Yashoda గా సమంత.. వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్‌తో ప్యాన్ ఇండియా మూవీ

దేశవ్యాప్తంగా సినీ అభిమానులను విశేషంగా ఆకట్టుకొన్న ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ తర్వాత సమంత రుత్ ప్రభు క్రేజ్ ప్యాన్ ఇండియా స్థాయికి చేరుకొన్నది. శాకుంతలం, తమిళంలో కాతువాకుల రెండు కాదల్ చిత్రాలను రిలీజ్‌కు సిద్దం చేస్తూనే మరో భారీ, విభిన్నమైన ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రతిష్టాత్మక శ్రీదేవి మూవీస్ బ్యానర్‌పై నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ రూపొందిసున్న చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు సోమవారం (డిసెంబర్ 6)న ప్రారంభం అయ్యాయి. ఈ సినిమాకు యశోదా అనే టైటిల్‌ను చిత్ర యూనిట్ ఖరారు చేసింది.

పూజా కార్యక్రమాల అనంతరం నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ.. సమంత ప్రధాన పాత్రలో నిర్మిస్తున్న హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ చిత్రమిది. గతంలో బాలకృష్ణగారితో ఆదిత్య 369తోపాటు మరో మూడు చిత్రాలు నిర్మించాను. నేచురల్ స్టార్ నానితో 'జెంటిల్‌మన్‌', సుధీర్‌బాబుతో 'సమ్మోహనం' నిర్మించాను. ఇప్పుడు సమంత ప్రధాన పాత్రలో సినిమా చేస్తుండటం సంతోషంగా ఉంది. థ్రిల్లర్ జాన‌ర్‌లో జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకునే కథాంశంతో తీస్తున్న చిత్రమిది. సమంత స్టార్ వ్యాల్యూ, ఆమె నటనా ప్రతిభకు, అభిమానుల అంచనాలకు తగినట్టుగా కథ కుదిరింది. ఈ రోజు పూజా కార్యక్రమాలతో సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించాం. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో షూటింగ్ చేయడానికి ప్లాన్ చేశాం. మార్చితో చిత్రీకరణ పూర్తవుతుంది. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు అని చెప్పారు.

 Samantha playing as Yashoda for Pan India Thriller

న్యూ ఏజ్ థ్రిల్లర్‌గా రూపొందే యశోదా చిత్రాన్ని తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో తెరకెక్కించనున్నారు. తమిళంలో మైనా, కుంకీ, గీతు, తెలుగులో చిలసౌ, రిపబ్లిక్ తదితర సినిమాలకు పని చేసిన ఎం. సుకుమార్ ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ అందించనున్నారు. సమంతతోపాటు సినిమాలో నటించే ఇతర తారాగణం వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.

నటీనటులు: సమంత, వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్ తదితరులు
నిర్మాత: శివలెంక కృష్ణప్రసాద్
దర్శకత్వం: హరి - హరీష్
ఆర్ట్: అశోక్
ఫైట్స్: వెంకట్
ఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేష్
మాటలు: పులగం చిన్నారాయణ, డా. చల్లా భాగ్యలక్ష్మి
పాటలు: రామజోగయ్య శాస్త్రి
లైన్ ప్రొడ్యూసర్: విద్య శివలెంక
కెమెరా: ఎం. సుకుమార్
సంగీతం: మణిశర్మ
సహ నిర్మాత: చింతా గోపాలకృష్ణారెడ్డి
ప్రొడక్షన్ కంట్రోలర్: ఆర్. సెంథిల్,
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్: రషీద్ అహ్మద్ ఖాన్, రామాంజనేయులు

More from Filmibeat

Read more about: samantha yashoda pan india thriller
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X