twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హిస్టరీ క్రియేట్ అయింది.. సక్సెస్ ఫుల్ చేశారు.. కంగ్రాట్స్: రాజమౌళి

    |

    భారత దేశం గర్వించదగిన ప్రయోగం సక్సెస్ ఫుల్‌గా లాంచ్ అయింది. చంద్రుడిపై పరిశోధనల నిమిత్తం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చంద్రయాన్‌ 2 ఉపగ్రహ ప్రయోగం చేసింది. 3.84లక్షల కి.మీల దూరం ప్రయాణించనున్న ఈ ఉపగ్రహం సెప్టెంబర్‌ 7న చంద్రుడిపై వాలనుంది. జీఎస్‌ఎల్‌వీ-మార్క్‌3ఎం1 వాహకనౌక (రాకెట్‌) ద్వారా పంపిన ఈ ఉపగ్రహానికి 'బాహుబలి' అని పేరు పెట్టారు.

    ఈ ఉపగ్రహంలో ఆర్బిటర్‌, ల్యాండర్‌, రోవర్‌ అనే మూడు పరికరాలు ఉంటాయి. వీటి మొత్తం బరువు 3447 కిలోలు. ఆర్బిటర్‌ చంద్రుడి చుట్టూ తిరుగుతూ సమాచారాన్ని సేకరిస్తే... ల్యాండర్‌ ద్వారా రోవర్ చంద్రుడిపై దిగా అక్కడ నీటి ఆనవాళ్లపై పరిశోధన చేస్తుంది.

    S. S. Rajamouli tweet on Chandrayaan 2


    చంద్రయాన్ 2ను విజయవంతంగా రోదసీ లోకి పంపడంతో ఇస్రోని అభినందిస్తూ పలువురు ప్రముఖులు ట్వీట్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దర్శకదీరుడు రాజమౌళి స్పందిస్తూ.. ''హిస్టరీ క్రియేట్ అయింది.. ప్రయోగం సక్సెస్ ఫుల్ చేశారు.. కంగ్రాచులేషన్స్'' అని ట్వీట్ చేశారు. మరోవైపు రోదసీ నౌకకు రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి' అని పేరు పెట్టడం గౌరవంగా భావిస్తున్నామని ప్రభాస్ ట్వీట్ చేశాడు.

    ప్రస్తుతం రాజమౌళి RRR సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నారు. బాహుబలి తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆయన ఈ సినిమా రూపొందిస్తున్నారు. చిత్రంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తుండగా.. ఆలియా భట్ హీరోయిన్ గా చేస్తోంది. మరో హీరోయిన్ సెలెక్ట్ కావాల్సి ఉంది. భారీ బడ్జెట్ కేటాయించి డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు.

    English summary
    Isro Successfully launched Chandrayaan 2 today. On this successfull launch director S. S. Rajamouli tweeted and congratulate to the isro team.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X