Just In
- 3 hrs ago
ప్రదీప్ కోసం టాప్ యాంకర్స్.. చివరకు వారితో జంప్.. మొత్తానికి సద్దాం బక్రా!
- 3 hrs ago
ఆస్కార్ బరిలో ‘ఆకాశం నీ హద్దురా’.. సూర్య కష్టానికి ప్రతిఫలం లభించేనా?
- 4 hrs ago
అప్డేట్ ఇస్తావా? లీక్ చేయాలా?.. ఆచార్యపై కొరటాలను బెదిరించిన చిరంజీవి
- 5 hrs ago
నిద్రలేని రాత్రులెన్నో.. ఇప్పుడు నవ్వొస్తుంటుంది.. ట్రోల్స్‌పై సమంత కామెంట్స్
Don't Miss!
- News
కువైట్‌లో నారా లోకేష్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించిన టీడీపీ నేతలు
- Sports
వైరల్ ఫొటో.. ధోనీ, సాక్షితో పంత్!!
- Automobiles
కొత్త సఫారి ఎస్యూవీ ఆవిష్కరించిన టాటా మోటార్స్; లాంచ్ ఎప్పుడంటే ?
- Finance
Budget 2021: పన్ను తగ్గించండి, తుక్కు పాలసీపై కూడా
- Lifestyle
మంగళవారం దినఫలాలు : వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మహేష్, అల్లు అర్జున్ మానియా.. సంక్రాంతి సమరంలో పైచేయి ఎవరిదో తెలుసా? ఏ రకంగా చూసినా!
సినీ వారసులు, తెలుగు టాప్ స్టార్స్ మధ్య నెలకొన్న పోటీ వాతావరణం ప్రేక్షకలోకంలో ఆసక్తి నింపుతోంది. ఈ సంక్రాంతికి టాలీవుడ్ నుంచి సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఓ రేంజ్ పోటీకి దిగారు. ఎవరికి వారు ఎక్కడా తగ్గకుండా తపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఓ ఫేమస్ సిటీలో ఈ ఇద్దరి మధ్య నెలకొన్న పోటీ, వచ్చిన కలెక్షన్స్ ఆధారంగా మహేష్‌దే పైచేయి అని తెలుస్తోంది. వివరాల్లోకి పోతే..

ఏ మాత్రం తగ్గకుండా.. దేనికదే సాటి
ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా ఏ మాత్రం తగ్గకుండా రెండు భారీ సినిమాలు పోటాపోటీగా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. 'సరిలేరు నీకెవ్వరు' సినిమా ద్వారా మహేష్ బాబు రంగంలోకి దిగగా.. 'అల.. వైకుంఠపురములో' సినిమాతో అల్లు అర్జున్ సంక్రాంతి సమరంలో దూకారు. దీంతో ఈ రెండు సినిమాల మధ్య పోటీ వాతావరణం రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయింది.

సింగిల్ డే గ్యాప్.. ఇదీ పరిస్థితి
మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు', అల్లు అర్జున్ 'అల.. వైకుంఠపురములో' సినిమాలు రెండు కూడా సింగిల్ డే గ్యాప్ తో రిలీజ్ అయ్యాయి. ముందుగా జనవరి 11న 'సరిలేరు నీకెవ్వరు' మూవీ వచ్చి సూపర్ సక్సెస్ అనిపించుకుంది. ఆ మరుసటి రోజే జనవరి 12న 'అల.. వైకుంఠపురములో' మూవీ రిలీజై ప్రేక్షకుల మెప్పు పొందింది. ఈ రెండు సినిమాలు అన్ని సెంటర్లలో పోటాపోటీగా ఆడుతున్నాయి.

సంక్రాంతి సమరం.. ఎవరిది పైచేయి?
దీంతో ఈ సంక్రాంతి సమరంలో ఎవరిది పైచేయి అనేదానిపై దృష్టి పెట్టారు ఇరువురు హీరోల ఫ్యాన్స్. అయితే కలెక్షన్స్ రిపోర్ట్స్ ప్రకారంగా చూస్తే ఓ పర్టికులర్ ఏరియా చెన్నైలో సూపర్ స్టార్ మహేష్ బాబుదే పైచేయి అని తెలుస్తోంది. ఇది చూసి మహేష్ అభిమానులు ఖుషీ అవుతున్నారు.

ఏ రకంగా చూసినా తమ హీరోనే అంటూ ఫ్యాన్స్
చెన్నై నగరంలో రెండు రోజుల్లో కలిపి మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు' మూవీ 31 లక్షల రూపాయల గ్రాస్ రాబట్టింది. ఇందులో ఫస్ట్ డే 17 లక్షలు, సెకండ్ డే 14 లక్షలు అని రిపోర్ట్స్ చెబుతున్నాయి. అదేవిధంగా అల్లు అర్జున్ 'అల.. వైకుంఠపురములో' మూవీ అయితే తొలిరోజు అక్కడ కేవలం 10 లక్షల గ్రాస్ మాత్రమే రాబట్టింది. దీంతో ఏ రకంగా చూసినా తమ హీరోదే పైచేయి అని సంబరపడుతున్నారు మహేష్ ఫ్యాన్స్.

సరిలేరు నీకెవ్వరు.. స్పెషల్ ఏంటంటే
సరిలేరు నీకెవ్వరు చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో మహేష్ సరసన రష్మిక నటించగా, విజయశాంతి కీలకపాత్ర పోషించింది. ఈ విజయం పట్ల యూనిట్ అంతా ఆనందం వ్యక్తం చేస్తోంది. విజయశాంతి 13 ఏళ్ల తర్వాత ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వడం విశేషం.

'అల.. వైకుంఠపురములో' మూవీ
త్రివిక్రమ్- అల్లు అర్జున్ క్రేజీ కాంబోలో 'అల.. వైకుంఠపురములో' మూవీ తెరకెక్కింది. చిత్రంలో అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. సీనియర్ హీరోయిన్ టబు కీలక పాత్ర పోషించింది. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడం పట్ల యూనిట్ సంతోషంగా ఉంది.