Sai Dharam Tej Health Bulletin: కృత్రిమ శ్వాసను అందిస్తున్నాం.. క్రిటికల్ కేర్ నిపుణుల పర్యవేక్షణలోనే..

టాలీవుడ్ హీరో సాయిధరమ్ తేజ్ ప్రమాదానికి గురై అభిమానులను, సినీ ప్రేక్షకులను విషాదానికి గురిచేసిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 10 వినాయక చవితి పండుగ రోజున హైటెక్‌ సిటీకి సమీపంలోని మైండ్ స్పేస్‌ వద్ద నున్న ఐకియా స్టోర్ ప్రాంతంలో వేగంగా స్పోర్ట్స్ బైక్‌ను నడుపుతూ యాక్సిడెంట్‌కు గురై సమీప హాస్పిటల్‌లో చేరారు. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం సాయిధరమ్ తేజ్‌ను కుటుంబ సభ్యులు జూబ్లీహిల్స్‌లోని అపోలో హాస్పిటల్‌కు తరలించగా.. అక్కడే ఉత్తమ వైద్యుల పర్యవేక్షణలో కోలుకొంటున్నారు.

సెప్టెంబర్ 10వ తేదీన హాస్పిటల్‌లో చేరిన సాయిధరమ్ తేజ్‌కు భుజానికి క్లిష్టమైన సర్జరీ చేశారు. భుజం ఎముక విరిగిపోవడంతో ఈ సర్జరీ చేసినట్టు వైద్యులు తమ బులెటిన్‌లో వెల్లడించారు. అయితే ఇంకా సాయిధరమ్ తేజ్‌కు వెంటిలెటర్‌పై చికిత్స అందిస్తున్నారు.

Sai Dharam Tej Health Bulletin: Still Tej is on Respiratory Support

సాయిధరమ్ తేజ్ ఆరోగ్యంపై మెగా అభిమానుల్లో వ్యక్తమవుతున్న ఆందోళనను దృష్టిలోపెట్టుకొని ప్రతీ రోజు హెల్త్ బులెటిన్‌ను అపోలో వైద్యులు విడుదల చేస్తున్నారు. అయితే అందులో భాగంగానే సెప్టెంబర్ 14వ తేదీన కూడా సాయిధరమ్ తేజ్ ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్‌ను రిలీజ్ చేశారు.

హెల్త్ బులెటిన్‌ పేర్కొన్న ప్రకారం... సాయిధరమ్ తేజ్ ఆరోగ్యం నిలకడగా ఉంది. వెంటిలెటర్‌ సపోర్ట్‌ విధానంలో చికిత్సను అందిస్తున్నాం. బయోమెడికల్ టెస్టులు సంతృప్తికరంగా ఉన్నాయి. ప్రధాన అవయవాల పనితీరు బాగుంది. అతని క్రిటికల్ కండిషన్‌ గురించి నైపుణ్యులైన వైద్యుల బృందం పర్యవేక్షిస్తున్నారు అని వెల్లడించారు.

అపోలో హాస్పిటల్‌లోని క్రిటికల్ కేర్ విభాగంలో సాయిధరమ్ తేజ్‌కు చికిత్స జరుగుతున్న విషయం తెలిసిందే. న్యూరో సర్జన్ డాక్టర్ అలోక్ రంజాన్, క్రిటికల్ కేర్ డాక్టర్ సుబ్బారెడ్డి, పాలమనాలజిస్ట్ డాక్టర్ సాయి ప్రవీణ్ హరనాథ్, ఆర్థోపెడిక్స్ సర్జన్ డాక్టర్ బాలవర్ధన్‌రెడ్డితో కూడిన బృందం ఐసీయూలో చికిత్సను అందిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X