#RT68 : మునుపెన్నడూ కనిపించని లుక్ లో రవితేజ… రెండు చేతులా పని చేస్తూ!
ఇప్పుడున్న కుర్ర హీరోలతో పోటీ పడుతూ వరుసగా సినిమాలు చేస్తున్నాడు మాస్ మహారాజ్ రవితేజ. ఈ ఏడాది మొదట్లో క్రాక్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న రవితేజ ఇప్పటికే ఖిలాడీ అనే సినిమా చేస్తున్నాడు. రాక్షసుడు సినిమాతో హిట్ కొట్టిన మళ్లీ ఫామ్ లోకి వచ్చిన రమేష్ వర్మ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. అది కాకుండా ఆయన ఈ ఏడాది మొదట్లో కొత్త దర్శకుడు శరత్ మండవ దర్శకత్వంలో ఒక సినిమా ప్రారంభించారు. షూట్ ముందే షూట్ ప్రారంభించాల్సి ఉన్నా కరోనా రెండవ వేవ్ కారణంగా ఆగింది.
అయితే ఈ మధ్యనే ఈ సినిమా షూటింగ్ కూడా మొదలైంది. ఇక ఈ సినిమా హీరోయిన్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ గురించి కొన్ని రోజులుగా చర్చ జరుగుతూనే ఉంది. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తున్నట్టు పేర్కొన్నారు. ప్రస్తుతానికి ఈ సినిమాని రవితేజ 68 అంటే #RT68గా వ్యవరిస్తున్నారు. ఈ ఫస్ట్ లుక్ ని రేపు ఉదయం 10:08 నిముషాలకు రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఇక గతంలోనే ఈ సినిమా ఫస్ట్ లుక్ మైండ్ బ్లోయింగ్ గా ఉంటుందని, టైటిల్ కిక్కాస్ గా ఉంటుందని దర్శకుడు హింట్స్ ఇచ్చాడు.

అలా మొత్తం మీద సినిమా ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ కూడా కాకుండానే సినిమా మీద అంచనాలు పెంచుతున్నాడు ఆయన. మరి ఈ ఫస్ట్ లుక్ ఇంకెంత రచ్చ రేపుతుందో వేచి చూడాలి మరి. ఈ చిత్రంలో రవితేజ మెజిస్ట్రేట్ కార్యాలయంలో పని చేసే ఉద్యోగిగా కనిపించబోతున్నట్టు గతంలో రిలీజ్ చేసిన ప్రీ లుక్స్ తో క్లారిటీ వచ్చింది. అయితే ఈ సినిమాలో రవితేజ ఎమ్మార్వోగా కనిపిస్తాడని మరో ప్రచారం కూడా జరుగుతోంది. అయితే రేపటి ఫస్ట్ లుక్ లో దీనికి సమబందించి మరింత క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇక ఈరోజు రిలీజ్ చేసిన లుక్ లో రెండు చేతులతో ఒకే సారి సంతకాలు పెడుతున్నట్టు చూపించారు. దీంతో ఈ ఫస్ట్ లుక్ మీద మరిన్ని అంచనాలు పెరుగుతున్నాయి.


Click it and Unblock the Notifications











