Just In
- 56 min ago
RRR యూనిట్‌కు భారీ షాకిచ్చిన నటి: కొత్త రిలీజ్ డేట్‌ను అలా లీక్ చేసింది.. డిలీట్ చేసే లోపే పట్టేశారుగా!
- 11 hrs ago
చార్ కదమ్ అంటూ చిరు రచ్చ.. మెగా ఫ్రేమ్‌లో నలుగురు దర్శకులు!
- 11 hrs ago
అది ఒత్తిడితో కూడుకున్న పని.. వారి వల్లే సాధ్యమైంది.. దూసుకెళ్తోన్న శివజ్యోతి
- 12 hrs ago
నాగ్‌తో అలా చిరుతో ఇలా.. ప్లానింగ్ మామూలుగా లేదు.. మెగా ఇంట్లో సోహెల్ రచ్చ
Don't Miss!
- Finance
భారత్ V షేప్ రికవరీ, నాలుగింట ఒకవంతు తుడిచి పెట్టుకుపోయాయి: RBI
- News
ప్రొద్దుటూరులో ప్రేమోన్మాది దాడి... 3 నెలలుగా యువతికి టార్చర్... వాడిని వదలొద్దు సార్ అంటూ...
- Lifestyle
శనివారం దినఫలాలు : వృశ్చిక రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా అదృష్టం కలిసి వస్తుంది...!
- Sports
భారత్ చారిత్రక విజయం వెనుక ఆ ముగ్గురిది కీలక పాత్ర: ఇంజమామ్ ఉల్ హక్
- Automobiles
అలెర్ట్.. ఇక రోడ్డుపై అలా వెళ్తే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఇరగదీసిన అల్లు అర్జున్.. పూజా అందాలు.. బన్నీ స్టెప్పులు: 'సామజవరగమన' వీడియో హల్చల్
అల్లు అర్జున్ తాజా సినిమా 'అల.. వైకుంఠపురములో' యూనిట్ సర్‌ప్రైజ్ చేసింది. కొత్త సంవత్సరానికి గ్రాండ్ వెల్‌కం చెబుతూ 'సామజవరగమన' వీడియో సాంగ్ ప్రోమో విడుదల చేసింది. అలా విడుదలయ్యిందో లేదో ఇలా వైరల్ అయిపొయింది ఈ ప్రోమో సాంగ్. ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తున్న ఈ పాట, దానికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అంశాలపై ఓ లుక్కేద్దామా..

'అల.. వైకుంఠపురములో' సెన్సేషన్స్
అల్లు అర్జున్- త్రివిక్రమ్ శ్రీనివాస్ క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న 'అల.. వైకుంఠపురములో' సినిమా విడుదలకు ముందే భారీ హైప్ తెచ్చుకుంటోంది. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన అన్ని పాటలు రికార్డులను తిరగరాస్తూ సెన్సేషన్స్ క్రియేట్ చేశాయి.

సామజవరగమన.. రాములో రాములా
ముఖ్యంగా సామజవరగమన, రాములో రాములా పాటలు దేనికవే ప్రత్యేకంగా నిలిచి 'అల.. వైకుంఠపురములో' సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేశాయి. సామజవరగమన పాట మెలోడీ బీట్‌తో రికార్డులు సృష్టించగా, రాములో రాములా పాట ఫాస్ట్ బీట్‌తో సంచలనాలకు తెరలేపింది. మొత్తానికి ఈ రెండు పాటలు సిల్వర్ స్క్రీన్‌పై ఎప్పుడెప్పుడు చూడాలా అని ఆతృతగా ఉన్నారు ప్రేక్షకులు.

సామజవరగమన వీడియో ప్రోమో..
సరిగ్గా ఈ తరుణంలో సామజవరగమన వీడియో ప్రోమో రిలీజ్ చేశారు మేకర్స్. 59 సెకన్ల నిడివితో రిలీజ్ అయిన ఈ ప్రోమో వావ్ అనిపించేలా ఉంది. ఇందులో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ స్టెప్పులు, అందాల భామ పూజా హెగ్డే తళుక్కులు చూసి ఎంజాయ్ చేస్తోంది ప్రేక్షక లోకం. పారిస్‌లోని అందమైన లొకేషన్స్‌లో ఈ పాటను చిత్రీకరించారు.

ఖర్చు తెలిస్తే షాక్..
ఇక ఈ పాట కోసం 'అల.. వైకుంఠపురములో' టీమ్ పెట్టిన ఖర్చు తెలిస్తే షాక్ కావాల్సిందే. కేవలం ఈ ఒక్క పాట కోసమే దాదాపు ఆరు కోట్ల రూపాయలు వెచ్చించిందట చిత్రయూనిట్. మొత్తానికైతే ఖర్చుకు తగ్గట్టుగా ఈ పాట హంగామా చేసింది. ఆడియోతో పాటు వీడియో కూడా ఆకట్టుకోవడంతో ఇదే పాట సినిమాలో హైలైట్ కావొచ్చని తెలుస్తోంది.

భారీ ఎత్తున ప్రీ రిలీజ్..
ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ భారీ ఎత్తున ప్లాన్ చేసింది చిత్రయూనిట్. జనవరి 6వ తేదీన సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ లోని పోలీస్ గ్రౌండ్స్‌లో 'అల.. వైకుంఠపురములో' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరగనుంది.
'అల.. వైకుంఠపురములో' విశేషాలు
త్రివిక్రమ్ శ్రీనివాస్- అల్లు అర్జున్ కాంబోలో హ్యాట్రిక్ మూవీగా రాబోతున్న 'అల.. వైకుంఠపురములో' సినిమాలో బన్నీ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. టబు, రాజేంద్రప్రసాద్, సచిన్ ఖేడ్‌కర్, తనికెళ్ళ భరణి, మురళీ శర్మ, సముద్ర ఖని, సునీల్, నవదీప్, సుశాంత్, నివేతా పేతురాజ్, బ్రహ్మాజీ, అజయ్, రాహుల్ రామకృష్ణ ఇతర పాత్రలు పోషించారు. థమన్ బాణీలు కట్టారు.