నాగ్‌తో కార్తికేయ.. కల నిజమైంది.. కలిసింది అందుకేనా?
టాలీవుడ్‌లో ఇటీవల వచ్చిన RX100 చిత్రం భారీ సక్సెస్‌ను అందుకొన్నది. చిత్ర హీరో కార్తికేయ, పాయల్ రాజ్‌పుత్ కెమిస్ట్రీ వర్కవుట్ కావడంతో కాసుల పంటపడింది. సీనియర్ నటులు రాంకీ, రావు రమేష్ తదితరులు నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూలు సాధించింది. కార్తీకేయకు, చిత్ర దర్శకుడు అజయ్ భూపతికి మంచి పేరు లభించింది.
అయితే RX100 హీరో కార్తికేయ, దర్శకుడు అజయ్ భూపతి ఇద్దరు ఇటీవల టాలీవుడ్ మన్మధుడు అక్కినేని నాగార్జున కలిశారు. ఈ సందర్బంగా దిగిన ఫోటోలను తమ ట్విట్టర్ అకౌంట్లో షేర్ చేసుకొన్నారు. వీరివెంట RX100 నిర్మాత జీ అశోక్‌రెడ్డి కూడా ఉన్నారు.

నా కల నిజమైన రోజు. RX100 బ్లాక్‌బస్టర్ అయినప్పుడు కూడా ఇంత ఉద్వేగానికి గురికాలేదు. నాగార్జున సార్‌ను కలువడం నా జీవితంలోనే అత్యుత్తమ రోజు అని కార్తీకేయ ట్వీట్‌లో పేర్కొన్నాడు.
అయితే నాగార్జున కలువడంపై అనేక ఊహాగానాలు వస్తున్నాయి. నిర్మాత అశోక్ రెడ్డి సారథ్యంలో నాగార్జునతో అజయ్ భూపతి సినిమా చేయబోతున్నారనే మాట వినిపిస్తున్నది.


Click it and Unblock the Notifications











