఫుల్ డిఫెండర్ వి8
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
విజయశాంతి సంచలన నిర్ణయం వెనుక కారణాలివే! అదేనా ఆమె అసలు సమస్య?
ఒకప్పుడు తెలుగు సినిమాల్లో బెస్ట్ హీరోయిన్‌గా స్టార్ హీరోల సరసన నటించిన విజయశాంతి తన సినీ ప్రయాణానికి 13 ఏళ్ల విరామం ఇచ్చి రాజకీయ బాట పట్టింది. ఇక ఆమె సినిమాలు చేయదు అనుకున్న తరుణంలో 'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో తిరిగి రీ ఎంట్రీ ఇచ్చి ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు మరింత ఆశ్చర్యపరుస్తూ ''ఇక సెలవు'' అని చెప్పేసింది విజయశాంతి. అయితే ఆమె తీసుకున్న ఈ నిర్ణయం వెనుక కారణాలేంటి? ఏం జరిగింది? వివరాల్లోకి పోతే..

విజయశాంతి రీ ఎంట్రీ.. ఫోకస్ అంతా అక్కడే
చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత సినీ గడప తొక్కిన విజయశాంతి.. సరిలేరు నీకెవ్వరు సినిమాలో భారతి అనే క్యారెక్టర్ చేసి బాగానే ఆకట్టుకుంది. ఈ సినిమా ప్రమోషన్స్ నుంచే విజయశాంతి రీ ఎంట్రీ అంశాన్ని బాగా ఫోకస్ చేశారు మేకర్స్. డైరెక్టర్ అనిల్ రావిపూడి సైతం విజయశాంతి నటన, క్యారెక్టర్ గురించి గొప్పగా చెప్పారు.

ఇకపై వరస సినిమాలు చేస్తా.. విజయశాంతి మాట
మరోవైపు విజయశాంతి కూడా.. ఈ సినిమాలో తన కోసం అద్భుతమైన పాత్ర రాసిన అనిల్ రావిపూడికి ఎప్పుడూ కృతజ్ఞతలు అని చెప్పుకొచ్చింది. అంతేకాదు ఇకపై వరస సినిమాలు చేస్తాను. పాత్ర నచ్చితే కచ్చితంగా నటిస్తాను. ఇన్నేళ్లు ఉన్న టెన్షన్ అంతా ఈ ఆర్నెళ్ళ పాటు జరిగిన సరిలేరు నీకెవ్వరు షూటింగ్ ద్వారా తీరిపోయిందని చెప్పింది విజయశాంతి.

సమయం, సందర్భం అంటూ.. ఇక సెలవు
కానీ ఉన్నట్లుండి ఇప్పుడు సినిమాల నుంచి సెలవు అంటూ ట్వీట్ చేసింది విజయశాంతి. సినీ ప్రయాణం గురించి కీలక వ్యాఖ్యలు చేసి అనుమానాలకు తెరలేపింది. ప్రజా జీవన పోరాటంలోనే తన ప్రయాణం కొనసాగుతుందని ఆమె ప్రకటించింది. మళ్లీ మరో సినిమా చేసే సమయం, సందర్భం తనకు వస్తుందో, లేదో నాకు కూడా తెలియదని చెబుతూ ఇప్పటికి సెలవు అని చెప్పేసింది ఈ లేడీ అమితాబ్.

విజయశాంతి సడన్ డిసీజన్.. కారణాలు
దీంతో అసలు ఎందుకు ఇలా విజయశాంతి సడన్‌గా ట్వీట్ చేసిందనేది అర్థం కావడం లేదు జనాలకు. తానే స్వయంగా సినిమాలు చేస్తానని చెప్పి.. ఇలా సడన్‌గా ఇక సెలవు అనడం వెనుక ఏదో బలమైన కారణమే ఉండి ఉంటుందని ఆరాదీశారు కొందరు. అయితే వారి సర్వేలో తేలింది మాత్రం మళ్ళీ 'సరిలేరు నీకెవ్వరు' సినిమానే అని తెలుస్తోంది.

అంత గొప్పతనం ఏం ఉందని టాక్
సరిలేరు నీకెవ్వరు మూవీ సూపర్ సక్సెస్ సాధించింది.. అందులో విజయశాంతి పాత్ర గురించి ఎన్నో కామెంట్స్ వచ్చాయి. ఈమె బాగా నటించింది అనేవాళ్ల కంటే కూడా ఇందులో విజయశాంతి స్థాయి నటి చేయాల్సినంత గొప్పతనం ఏం ఉందని ప్రశ్నించిన వాళ్లే ఎక్కువగా ఉన్నారు. ఎందుకు ముందు నుంచి కూడా విజయశాంతే కావాలని అనిల్ చెప్పాడబ్బా అంటూ జోకులు వేసుకుంటున్నారు.

పరిస్థితి గమనించిన రాములమ్మ.. చివరకు
అంతేకాదు విజయశాంతి రెమ్యునరేషన్ గట్టిగానే తీసుకోవడంతో నిర్మాతలు కూడా ఆమెను తీసుకోవడానికి కాస్త భయపడుతున్నారట. దీంతో ఈ పరిస్థితి గమనించిన రాములమ్మ.. ఇక రాజకీయాలే బెటర్ అని నిర్ణయం తీసుకున్నట్లు
ఫిలిం నగర్ టాక్.