మరణాన్ని ఆపేసే మెడిసిన్.. ఆర్జీవి షాకింగ్ ట్వీట్.. అసలు కథేమిటంటే!
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇటీవల పాన్ ఇండియా తరహాలో ఒక కొత్త ఓటీటీ ఫ్లాట్ ను ఎనౌన్స్మెంట్ చేసిన విషయం తెలిసిందే. ప్రభాస్ నుంచి బ్రహ్మానందం వరకు అనేక మంది అగ్ర నటీనటులు స్పార్క్ అనే ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ రాబోతున్నట్లు ప్రమోషన్ గట్టిగానే చేశారు. రొటీన్ కు భిన్నంగా ఉండే ఎలాంటి కంటెంట్ అయినా సరే వర్మకు నచ్చితే ఈ రూట్లో రిలీజ్ చేసి బెస్ట్ కంటెంట్ ఇచ్చిన వారికి ప్రైజ్ మనీ కూడా ఉంటుందని చెప్పాడు.
స్పార్క్ లో ఎంత మంచి కంటెంట్ రాబోతుందో వర్మ ట్విట్టర్ ను ఫాలో అయితే ఈజీగా అర్ధమవుతోంది. టాబ్లెట్ అనే ఒక కొత్త తరహా పోస్టర్ ను విడుదల చేస్తూ సినిమా ఎలా ఉంటుందో వివరణ ఇచ్చారు. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా వృద్ధాప్యం తో పాటు చావు దగ్గర పడితే ఆందోళన చెందుతారు అంటూ.. అయితే ఈ సినిమా వయసుతో పాటు మరణాన్ని కూడా ఆపేసే బలమైన మెడిసిన్ చుట్టు తిరుగుతుందని వివరణ ఇచ్చారు. మానవాళికి ఎప్పటికప్పుడు అతిపెద్ద బూన్ గా కనిపించేది అతి పెద్ద కర్స్ అని త్వరలో గ్రహించబడుతుందను పేర్కొన్నారు.

ఇక ఈ సినిమాను సాగర్ మచానురు నిర్మించగా కమల్ ఆర్ దర్శకత్వం వహించారు. స్పార్క్ లో విడుదల అవుతున్నట్లు వర్మ వివరణ ఇచ్చారు. వర్మ ప్లానింగ్ చూస్తుంటే స్పార్క్ సంస్థకు ఒక విభిన్నమైన క్రేజ్ తెచ్చేలా ఉన్నట్లు టాక్ వస్తోంది. రెగ్యులర్ గా కాకుండా కొత్త తరహా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ను ఇష్టపడే ప్రేక్షకలకు స్పెషల్ ఫ్లాట్ ఫార్మ్ క్రియేట్ చేస్తున్నట్లు అర్ధమవుతోంది. ఇక వర్మ తెరకెక్కించిన బిగ్గెస్ట్ రియల్ క్రైమ్ మూవీ దావూద్ ఇబ్రహీమ్ కూడా స్పార్క్ లో విడుదల కాబోతున్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











