నా ఫిల్మ్ కెరీర్ లోనే ఇలాంటి నటిని చూడలేదు.. ఆమె న్యూక్లియర్ బాంబ్: ఆర్జీవి షాకింగ్ కామెంట్స్
విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏ మాట్లాడిన సంచలనమే అని అందరికి తెలిసిన విషయమే. తెలిసిన విషయాన్ని కూడా చాలా కొత్తగా చెప్పడంతో.. ఆడియెన్స్ ఎక్కువగా ఎట్రాక్ట్ అవుతుంటారు. అయితే ఇటీవల ఈ కాంట్రవర్సీ దర్శకుడు కాంట్రవర్సీ క్వీన్ పై చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. నా జీవితంలో ఇలాంటి యాక్టర్ ను నేను చూడలేదు అంటూ ఆమె చేసిన ఒక పోస్ట్ పై సమాధానం ఇచ్చాడు.
మీటూ నుంచి పొలిటికల్ కాంట్రవర్సీ వరకు..
కాంట్రవర్సీ క్వీన్ కంగనా రనౌత్ సోషల్ మీడియాలో ఎంత చురుగ్గా ఉంటుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. మీటూ నుంచి పొలిటికల్ కాంట్రవర్సీ వరకు ఆమె సోలో ఎటాక్ గురించి అందరికి తెలిసిందే. ఒక విధంగా సినిమాల కంటే కూడా కంగనా తన వివాదాలతోనే ఎక్కువగా క్రేజ్ అందుకుంది. ఇక ఆమె చేసే సినిమాలు కూడా ఈ మధ్య అలానే ఉంటున్నాయి.

ఏజెంట్ పాత్రలో కంగనా
ప్రస్తుతం కంగాన ధాకడ్ అనే సినిమా చేస్తోంది. వార్ డ్రామాగా తెరకెక్కుతున్న ఆ సినిమా కోసం కంగనా చాలానే కష్టపడుతోంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఆ సినిమాలో కంగనా ఏజెంట్ పాత్రలో నటిస్తోంది. అయితే ఇటీవల ఆ సినిమాకు సంబంధించిన ఒక షూటింగ్ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ షాక్ అయ్యాడు.

అంతకంటే గొప్పది మరొకటి ఉండదు
సంఘర్షణలో ఓదార్పుని పొందడం వింతగా మీరు అనుకోవచ్చు, కత్తుల ఘర్షణ శబ్దంతో ప్రేమలో పడటం సాధ్యం కాదని మీరు అనుకోవచ్చు, మీకు బ్యాటల్ ఫీల్డ్ అనేది కేవలం అగ్లీ రియాలిటీ కావచ్చు కానీ పోరాటం కోసం జన్మించినవారికి అంతకంటే మరొక గొప్ప ప్రదేశం మరొకటి ఉండదు.. అని కంగనా ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.

నువ్వు నిజంగా న్యూ క్లియర్ బాంబ్
ఇక ఆమె సెల్ఫీ ఫొటోను చూసిన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఎవరు ఊహించని విధంగా కామెంట్ చేశారు. ఒక ప్రొఫెషనల్ ఫిల్మ్ మేకర్‌గా నా కెరీర్‌లో నేను చూసిన ఒక యాక్టర్ బెస్ట్ క్లోజప్ ఇది. ఇలాంటి రియాలిటీ ఫొటో చూసిన తరువాత ఎవరిని నేను ఇంత గొప్పగా గుర్తు చేసుకోలేను.. హే కంగనా నిజంగా నువ్వు న్యూక్లియర్ బాంబ్.. అంటూ రామ్ గోపాల్ వర్మ వివరణ ఇచ్చారు.


Click it and Unblock the Notifications











