For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Sai Dharam Tej: మేమిద్దరం మంచి ఫ్రెండ్స్.. బైక్ నేనే ఇచ్చా.. యాక్సిడెంట్ అలా అంటూ సునిశిత్ సంచలనం!

  |

  సోషల్ మీడియా ఎక్కువగా యాక్టివ్ గా ఉండే వాళ్ళందరికీ సునిశిత్ అనే పేరును ప్రత్యేకంగా పరిచయం చేయక్కర్లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు ఒక్క సినిమాల్లో కనిపించకపోయినా తాను ఒక పెద్ద స్టార్ హీరోని కావాల్సిన వాడిని అని, నాన్నకు ప్రేమతో అలాగే వన్-నేనొక్కడినే లాంటి సినిమాలు చేయాల్సి ఉండగా వాటిని మహేష్ బాబు. ఎన్టీఆర్ లాంటి వాళ్ళు లాక్కున్నారని అలా తనను తొక్కేసి ఆ సినిమాలతో వాళ్లు ఎదిగారని కామెంట్స్ చేస్తూ హైలెట్ అయ్యాడు. అలాంటి సునిశిత్ మళ్లీ వార్తల్లోకి ఎక్కాడు, అది కూడా సాయి ధరమ్ తేజ్ బైక్ యాక్సిడెంట్ గురించి ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు సంచలనంగా మారుతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే

  ప్రదీప్ ఫిర్యాదుతో

  ప్రదీప్ ఫిర్యాదుతో

  యాంకర్ ప్రదీప్ ఒక అమ్మాయిని మోసం చేశారని ఫిర్యాదు చేసి ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కాడు సునిశిత్. అప్పటి వరకు అతను ఎవరో తెలియక పోయినా ప్రదీప్ మీద కంప్లైంట్ ఇవ్వడంతో మీడియా అతని మీద ఫోకస్ పెట్టింది. దీంతో మతి లేక చెబుతున్నాడో లేక ఫేమస్ చెబుతున్నాడో తెలియదు కానీ తనను ఇండస్ట్రీలో ఎదగనివ్వకుండా ఎన్టీఆర్, మహేష్ బాబు, లాంటి స్టార్ హీరోలు తన సినిమాలు లాక్కున్నారని కామెంట్ చేశాడు.

  లావణ్య కేసు పెట్టడంతో

  లావణ్య కేసు పెట్టడంతో

  రామ్ చరణ్ నటించిన రంగస్థలం, ఎన్టీఆర్ నటించిన నాన్నకు ప్రేమతో, మహేష్ బాబు నటించిన వన్ నేనొక్కడినే వంటి సినిమాలు ముందు తాను చేయాల్సి ఉండగా సుకుమార్ ను భయ పెట్టి వాళ్ళు ఆ సినిమాలో హీరోగా నటించరని చేసిన కామెంట్లు సంచలనంగా మారాయి. ఆ తర్వాత కూడా తాను లావణ్య త్రిపాఠి పెళ్లి చేసుకుందామని చెప్పి తనను మోసం చేసి ఆమె వెళ్లిపోయిందని ఒక ఇంటర్వ్యూలో కామెంట్ చేయడంతో లావణ్య త్రిపాఠి పోలీస్ స్టేషన్లో కేసు కూడా పెట్టగా పోలీసులు అరెస్టు చేసి తర్వాత బెయిల్ మీద విడుదల చేశారు.

  తేజ్ ప్రమాదం మీద కామెంట్లు

  తేజ్ ప్రమాదం మీద కామెంట్లు

  అయితే ఆ తర్వాత సునిశిత్ కొద్ది రోజులుగా పెద్దగా ఎలాంటి కామెంట్లు చేయడం లేదు. కానీ తాజాగా సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదం విషయం మీద మళ్ళీ వెలుగులోకి వచ్చాడు. ఈ నెల 10వ తేదీ సాయంత్రం సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. తన ఇంటి నుంచి గచ్చిబౌలి వెళ్తున్న క్రమంలో ఇసుకలో బండి స్కిడ్ కావడంతో ఆయన పడిపోయారు తీవ్ర గాయాలు కావడంతో ఇప్పటి కూడా అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.

  నేనే ఇచ్చేశా మళ్ళీ

  నేనే ఇచ్చేశా మళ్ళీ

  ఈ విషయం గురించి ఒక వీడియో విడుదల చేసిన సునిశిత్ ఇప్పటి వరకు మీడియా కానీ మెగా కుటుంబ సభ్యులు కానీ వెల్లడించని సంచలన విషయాలను చెప్పుకొచ్చాడు. అయితే అవేవీ నమ్మశక్యంగా లేవని అనుకోండి అది వేరే విషయం. ఇక సునిశిత్ విడుదల చేసిన వీడియో ప్రకారం ఆ బైక్ సాయిధరమ్ తేజ్ ముందుగా సునిశిత్ కి గిఫ్ట్ గా ఇచ్చాడట. తామిద్దరం మంచి స్నేహితులం అని ఆ స్నేహానికి గుర్తుగా తనకు బైక్ ఇవ్వడంతో అది బాగా ఖరీదైనది కాబట్టి అతను దానిని మెయిన్ టెయిన్ చేయ లేకపోయానని మళ్లీ సాయి ధరమ్ తేజ్ కి ఇచ్చేయడంతో ఆయనే వాడుకుంటున్నానని చెప్పుకొచ్చాడు.

  అందుకే అలా పడింది

  అందుకే అలా పడింది

  అయితే మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం బైక్ జారి పోయి కింద పడింది అని అంటున్నారని కానీ ఈ హై అండ్ స్పోర్ట్స్ బైక్ లో యాక్షన్ కంట్రోల్ లోనే ఒక ఆప్షన్ ఉంటుందని ఆ ఆప్షన్ కారణంగా బైక్ చక్రం చాలా సార్లు తిరిగి బైక్ స్కిడ్ అయింది అని చెప్పుకొచ్చాడు. అయితే బేసిగ్గా సునిశిత్ ఇంటర్వ్యూలు ఒక్క సారి విని ఎవరైనా అతనికి మతి స్థిమితం లేదు అనుకుంటారు లేదా ఫేమస్ కావాలని ఇలా మాట్లాడుతున్నాడు అని అనుకుంటారు. సో సునిశిత్ చేసిన కామెంట్స్ గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ మెగా ఫ్యాన్స్ మాత్రం ఈ విషయంలో కూడా పాపులారిటీ పెంచుకోవడానికి చూడడంతో తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.

  English summary
  Sacrifice Star sunisith Sensational Comments On Sai Dharam Tej Accident, he revealed that he gifted the bike to sai dharam tej.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X