Don't Miss!
- News
రంగంలోకి ప్రధాని మోదీ - షా : తెలంగాణలో త్రిముఖ వ్యూహం..!!
- Lifestyle
శృంగార కోరికలు తగ్గడానికి ఈ 3 హార్మోన్లే కారణం... దీన్ని వెంటనే పరిష్కరించండి...!
- Sports
పని పాట లేని వెదవలు క్రియేట్ చేసే స్టోరీలు.. బాబర్ నాకు కొడుకుతో సమానం: వసీం అక్రమ్
- Finance
air india: చరిత్ర సృష్టించనున్న ఎయిర్ ఇండియా.. ప్రపంచంలో అలా చేస్తున్న మొదటి సంస్థ టాటానే..
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
- Technology
ధర రూ.15000 ల లోపు మార్కెట్లో ఉన్న బెస్ట్ 5G ఫోన్లు! లిస్ట్ ,ధర వివరాలు!
- Automobiles
దేశీయ విఫణిలో విడుదలైన కొత్త BMW X1: ధర రూ. 45.90 లక్షలు
Pawan Kalyan చెబితే వింటారు.. అది ఆయన స్థాయి.. సాయి పల్లవి పవర్ఫుల్ కామెంట్స్!
టాలెంటెడ్ హీరోయిన్ సాయి పల్లవి నటించిన గార్గి సినిమా ఈ నెల 15వ తేదీన విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాతో ఎలాగైనా ఆమె బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవాలని ఎదురు చూస్తుంది. ఎందుకంటే కమర్షియల్ గా సాయి పల్లవి సక్సెస్ చేసే చాలా కాలం అవుతుంది. ఇక ఓ వర్గం ప్రేక్షకుల్లో గార్గి సినిమాపై మంచి అంచనాలు ఏర్పడుతున్నాయి. విడుదలైన ట్రైలర్ కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమా కోసం ప్రత్యేకంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో సాయి పల్లవి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఒక విషయంపై కూడా స్పందించింది. ఆ వివరాల్లోకి వెళితే..
పవన్ కళ్యాణ్ గారు వకీల్ సాబ్ లాంటి సినిమాలు జనాల కోసం ఆలోచోంచే చేస్తారు.. అది కూడా ఆయనలాంటి స్ట్రేచర్, స్థాయి ఉన్న వాళ్ళు అలాంటి సినిమాలు తీయగలిగితేనే.. మెసెజ్ అనేది జనాల్లోకి తొందరగా వెళుతుంది. అలాంటి హీరో చెబితే వింటారు కూడా. అందుకే వారి అలాంటి సినిమాలు చేస్తారు.. అని సాయి పల్లవి వివరణ ఇచ్చింది. ఇప్పటికే సాయి పల్లవిని లేడి పవర్ స్టార్ గా ఫ్యాన్స్ పిలుచుకుంటున్నారు. ఇక ఇప్పుడు ఆమె ఫ్యాన్స్ కు నచ్చేలా చాలా మంచి విషయాన్ని చెప్పడంతో అందుకు సంబంధించిన కామెంట్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అయితే గార్గి సినిమా మెస్సేజ్ అందించే సినిమా కాదని ఒక మంచి కంటెంట్ ఉన్న ఎమోషనల్ స్టోరీ అని తెలిపింది. ఇక సాయి పల్లవి ఇటీవల విరాటపర్వం సినిమాతో మంచి ప్రశంసలు అందుకున్న విషయం తెలిసిందే. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద అనుకున్నంతగా సక్సెస్ కాకపోయినప్పటికి కూడా ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు అందాయి. అలాగే ఓటీటీలో కూడా విరాటపర్వంకు మంచి రెస్పాన్ అయితే వచ్చింది. ఇక జూలై 15న రానున్న గార్గి సినిమాతో కూడా సాయి పల్లవి మంచి ప్రశంసలు అందుకునేలా ఉందని అనిపిస్తోంది. ఈ సినిమాను తమిళ్ మలయాళం తెలుగు భాషల్లో ఒకేసారి విడుదల చేస్తున్నారు. మరి సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.