Don't Miss!
- News
హైదరాబాద్‌లో మరో దిగ్గజ సంస్థ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్: 1800 మందికి ఉపాధి
- Technology
ఆపిల్ నుంచి ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్ వివరాలు! కొత్త ఫీచర్లు!
- Sports
టీ20ల్లో టాప్ ప్లేయర్లు.. వన్డేల్లో మాత్రం వేస్ట్.. టీమిండియా స్టార్ కూడా!
- Lifestyle
ఈ రాశుల వారు భగ్నప్రేమికులు, అలా పడిపోతారు ఇలా విడిపోతారు
- Finance
Adani Enterprises FPO: అనుకున్నది సాధించిన అదానీ.. మూడో రోజు మ్యాజిక్.. ఏమైందంటే..
- Automobiles
అమరేంద్ర బాహుబలి ప్రభాస్ కాస్ట్లీ కారులో కనిపించిన డైరెక్టర్ మారుతి.. వీడియో వైరల్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
The Legend Twitter Review: సంచలనంగా ది లెజెండ్.. అఖండ సినిమాతో పోలిక.. విజయ్ కూడా వెనక్కే అంటూ!
ఈ మధ్య కాలంలో దేశ వ్యాప్తంగా ఎన్నో చిత్ర విచిత్రమైన సినిమాలు రూపొందుతోన్నాయి. అయితే, అందులో చాలా తక్కువ మూవీలు మాత్రమే నేషనల్ వైడ్‌గా హైలైట్ అవుతున్నాయి. అలా రెండు మూడు నెలలుగా ఇండియా మొత్తంగా మారుమ్రోగుతూ సంచలనంగా మారిన సినిమాల్లో 'ది లెజెండ్' ఒకటి. దీనికి కారణం ఈ చిత్రంలో ప్రముఖ వ్యాపారవేత్త శరవణన్ హీరోగా నటించడమే అన్న విషయం అందరికీ తెలిసిందే. ఆరంభంలోనే అందరి దృష్టినీ ఆకర్షించిన ఈ చిత్రం తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఈ నేపథ్యంలో అసలు ఈ సినిమాకు ఎలాంటి టాక్ వచ్చింది? ఇందులో ప్లస్, మైనస్‌లు ఏమిటి? మొత్తంగా 'ది లెజెండ్'పై నెటిజన్లు ఏమనుకుంటున్నారు? అనేవి చూద్దాం పదండి!

ది లెజెండ్‌గా వచ్చేసిన శరవణన్
తమిళనాడుకు చెందిన వ్యాపారవేత్త శరవణన్ హీరోగా జేడీ అండ్ జెర్రీ ద్వయం తెరకెక్కించిన చిత్రమే 'ది లెజెండ్'. ఊర్వశీ రౌటేలా హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను శరవణా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై శరవణన్ స్వయంగా నిర్మించారు. దీనికి హారీశ్ జయరాజ్ సంగీతం అందించాడు. ఇందులో సుమన్ విలన్‌గా నటించగా.. ఎంతో మంది ప్రముఖులు కీలక పాత్రలు చేశారు.
Eesha Rebba అందాల అరాచకం: అబ్బో ఆమె ఫోజులు చూస్తే!

ఆసక్తిని పెంచేసిన మూవీ అప్డేట్స్
కామెడీ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'ది లెజెండ్' మూవీపై ఆరంభంలో పెద్దగా అంచనాలు లేవు. కానీ, ఈ సినిమా నుంచి ప్రచారం చిత్రాలు విడుదలైన తర్వాత ఇది అందరి దృష్టినీ ఆకర్షించింది. దీంతో ఆ తర్వాత దీని నుంచి ఏది విడుదలైన మంచి రెస్పాన్స్ వచ్చింది. మరీ ముఖ్యంగా ఈ సినిమా టీజర్, ట్రైలర్‌కు భారీగా వ్యూస్ వచ్చి అంచనాలు పెంచేశాయి.

నేషనల్ రేంజ్... గ్రాండ్‌గా రిలీజ్
'ది లెజెండ్' మూవీని పాన్ ఇండియా రేంజ్‌లో తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో రూపొందించారు. అన్ని చోట్లా ఈ చిత్రానికి బిజినెస్ అంతగా జరగకపోయినా.. రిలీజ్‌ను మాత్రం గ్రాండ్‌గానే ప్లాన్ చేసుకున్నారు. ఇందులో భాగంగానే ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలు, భాషల్లో కలిపి 2500 పైగా థియేటర్లలో విడుదల చేస్తున్నారు.
దారుణమైన ఫొటోలు వదిలిన రష్మిక: ఆమెను ఇంత హాట్‌గా ఎప్పుడైనా చూశారా!

‘ది లెజెండ్’కు టాక్ ఎంటేంటే
శరవణన్ నటించిన 'ది లెజెండ్' మూవీ కామెడీ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో షోలు కూడా ప్రదర్శితం అయ్యాయి. ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం.. ఈ సినిమాకు పూర్తిగా భిన్నమైన టాక్ వచ్చింది. ఇది ఏవరేజ్ అని కొందరు.. బిలో ఏవరేజ్ అని మరికొందరు ఫన్నీగా ట్వీట్లు చేస్తున్నారు.

ఫస్టాఫ్ ఇలా.. సెకెండాఫ్ మరోలా
'ది లెజెండ్' మూవీ ఓవరాల్‌గా చూసుకుంటే.. ఫస్టాఫ్ మొత్తం హీరో సాదాసీదా ఎంట్రీతో, పూర్తిగా తెలిసిన కథతో, ఎక్కడో చూసిన ఫీలింగ్ కలిగే సన్నివేశాలతో సోసోగా సాగిపోతుందట. అంతేకాదు, ఇది ల్యాగ్ అయినట్లు కూడా అనిపిస్తుందట. అలాగే, సెకెండాఫ్ కూడా ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించని విధంగా ఏవరేజ్‌గా ఉందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
Vikrant Rona Twitter Review: సుదీప్ మూవీకి అలాంటి టాక్.. కేజీఎఫ్‌ను మించేలా.. ఫైనల్ రిపోర్ట్ ఇదే

సినిమాలో ప్లస్... మైనస్‌లు ఇవే
శరవణన్
హీరోగా
నటించిన
'ది
లెజెండ్'
మూవీని
చూసిన
వాళ్లంతా
ఇచ్చిన
రిపోర్టుల
ప్రకారం..
ఇందులో
హారీశ్
జయరాజ్
అందించిన
మ్యూజిక్,
నిర్మాణ
విలువలు
తప్ప
అన్నీ
మైనస్
అనే
ట్విట్టర్‌లో
నెటిజన్లు
అభిప్రాయపడుతున్నారు.
మరీ
ముఖ్యంగా
ఈ
సినిమా
శివాజీ,
కేజీఎఫ్
చాప్టర్
2,
మెర్సల్
వంటి
చిత్రాలకు
స్ఫూఫ్‌గా
రూపొందినట్లు
ఉందని
కామెంట్లు
చేస్తున్నారు.

ఫైనల్‌గా సినిమా ఎలా ఉందంటే
ట్వీట్ల ద్వారా అందిన సమాచారం ప్రకారం.. శరవణన్ నటించిన 'ది లెజెండ్' సోసోగా సాగిపోతే పాత చింతకాయ పచ్చడి అని తెలుస్తోంది. చాలా సినిమాల కథలు, సన్నివేశాలను మిక్సీలో వేసి దీన్ని తయారు చేసినట్లు ఉంటుందట. దీంతో ఇది ఏమాత్రం ఆకట్టుకునేలా లేదని తెలుస్తోంది. అయితే, పేరడీ, స్ఫూస్ చిత్రాలను ఇష్టపడే వాళ్లు మాత్రం దీన్ని ఒకసారి చూడొచ్చట.
బిగ్ బాస్ దివి అందాల ఆరబోత: పైనుంచి చూపిస్తూ హాట్ సెల్ఫీ

విజయ్ వెనక్కే.. తమిళ అఖండ
శరవణన్ నటించిన 'ది లెజెండ్' మూవీపై ట్విట్టర్ వేదికగా ఎన్నో ట్రోల్స్ వస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఓ నెటిజన్ 'విజయ్ నటించిన బిగిల్, బీస్ట్, భైరవ చిత్రాలతో పోలిస్తే ఇది చాలా బాగుంది' అని వెటకారంగా కామెంట్ చేశాడు. అలాగే మరో నెటిజన్ ఏకంగా ఈ సినిమా తమళ చిత్ర పరిశ్రమకు 'అఖండ' అంటూ ఫన్నీ ట్వీట్ చేశాడు. ఇలా ఎన్నో ట్వీట్లు కనిపిస్తున్నాయి.