twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మాధవన్ ‘రాకెట్రీ’: ఆ యాభై రోజుల వెనక కథేంటి? కుట్ర కోణం ఉందా?

    |

    మాధవన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న 'రాకెట్రీ-ది నంబి ఎఫెక్ట్' అనే చిత్రం టీజర్ ఇపుడు అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ రోజు మనం చరిత్ర సృష్టించాం అంటూ ప్రధాని నరేంద్ర మోడీ స్పీచ్‌తో మొదలైన ఈ టీజర్లో ఇస్రో సక్సెస్‌ఫుల్‌గా లాంచ్ చేసిన మార్స్ ఆర్బిటర్ మిషన్(మామ్) నింగికేగుతూ కనిపించింది.

    అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా 671 మిలియణ్ డాలర్లు ఖర్చు చేసి 19 సార్లు ప్రయత్నించిన తర్వాత సక్సెస్ అయింది. రష్యా 117 మిలియన్లు ఖర్చు చేసి 16 సార్లు ప్రయత్నించిన తర్వాత సక్సెస్ అయింది. ఇండియా కేవలం 74 మిలియన్లు ఖర్చు చేసి మొదటి ప్రయత్నంలోనే సక్సెస్ అయింది అంటూ ఇందులో చూపించారు. అయితే అసలు కథ ఇది కాదు.

    ఆ రోజుల మూల్యం చెల్లించడం వెనక

    ఆ రోజుల మూల్యం చెల్లించడం వెనక

    వీడియో చివర్లో... ‘నా పేరు నంబి నారాయణన్, నేను 35 సంవత్సరాలు రాకెట్రీలో గడిపాను, 50 రోజులు జైల్లో గడిపాను. ఆ యాభై రోజుల మూల్యం ఏదైతే నా దేశం చెల్లించిందో దాని గురించి ఈ కథ... నా గురించి కాదు' అని మాధవన్ పాత్ర చెబుతూ కనిపించింది.

     ఎవరీ నంబి నారాయణన్

    ఎవరీ నంబి నారాయణన్

    నంబి నారాయణన్ ఇస్రోలో సీనియర్ సైంటిస్ట్. అయితే అతడు గూఢచర్య కార్యకలాపాలకు పాల్పడ్డట్లు 1994లో ఆరోపణలు వచ్చాయి. అతడిపై వచ్చిన ఆరోపణలను సీబీఐ 1996లో కొట్టిపారేసింది. 1998లో సుప్రీం కోర్టు సైతం ఏ తప్పూ చేయలేదని తేల్చి చెప్పింది.

    మూడు ముఖ్యమైన కోణాలు

    మూడు ముఖ్యమైన కోణాలు

    నంబి నారాయణన్ పాత్రలో మాధవన్ కనిపించడంతో పాటు.... త‌మిళ ద‌ర్శకుడు అనంత మ‌హ‌దేవ‌న్‌తో కలిసి స్వయంగా దర్శకత్వం బాధ్యతలను కూడా చేపడుతున్నాడు. నంబి నారాయ‌ణ్ జీవితంలోని మూడు ప్రధాన కోణాల‌ని బ‌యోపిక్‌లో చూపించనున్నట్టు తెలుస్తోంది.

    సినిమా ఎప్పుడు వస్తోంది?

    ‘రాకెట్రీ-ది నంబి ఎఫెక్ట్' చిత్రాన్ని 2019 సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. తెలుగు, తమిళ, ఇంగ్లీష్‌, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు.

    English summary
    The teaser of R Madhavan starrer Rocketry – The Nambi Effect starts with Prime Minister Narendra Modi announcing the successful launch of Mars Orbiter Mission (MOM) by Indian Space Research Organisation (ISRO). Madhavan play Nambi Narayanan role in this movie. Nambi Narayanan was a senior official at ISRO and was charged with espionage in 1994. CBI dismissed the charges against him in 1996 and in 1998, Supreme Court declared him not guilty.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X