Sara Ali Khan : మరొకరితో ప్రేమలో పడ్డ స్టార్ డాటర్.. ఈసారి ఎవరంటే?
బాలీవుఢ్‌లో ప్రేమలు, పెళ్లిళ్ల లాంటి సంబంధాలు ఎక్కువ కాలం నిలువలేవనే విషయాలు ఎన్నో జంటలు నిరూపించాయి. ఆఖరికి ఈరోజు ఏకంగా అమీర్ ఖాన్ - కిరణ్ రావు విడాకులు తీసుకున్నారు. ఇక ఇప్పుడు చోటా నవాబ్ సైఫ్ ఆలీఖాన్ ముద్దుల కూతురు ప్రేమ వ్యవహారం మళ్ళీ మీడియాలో హల్ చల్ చేస్తింది. ఇప్పటికే ఇద్దరికి దగ్గరయి మళ్ళీ దూరం అయిన ఈ భామ ఇప్పుడు మరో మారు మరో వ్యక్తితో ప్రేమలో పడిందని అంటున్నారు.
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కుమార్తె సారా అలీ ఖాన్ తన సినిమాల కంటే ఎక్కువగా తన వ్యక్తిగత జీవితాతం గురించే ఎక్కువగా వార్తల్లో నిలిచారు. ఆమె సంబంధాల గురించి గతంలో చాలా పుకార్లు వచ్చాయి. ఆమె కెరీర్ ప్రారంభ రోజుల్లో, తన సహనటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తో డేటింగ్ చేసినట్లు ప్రచారం ఉంది. ఆ సంగతి పక్కన పెడితే ఆ తర్వాత ఆమె లవ్ ఆజ్కల్ 2 సహనటుడు కార్తీక్ ఆర్యన్ తో కూడా అఫైర్ నడిపింది.

ఇప్పుడు ఈ భామ కేదార్‌నాథ్ అసిస్టెంట్ డైరెక్టర్ జెహన్ హండాతో ప్రేమలో ఉన్నట్లు చెబుతారు. వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటోలు, మరియు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన తరువాత ఆమె కొత్త అఫైర్ గురించి ఇప్పుడు ఊహాగానాలు ప్రారంభమయ్యాయి. జెహన్ హండా తాజాగా తన సోషల్ మీడియా వేదికగా ఒక ఫోటో షేర్ చేసుకున్నాడు. అందులో సారా అలీ ఖాన్ ఆయనని కౌగిలించుకోవడం కనిపించింది. ఈ ఫోటోలను సారా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో "లవ్ యు" మరియు "టేక్ మీ బ్యాక్" అని GIF లతో చిత్రాన్ని తిరిగి రీ పోస్ట్ చేసింది. అయితే, ఈ జంట తమ సంబంధం గురించి అధికారికంగా ఏమీ వెల్లడించలేదు. ఇక సినిమల విషయానికి వస్తే సారా అలీ ఖాన్ తదుపరి అక్షయ్ కుమార్ మరియు ధనుష్ కలిసి 'అరంగి రే'లో నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











