For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఆ నటుడికి దండం పెట్టేసిన సమంత.. ఇంతకీ ఏం జరిగిందంటే..?

  |

  వెబ్ సిరీస్‌ల హవా కొనసాగుతున్న ఈ కాలంలో.. భారీ బడ్జెట్ చిత్రాల కంటే కంటెంట్ ఎక్కువగా ఉంటోన్న వెబ్ సిరీస్‌లే రాజ్యమేలుతున్నాయి. వంద కోట్లు, రెండు వందల కోట్లు ఖర్చు పెట్టి తీస్తున్న సినిమాల కంటే.. లిమిటెడ్ బడ్జెట్‌లో అనవరసపు హంగులకు పోకుండా తెరకెక్కిస్తోన్న వెబ్ సిరీస్‌లే అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అందుకే వీటిపై పెద్ద పెద్ద స్టార్ హీరోలు, హీరోయిన్స్ సైతం మనసు పాడేసుకుంటున్నారు.

  భారీ బడ్జెట్ చిత్రాలకు తీసిపోని విధంగా..

  భారీ బడ్జెట్ చిత్రాలకు తీసిపోని విధంగా..

  అన్ని ఇండస్ట్రీల్లో ఈ వెబ్ సిరీస్‌ల హవా ఎక్కువ అవుతుండగా.. బాలీవుడ్‌లో మాత్రం మరి కాస్త హడావిడి చేస్తున్నాయి. భారీ బడ్జెట్, స్టార్ హీరోల సినిమాల కంటే అవే జనాల నోళ్లలో నానుతున్నాయి. అలా ముఖ్యంగా చెప్పుకోవల్సినవి సెక్రేడ్ గేమ్స్, లస్ట్ స్టోరీస్, ఫ్యామిలీ మ్యాన్. ఇవి ఈ మధ్య కాలంలో అందర్నీ దృష్టిని తమవైపుకు తిప్పుకున్నాయి.

  అడల్డ్ కంటెంట్‌తో ఫేమస్..

  అడల్డ్ కంటెంట్‌తో ఫేమస్..

  సెక్రేడ్ గేమ్స్, లస్ట్ స్టోరీస్ లాంటివి అడల్డ్ కంటెంట్‌తో కూడుకోవడం మరింత వివాదంగా మారాయి. బోల్డ్ సన్నివేశాలు కూడా శృతిమించాయని అప్పట్లో సంచలనంగా మారాయి. అయితే వెబ్ సిరీస్‌లను వీక్షించే సెక్షన్ సపరేట్‌గా ఉండటంతో.. ఎన్ని వివాదాలు చుట్టిముట్టినా ఏమి చేయలేకపోయాయి.

  టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిన ఫ్యామిలీ మ్యాన్

  టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిన ఫ్యామిలీ మ్యాన్

  ఇక ఈ మధ్య కాలంలో ఓ నలుగురు కూర్చుని మాట్లాడుకుంటే.. ఆ టాపిక్‌లో కచ్చితంగా ఫ్యామిలీ మ్యాన్ ఉండేది. మనోజ్ బాజ్‌పేయ్, సందీప్ కిషన్, ప్రియమణి లాంటి స్టార్ క్యాస్టింగ్‌తో తెరకెక్కడం.. అందులోని ట్విస్ట్‌లు, కథ, కథనం ఇలా ప్రతీ ఒక్కటి ఉత్కంఠగా మారడంలో ఎక్కడా చూసినా ఫ్యామిలీ మ్యాన్ గురించి హాట్ టాపిక్ నడిచేది.

  అదే ఫ్యామిలీ మ్యాన్ కథ..

  అదే ఫ్యామిలీ మ్యాన్ కథ..

  ఐసిస్‌లో శిక్షణ పొందిన తీవ్రవాదులు.. సరిహద్దులు దాటుతుండగా పోలీసులు పట్టుకోవడం..వారి ప్లాన్స్‌ను తెలుసుకోవడం, వాటిని మధ్యలోనే మట్టుబెట్టేందుకు అధికారులు(మనోజ్ భాజ్‌పేయ్) ప్రయత్నించడం, ఈ క్రమంలో మనోజ్ భాజ్‌పేయ్ కుటుంబం గురించి ట్రాక్ నడపడం, ఇంట్లో సమస్యలు ఇలా ప్రతీ ఒక్క ఎమోషన్‌ను ఆడియెన్స్‌కు కనెక్ట్ చేయడంలో మేకర్స్ సక్సెస్ అయ్యారు. చివరకు ఉగ్రవాదులు వేసిన ఓ ప్లాన్‌ను మన అధికారులు మట్టుబెట్టడంతో మొదటి సీజన్‌కు ఎండ్ కార్డ్ పడుతుంది. ఈ సీజన్‌లో మొత్తం పది ఎపిసోడ్‌లున్నాయి.

  భారీ అంచనాలతో రెండో సీజన్

  ఇక మొదటి సీజన్ ఈ రేంజ్‌లో సక్సెస్ కావడంతో రెండో సీజన్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సీజన్‌లో మరిన్ని పాత్రలు కనిపించబోతోన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఓ ముఖ్య పాత్రకు సమంతను ఎంపిక చేసినట్లు ఇన్ని రోజులు వార్తలు వినిపించాయి. అయితే ఎట్టకేలకు దీనిపై ఓ క్లారిటీ వచ్చేసింది.

  CineBox: Chiranjeevi Imitates Pawan Kalyan | Ali Reza To Act In a Crazy Movie
  చెప్పేసిన మనోజ్ భాజ్‌పేయ్..

  చెప్పేసిన మనోజ్ భాజ్‌పేయ్..

  ఫ్యామిలీ రెండో సీజన్ షూట్ జరుగుతోందని.. తమతో పాటు సమంత షూట్‌లో జాయిన్ అయిందని సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. ఈ ట్వీట్‌కు స్పందించిన సమంత.. అతనికి దండ పెట్టేసింది. మరి ఈ రెండో సీజన్‌లో సమంత ఏమేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

  English summary
  Samantha Enters Into Family Man Web Series Second Season. Manoj Bajpayee Anounced That She Joins With Them In Shooting.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X