Don't Miss!
- Sports
Australia Open 2023 క్వీన్ అరినా సబలెంక..!
- Lifestyle
Astrology Tips: స్త్రీలు చేయకూడని పనులు.. వాటిని చేయడం వల్ల ఇంట్లో దరిద్రమే
- News
YCPకి నియోజకవర్గాన్ని రాసిస్తున్న TDP సీనియర్ నేత!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
- Finance
Multibagger Stock: ఒక సంవత్సరంలో 1000 శాతం రాబడి అందించిన మల్టీబ్యాగర్ స్టాక్ ఇదే..!
- Technology
ధర రూ.15000 ల లోపు మార్కెట్లో ఉన్న బెస్ట్ 5G ఫోన్లు! లిస్ట్ ,ధర వివరాలు!
- Automobiles
దేశీయ విఫణిలో విడుదలైన కొత్త BMW X1: ధర రూ. 45.90 లక్షలు
అక్కడ సత్తా చాటిన ‘రిపబ్లిక్’ మూవీ: ఏడు రోజుల్లోనే 12 కోట్లు.. సాయి ధరమ్ అరుదైన ఘనత
మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. చాలా తక్కువ సమయంలోనే స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్. కెరీర్ ఆరంభంలోనే తన సత్తాను నిరూపించుకున్న అతడు ఎన్నో విజయాలను ఖాతాలో వేసుకున్నాడు. అయితే, మధ్యలో చాలా కాలం పాటు వరుస పరాజయాలతో సతమతం అయ్యాడు. దీంతో అతడి కెరీర్ ముగిసిపోతుందని అంతా అనుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో 'చిత్రలహరి' చిత్రంతో మరోసారి హిట్ ట్రాక్ ఎక్కాడు. అప్పటి నుంచి వెనుదిరిగి చూడకుండా వరుసగా హిట్ల మీద హిట్లను అందుకుంటూ ఫుల్ ఫామ్‌తో కనిపిస్తున్నాడు.
మాల్దీవుల్లో సినీ జంట రొమాన్స్: సీక్రెట్‌గా తీసుకున్న వీడియోతో మేటర్ లీక్.. పెళ్లి కాకున్నా ఆ పనులు
కొంత కాలంగా వరుసగా సక్సెస్‌లు సొంతం చేసుకుంటూ ఫుల్ జోష్‌లో ఉన్న సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ ఇటీవలే 'రిపబ్లిక్' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ చిత్రాన్ని విలక్షణ దర్శకుడు దేవ కట్టా తెరకెక్కించాడు. ఈ మూవీ షూటింగ్ పూర్తైన తర్వాత సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. అతడు ఆస్పత్రి బెడ్‌పై ఉన్నప్పటికీ.. ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని చిత్ర యూనిట్ డిసైడ్ అయింది. అలాగే, దీన్ని మెగా ఫ్యామిలీ అండదండలతో విడుదల చేశారు. ఇక, ఈ మూవీకి మంచి టాక్‌తో పాటు పాజిటివ్ రివ్యూలు దక్కాయి.

పాజిటివ్ టాక్‌తో ప్రారంభం అయిన 'రిపబ్లిక్' సినిమా ప్రయాణం.. నిరాశజనకంగా మిగిలింది. ప్రతికూల పరిస్థితులకు తోడు కొన్ని ఇష్యూల కారణంగా దీనికి కలెక్షన్లు మాత్రం అంతగా రాలేదు. ఫలితంగా రూ. 14 కోట్ల టార్గెట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు ముగింపు సమయానికి కేవలం రూ. 6.86 కోట్లు మాత్రమే వసూలు చేసింది. అంటే ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ సినిమా రూ. 5.64 కోట్లు నష్టాలను ఎదుర్కొంది. ఫలితంగా డిజాస్టర్‌గా మిగిలిపోయింది. ఇక, ఈ ఫలితంతో సాయి ధరమ్ తేజ్ వరుస విజయాలకు సైతం బ్రేక్ పడిపోయినట్లు అయింది.
Bigg Boss: షణ్ముఖ్ నేషనల్ రికార్డ్.. బిగ్ బాస్‌లో చరిత్రలో తొలిసారి.. అదే జరిగితే విన్నర్ అతడే!
ఎన్నో అంచనాలతో థియేటర్లలోకి వచ్చిన 'రిపబ్లిక్' మూవీ ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఇలాంటి పరిస్థితుల్లో నవంబర్ 26న జీ5 ఓటీటీలో ఈ సినిమా స్ట్రీమింగ్ ప్రారంభం అయింది. అందులో మాత్రం ఈ చిత్రానికి భారీ స్థాయిలో స్పందన వచ్చింది. ఫలితంగా దానికి ఎన్నో క్లిక్కులు కూడా దక్కాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం జీ5లో 12 కోట్ల నిమిషాల వీక్షణను సొంతం చేసుకుంది. అది కూడా ఒక వారం రోజుల్లోనే. తద్వారా ఈ ఘనతను అందుకున్న తెలుగు చిత్రంగా ఇది రికార్డును క్రియేట్ చేసింది. దీనిపై సాయి ధరమ్ తేజ్ స్పందిస్తూ 'ఓటీటీలో అద్భుతమైన స్పందనను అందించిన అందరికీ ధన్యవాదాలు' అని ట్వీట్ చేశాడు.
ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'రిపబ్లిక్' మూవీలో టాలెంటెడ్ బ్యూటీ ఐశ్వర్య రాజేష్ హీరోయిన్‌గా నటించింది. అలాగే, సీనియర్ నటి రమ్యకృష్ణ ఎంతో ముఖ్యమైన సీఎం పాత్రను పోషించింది. దీన్ని భగవాన్, పుల్లారావు సంయుక్తంగా నిర్మించారు. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందించారు. జగపతిబాబు కీలక పాత్రలో కనిపించి ఆకట్టుకున్నాడు.