Don't Miss!
- Sports
సుందర్ రనౌట్ విషయంలో నాదే తప్పు: సూర్యకుమార్ యాదవ్
- News
మాస్ కా బాప్: బాలయ్య-పవన్ కల్యాణ్ పార్ట్ 1 టెలికాస్ట్కు ముహూర్తం ఫిక్స్..!!
- Lifestyle
హాట్ అరోమా ఆయిల్ మేనిక్యూర్ గురించి మీకు తెలుసా? రఫ్ హ్యాండ్స్ ని చేతిని మృదువుగా చేస్తుంది!
- Finance
BharatPe: భారత్ పే వ్యవస్థాపకుడి జీతం ఎంతో తెలుసా..? మిగిలిన వారి జీతాలు ఇలా..
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
యుద్దం గెలవాలంటే ఆరడుగుల నారాయణాస్త్రం కావాలి.. ప్రామిసింగ్‌గా అశ్వథ్థామ టీజర్
యంగ్ హీరో నాగ శౌర్య మాస్ అవతారమెత్తాడు. ఇంతవరకు చాక్లెట్ బాయ్‌ల అమ్మాయిల వెంటపడే అల్లరి కుర్రాడి పాత్రలో కనిపించాడు. అయితే నాగ శౌర్య నుంచి రాబోయే చిత్రంలో కాస్త రూట్ మార్చినట్టు కనిపిస్తున్నాడు. ఈ సారి అమ్మాయిలను టార్చర్ చేసే సైకోలను మట్టుబెట్టేందుకు వస్తున్నట్లు తెలుస్తోంది. ఆ మధ్య విడుదల చేసిన అశ్వథ్థామ కాన్సెప్ట్ మోషన్ పోస్టర్‌కు భారీ స్పందన రాగా.. తాజాగా టీజర్‌ను విడుదల చేశారు.
సమంత చేతుల మీదుగా రిలీజ్ చేయించిన ఈ టీజర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సస్పెన్స్ థ్రిల్లర్‌గా కనిపిస్తోన్న ఈ మూవీలో నాగ శౌర్య యాక్షన్ హైలెట్ కానున్నట్లు తెలుస్తోంది. ఎలా ఉంటాడో కూడా తెలియని ఓ రాక్షసుడు.. వాడికి మాత్రమే తెలిసిన రహస్యం, సైరన్ కూతల కింద పని చేసే వాడి సైన్యం.. గమ్యం తెలియని ఓ యుద్దం.. ఆ యుద్దం గెలవాలంటే.. ఆరడగుల నారాయణాస్త్రం కావాలి.. ఒక అశ్వథ్థాముడు రావాలి.. అంటూ టీజర్‌లో చెప్పిన డైలాగ్‌లు సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి.

ఈ చిత్రానికి నాగ శౌర్యే కథ అందించడం విశేషం. ఈ చిత్రాన్ని తన సొంత బ్యానర్ అయిన ఐరా క్రియేషన్స్‌పై ఉషా మూల్పూరి నిర్మిస్తుండగా.. రమణ తేజ దర్శకుడిగా పరిచయం కాబోతోన్నాడు. ఈ చిత్రాన్ని జనవరి 31న విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో నాగ శౌర్యకు జోడిగా మెహ్రీన్ నటిస్తోంది.