Roar Of RRR: స్పెషల్ ట్యాగ్ తో మెగా అభిమానుల హంగామా.. రికార్డులు బ్లాస్ట్ అయ్యేలా..
టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా వరల్డ్ వైడ్ గా ఉన్న ఇండియా సినిమా లవర్స్ అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో RRR మొదటి స్థానంలో ఉంది. బాహుబలి అనంతరం దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమా కావడంతో రోజురోజుకు అంచనాలు ఆకాశాన్ని దాటేస్తున్నాయి. దానికితోడు సినిమా అప్డేట్స్ కూడా అంచనాల డోస్ ను మరింత పెంచేస్తున్నాయి.
ఈ నెల 15న రోర్ ఆఫ్ RRR పేరుతో ఒక మేకింగ్ వీడియోను రిలీజ్ చేయబోతున్న విషయం తెలిసిందే. ఇక రెండు రోజుల ముందే ఇరు వర్గాల అభిమానులు సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్స్ తో సందడి మొదలు పెట్టారు. ముందుగా మెగా అభిమానులు స్పెషల్ హ్యాష్ ట్యాగ్ తో ఇప్పటికే ట్రెండింగ్ లిస్ట్ లోకి వచ్చేశారు. #SeethaRAMaRajuCHARAN అంటూ రికార్డులు బ్లాస్ట్ అయ్యేలా దేశవ్యాప్తంగా ట్రెండ్ చేస్తున్నారు.

రామ్ చరణ్ ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక జూనియర్ ఎన్టీఆర్ కొమరం బీమ్ పాత్రలో అల్లూరితో సమానంగా కనిపించబోతున్నాడు. వీరిద్దరు కూడా సినిమాలో మంచి స్నేహితులుగా కనిపిస్తారని ఇటీవల వదిలిన పోస్టర్ తోనే అర్ధమయ్యింది. అంతే కాకుండా కథలో భాగంగా ఇద్దరి మధ్య ఎమోషనల్ ఫైట్ సీన్స్ కూడా ఉంటాయని రైటర్ విజయేంద్రప్రసాద్ ఒక క్లారిటీ ఇచ్చేశాడు.
మరి సినిమా అభిమానుల అంచనాలను ఏ స్థాయిలో అందుకుంటుందో చూడాలి. ఇక సంగీత దర్శకుడు ఎమ్ఎమ్. కీరవాణి మ్యూజిక్ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ గా నిలవనుందట. త్వరలోనే మ్యూజిక్ సందడి కూడా మొదలవుతుందని అంటున్నారు. ఇక మొదటి పాట రామ్ చరణ్, ఎన్టీఆర్ కాంబినేషన్ లోనే ఉంటుందని సమాచారం.


Click it and Unblock the Notifications











