Don't Miss!
- News
వైసీపీకి ఎమ్మెల్యే కోటంరెడ్డి గుడ్ బై ? ఇన్ ఛార్జ్ రెడీ చేసుకుంటున్న జగన్ !
- Finance
Stock Market: బడ్జెట్ కి ముందు లాభాల ప్రారంభం.. కానీ మార్కెట్లో ఇన్వెస్టర్స్ మూడ్ ఇదే..
- Sports
నాదల్ రికార్డు సమం చేసి.. మళ్ళీ నంబర్ వన్ ర్యాంక్ చేరుకున్న జోకొవిక్..!
- Automobiles
ఎట్టకేలకు హైరైడర్ CNG విడుదల చేసిన టయోటా.. ధర ఎంతంటే?
- Lifestyle
Vastu Tips: లక్ష్మీదేవి లాంటి చీపురు ఎప్పుడు కొనాలి, ఇంట్లో ఎక్కడ పెట్టాలో తెలుసా?
- Technology
Oppo నుండి కొత్త టాబ్లెట్, లాంచ్ కు సిద్ధం! ఆన్లైన్ లో స్పెసిఫికేషన్లు లీక్ ..!
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
RED Alert.. యువ హీరోతో హెబ్బాపటేల్ ‘ఐటెం’ రొమాన్స్!
ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త సినిమా 'రెడ్'. కొంతకాలంగా ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. విభిన్న తరహా కథనంతో క్లాస్, మాస్ ఆడియన్స్ అందరినీ ఆకట్టుకునేలా ఈ మూవీ కథ సిద్ధం చేసుకొని కెమెరా ముందు పెట్టారు డైరెక్టర్ కిషోర్ తిరుమల.
ఈ సినిమాలో రామ్ సరసన నివేద పేతురాజ్, మాళవిక శర్మ, అమృత హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇటీవలే టాకీ పార్టు పూర్తిచేసిన చిత్రయూనిట్.. ప్రస్తుతం పాటల చిత్రీకరణను పూర్తిచేసే పనిలో పడింది. ఈ మేరకు ఇటలీలో రెండు పాటలను ప్లాన్ చేసి.. అక్కడి అందమైన లొకేషన్స్‌లో ఆ రెండు పాటలు పూర్తిచేశారు.

ఇక ఇప్పుడు హైదరాబాద్‌లో ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. ఈ పాట కోసం ప్రత్యేకంగా సెట్ వేశారు. ఇది చిత్రంలో స్పెషల్ సాంగ్ అని తెలుస్తోంది. ఇందులో రామ్‌తో కలిసి హీరోయిన్ హెబ్బా పటేల్ చిందులేస్తుండటం విశేషం. చిత్రంలో రామ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్స్ సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి.
స్రవంతి మూవీస్ బ్యానర్‌పై స్రవంతి రవికిషోర్ ఈ రెడ్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సినిమా షూటింగ్ తుది దశకు చేరుకోవడంతో ఏప్రిల్ 9న సినిమాను విడుదల చేసేందుకు రెడీ అయ్యారు. ఇప్పటికే ఈ మూవీ పట్ల అభిమానుల్లో అంచనాలు నెలకొన్నాయి.