మరో సీనియర్ డైరెక్టర్ శిష్యుడిని లైన్‌లో పెట్టిన సాయి ధరమ్ తేజ్
కొత్త దర్శకులతో వర్క్ చేయాలి అంటే ఈ తరం మిడియామ్ హీరోలు కూడా పెద్దగా ఇంట్రెస్ట్ చూపడం లేదు. అప్పట్లో గోపిచంద్ కొత్త దర్శకులతో సినిమాలు చేసి బాక్సాఫీస్ హిట్స్ అందుకున్నాడు. నేటితరం హీరోలు మాత్రం ఆ విధంగా కొత్త వారితో వర్క్ చేయడానికి సాహసం చేయడం లేదు. కానీ సాయి ధరమ్ తేజ్ మాత్రం ఇప్పుడిపుడే ఆ విధంగా అడుగులు వేస్తున్నాడు. కథ నచ్చితే చాలు దర్శకుడిని నమ్మి అవకాశం ఇస్తున్నాడు.
అయితే కొన్నిసార్లు అపజయాలు ఎదురైనప్పటికి మెగా హీరో ఆ విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. మంచి దర్శకుల వద్ద పని చేసిన వారితో కొంత కాలం ట్రావెల్ అయ్యి ఆ తరువాత సినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఇటీవల సుకుమార్ బ్యానర్ లో సాయి ఒక సినిమా చేయడానికి గ్రీన్ సైన్ ఇచ్చిన విషయం తెలిసిందే. పిరియాడిక్ డ్రామాగా రూపొందుతున్న ఆ సినిమాను సుకుమార్ శిష్యుడు తెరకెక్కిస్తున్నాడు.

ఇక ఇప్పుడు కృష్ణవంశీ దగ్గర ఎంతో కాలంగా పనిచేస్తున్న రామ్ అనే అసిస్టెంట్ దర్శకుడికి అవకాశం ఇవ్వడానికి సాయి ధరమ్ తేజ్ సిద్ధమైనట్లు టాక్. మంచి ఫ్యామిలీ అండ్ ఎమోషనల్ కథను చెప్పడంతో సాయి ఎప్పుడో ఇంప్రెస్ అయ్యాడట. ఒక సీనియర్ నిర్మాతకు కూడా కథను వినిపించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సాయి, దేవకట్టా దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇక న్యూ డైరెక్టర్ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ అనంతరం ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం


Click it and Unblock the Notifications











