Don't Miss!
- News
Leader: రూ. 100కే అందరికి బ్లూఫిల్మ్ చూపించిన గొప్ప లీడర్ ఆ మాజీ మంత్రి, అంతు చూస్తా, చాలెంజ్!
- Sports
పాపం సర్ఫరాజ్‌ఖాన్.. సెలెక్టర్ల బాక్స్ బద్దలు కొట్టినా ఎంపికవ్వలేదు: రవిచంద్రన్ అశ్విన్
- Lifestyle
సంబంధంలో సాన్నిహిత్యం, నమ్మకాన్ని పెంపొందించడానికి చిట్కాలు
- Finance
household income: భారతీయ కుటుంబాలపై సర్వే.. ఆదాయం, పొదుపులు ఎంతో తెలుసా ?
- Technology
Oppo నుండి కొత్త టాబ్లెట్, లాంచ్ కు సిద్ధం! ఆన్లైన్ లో స్పెసిఫికేషన్లు లీక్ ..!
- Automobiles
భారతీయ మార్కెట్లో Hero XOOM ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల: ప్రైస్, వేరియంట్స్ & కలర్ ఆప్సన్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
సమంతపై వెంకటేష్ కూతురు ఘాటైన కామెంట్స్.. ఏ విషయంలో రియాక్ట్ అయయిందంటే?
అక్కినేని యంగ్ హీరో నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత వరుస సినిమాలతో దూసుకుపోతోంది. తెలుగు, తమిళ సినిమాలతో పాటు బాలీవుడ్‌లోనూ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. చెన్నై, ముంబై, హైదరాబాద్‌ల మధ్య ప్రయాణిస్తూ క్షణం తీరిక లేకుండా గడుపుతోంది. భవిష్యత్తు ప్రాజెక్టులకు సంబంధించి దర్శక, నిర్మాతలతో చర్చిస్తోంది. తాజాగా ఈ భామ ముంబైలో బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్‌తో కలిసి కనిపించింది.

మరో వెబ్‌సిరీస్‌కు ఓకే చెప్పిందా?
సమంత
తాజాగా
`ఫ్యామిలీమేన్-2`
రూపకర్తలు
రాజ్,
డీకేలను
కలిసింది.
బాలీవుడ్
కథానాయకుడు
వరుణ్
ధావన్‌తో
వీరు
ఓ
వెబ్
సిరీస్
చేయబోతున్న
సంగతి
తెలిసిందే.
ఈ
నేపథ్యంలో
ఈ
ముగ్గురినీ
సమంత
కలవడం
చర్చనీయాంశంగా
మారింది.
రాజ్,
డీకే
రూపొందించిన
`ఫ్యామిలీమేన్-2`
వెబ్
సిరీస్
సమంతకు
జాతీయ
స్థాయిలో
గుర్తింపు
తీసుకొచ్చింది.
ఒకరకంగా
సమంత
బాలీవుడ్
బాటలకు
ఈ
వెబ్‌సిరీసే
మార్గం
వేసిందని
చెప్పవచ్చు.
ఈ
నేపథ్యంలో
రాజ్,
డీకే
రూపొందించే
మరో
వెబ్
సిరీస్‌లో
సమంత
నటించనున్నట్టు
తెలుస్తోంది.

సమంతను భయపెట్టకండి..
శుక్రవారం సాయంత్రం దర్శకులు రాజ్, డీకేలను సమంత, వరుణ్ కలిశారు. మీటింగ్ అనంతరం ఇద్దరూ బయటకు రాగానే ఫొటోగ్రాఫర్లు, అభిమానులు వారిని చుట్టుముట్టారు. ఫొటోలు తీసుకునేందుకు ఎగబడ్డారు. గట్టిగా కేకలు వేశారు. దీంతో సమంత భయపడిపోయింది. పక్కనే ఉన్న వరుణ్ ఆమెను ఫొటోగ్రాఫర్ల నుంచి తప్పించాడు. `సమంతను ఎందుకు భయపెడుతున్నారు` అంటూ ఆమెను పక్కకు తీసుకెళ్లి కారు ఎక్కించాడు. ఈ వీడియో నెట్టింట విపరీతంగా వైరల్ అయింది.

సమంత ఫొటోపై ట్రోలింగ్
`ఫ్యామిలీ మ్యాన్-2` వెబ్‌సిరీస్ కారణంగా ఆమె క్రిటిక్స్ చాయిస్ ఫిల్మ్ అవార్డుకు ఎన్నికైంది. ముంబైలో జరిగిన ఈ అవార్డు ఫంక్షన్‌కు సామ్ హాజరైంది. హాట్ డ్రెస్సులో తళుక్కున మెరిసింది. క్లీవేజ్ షోతో అభిమానులకు అందాల విందు చేసింది. ఆ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసి `నాకు అత్యంత ఇష్టమైన లుక్ ఇదే` అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈ ఫొటోపై కొందరు ట్రోలింగ్‌కు దిగారు. అందాల ప్రదర్శన శ్రుతి మించిందని కామెంట్లు చేశారు.

ఆ ఫొటోపై వెంకటేష్ కూతురి స్పందన
తీవ్ర ట్రోలింగ్‌కు గురవుతున్న సమంత హాట్ ఫొటోపై హీరో దగ్గుబాటి వెంకటేష్ కూతురు ఆశ్రిత స్పందించింది. ఫొటో చాలా ముచ్చటగా ఉందని పేర్కొంటూ లవ్ సింబల్ జోడించింది. ఆశ్రిత ఇన్ఫినిటీ ప్లాటర్ పేరిట ఇన్ స్టాగ్రామ్ ఖాతాను రన్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఆశ్రితతో పాటు హీరోయిన్లు రష్మిక మందన్నా, సంయుక్త హెగ్డే, రుహానీ శర్మ, హన్సిక.. సమంత ఫొటోను ప్రశంసించారు.
Recommended Video


ట్రోలింగ్‌పై సమంత రియాక్షన్
తన హాట్ ఫొటోపై జరుగుతున్న ట్రోలింగ్‌పై సమంత రియాక్ట్ అయింది. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఓ మెసేజ్‌ను పోస్ట్ చేసింది. `మనం ఇప్పుడు 2022లో ఉన్నాం. ఇప్పటికైనా మహిళలను జడ్జ్ చేయడం ఆపరా? వారేం ధరించారు.. ఎలా కనిపిస్తున్నారనే దాంతో వారి క్యారెక్టర్‌ను నిర్ణయిస్తారా?'..అంటూ సమంత అసహనం వ్యక్తం చేసింది. మహిళలను అతి సులభంగా జడ్జ్ చేసేస్తారని, అలా చేయడం చాలా తేలికైన పని అని వ్యాఖ్యానించింది.