RX 100 బాలీవుడ్ రైట్స్‌కు రికార్డు ధర.. భారీ మొత్తానికి అమ్మకం
RX 100 చిన్న తరహా బడ్జెట్ చిత్రంగా మొదలై భారీ విజయాన్ని సొంతం చేసుకొన్న సంగతి తెలిసిందే. నిర్మాత అశోక్ రెడ్డి గుమ్మంకొండకు ఊహించని విజయాన్ని సాధించిపెట్టింది. హీరో కార్తీకేయకు క్రేజీ హీరోగా పేరు సంపాదించిపెట్టింది. ఈ చిత్రం రూ.25 కోట్లకుపైగా గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకొన్నది.
ఇంతటితో నిర్మాత అశోక్ రెడ్డి కలెక్షన్ల పంట ఆగిందంటే పప్పులే కాలేసినట్టే. ఎందుకంటే ఈ చిత్ర హిందీ రైట్స్ కోసం బాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థ రూ.1.5 కోట్లు చెల్లించినట్టు సమాచారం. ప్రస్తుతం ఈ బిజినెస్ టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.

కన్నడ హక్కుల కోసం భారీ ఆఫర్ వచ్చినట్టు తెలుస్తున్నది. ఇంకా కన్నడ హక్కుల వ్యవహారం చర్చల దశలో ఉన్నట్టు సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.
వర్మ శిష్యుడు అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో కార్తీకేయ, పాయల్ రాజ్‌పుత్ హీరో, హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా శాటిలైట్ హక్కుల రేట్ కూడా బ్రహ్మండంగా పలికిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











