Don't Miss!
- News
`కంగ్రాట్యులేషన్స్ కేటీఆర్ గారు`: సూపర్ స్టార్ మహేష్ బాబు స్పెషల్ గ్రీటింగ్స్..!!
- Sports
IND vs NZ: టీమిండియాను దెబ్బతీసిన ఇషాన్ కిషన్ తత్తరపాటు!వీడియో
- Lifestyle
వినడం కూడా ఒక కళ, మీకు పెళ్లైతే వినడం నేర్చుకోవాల్సిందే..
- Finance
womens ipl: ఒకే ఆటలో అంబానీ-అదానీ.. పిచ్ లో నిలిచేదెవరు..? చివరికి గెలిచేదెవరు..?
- Technology
ఇండియా సొంత మొబైల్ OS, BharOS ను మీ ఫోన్లో అప్డేట్ చేయవచ్చా? తెలుసుకోండి.
- Automobiles
గ్రాండ్ విటారా కోసం రీకాల్ ప్రకటించిన మారుతి సుజుకి.. కారణం ఏమిటంటే?
- Travel
రథసప్తమికి ముస్తాబవుతోన్న అరసవల్లి సూర్యదేవాలయం!
బ్రేకింగ్: Oscars 2023 nominations చరిత్ర సృష్టించిన RRR.. ఆస్కార్ రేసులో రాజమౌళి మూవీ
భారతీయ సినిమా ప్రేక్షకులు, అభిమానుల కల సాకారమైంది. ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డు కోసం RRR చిత్రం నామినేషన్ సాధించింది. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన RRR చిత్రం ఆస్కార్ అవార్డుల రేసులో సత్తా చాటింది. ఈ ఏడాది మార్చిలో జరుగబోయే అవార్డుల వేడుకలో ఆస్కార్‌ను సాధించడంనికి RRR సిద్దమైంది. ఈ నామినేషన్ వివరాల్లోకి వెళితే..

అధికారికంగా ఆస్కార్ రేసులోకి
ఆస్కార్ నామినేషన్ ప్రకటన కార్యక్రమం మంగళవారం జరిగింది. ఈ వేడుకలో ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటు సాంగ్ నామినేట్ అయింది. దీంతో చరిత్ర సృష్టించేందుకు RRR సిద్దమైంది. నాటు నాటు సాంగ్ నామినేట్ అయినట్టు ఆస్కార్ కమిటీ అధికారికంగా ప్రకటించింది.

నామినేషన్ల ప్రకటన కార్యక్రమంలో
ఆస్కార్ నామినేషన్ల ప్రకటన వేడుకకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న రిజ్ విల్సన్, అలిసన్ విలియమ్స్ నామినేషన్ల వివరాలను ప్రకటించారు. భారత కాలమానం ప్రకారం జనవరి 24వ మంగళవారం రాత్రి 7 గంటలకు ఈ కార్యక్రమం జరిగింది. పలు కేటగిరీల కోసం నామినేషన్లు ప్రకటించారు. ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో నాటు నాటు నామినేట్ అయిందని ప్రకటించారు.

నాటు నాటు పోటీ పడేది ఈ పాటలతోనే
ఆస్కార్ అవార్డు 2023 కోసం ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో నామినేట్ అయిన చిత్రాల వివరాలు ఇలా ఉన్నాయి. టెల్ ఇట్ లైక్ ఏ ఉమెన్ చిత్రంలో అప్లాజ్, అలాగే టాప్ గన్: మావెరిక్ చిత్రంలోని హోల్డ్ మై హ్యాండ్, బ్లాక్ పాంథర్: వాకండా ఫెరవర్ చిత్రంలోని లిఫ్ట్ మీ అప్, RRR సినిమాలోని నాటు నాటు పాట, ఎవ్రీథింగ్, ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ చిత్రంలోని దిస్ ఈజ్ ఏ లైఫ్ పాట నామినేట్ అయ్యాయి.

ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫితో
ఇక నాటు నాటు సాంగ్ విషయానికి వస్తే.. కేవలం తెలుగులోనే కాకుండా హిందీ, ఇతర భాషలతోపాటు విదేశాల్లో కూడా ఈ పాట అన్ని వర్గాలను ఆకట్టుకొన్నది. చంద్రబోస్ రాసిన సాహిత్యానికి.. రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ ఆలపించారు. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ పాటకు ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. ఈ పాటకు ప్రేమ రక్షిత్ కొరియోగ్రఫిని అందించారు.

నాటు నాటుకు పలు అవార్డులు
నాటు నాటు సాంగ్ విషయానికి వస్తే.. ఇప్పటికే అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటింది. గోల్డెన్ గ్లోబ్ అవార్డు, క్రిటిక్స్ ఛాయిస్ అవార్డును సాధించింది. ప్రస్తుతం ఆస్కార్ బరిలోకి దూకింది. ఈ పాట ఆస్కార్ అవార్డుకు నామినేట్ కావడంపై దేశవ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి.