చాక్లెట్ బాయ్‌లాంటి యంగ్ హీరో నాగశౌర్య.. కండలు పెంచేసి యాక్షన్ హీరోగా మారిపోయాడు. ఛలో లాంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందుకున్న నాగ శౌర్య మరో హిట్ కొట్టేలేకపోయాడు. అయితే. డిఫరెంట్ స్టోరీతో రాబోతోన్న 'అశ్వథ్థామ' చిత్రం కోసం నాగ శౌర్య తెగ కష్టపడుతున్నాడు. తన హోమ్ బ్యానర్ అయిన ఐరా క్రియేషన్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఛలో భారీ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. అదే విధంగా మళ్లీ అశ్వథ్థామ కూడా అదే రేంజ్‌తో విజయం సాధిస్తుందనే నమ్మకంతో చిత్రయూనిట్ ఉంది.
ఆ మధ్య రిలీజ్ చేసిన కాన్సెప్ట్ మోషన్ పోస్టర్ ఎంతగా వైరల్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమా జనవరి 31 న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. విడుదలకు నెల రోజులే ఉండడంతో ప్రచారకార్యక్రమాలు కూడా మొదలు పెట్టేశారు. ఈ క్రమంలో ఈ మూవీలోని నిన్నే నిన్నే అనే పాటను విడుదల చేశారు. ఇక ఈ సినిమా టీజర్ గురించి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది.
అశ్వథ్థామ టీజర్‌ను డిసెంబర్ 27 వ తేదీ ఉదయం 11:07 గంటలకు విడుదల చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. తాజా సమాచారం ప్రకారం ఈ టీజర్ ను స్టార్ హీరోయిన్ సమంత చేతుల మీదుగా విడుదల చేయించబోతోన్నారని టాక్. 'ఓ బేబీ' సినిమాలో సమంతాకు జోడీగా నాగశౌర్య నటించిన సంగతి తెలిసిందే. అప్పటి రుణాన్ని సమంత ఇప్పుడు తీర్చుకుంటున్నట్లు తెలుస్తోంది. అందుకే ఈ సినిమా ట్రైలర్ ను లాంచ్ చేసేందుకు ముందుకు వచ్చిందని సమాచారం. ఈ సినిమాకు కథ అందించింది స్వయంగా హీరో నాగశౌర్య కావడం విశేషం. ఈ సినిమా మహిళలపై లైంగిక వేధింపులు కాన్సెప్ట్ పైనే తెరకెక్కుతోందని టాక్. ఈ చిత్రంలో మెహ్రీన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాతో రమణ తేజ అనే నూతన దర్శకుడిని నాగశౌర్య పరిచయం చేస్తున్నాడు.
Samantha Releasing Naga Shourya Ashwathama Teaser. Ira Creations proudly presents Aswathama Movie. Aswathama motion poster Goes Viral. Aswathama Telugu movie features. NagaShaurya And MehreenPirzada in lead roles, Directed by Ramana Teja, Produced by Usha Mulpuri and presented by Shankar Prasad Mulpuri.
Story first published: Thursday, December 26, 2019, 18:02 [IST]