Just In
- 4 min ago
RRR యూనిట్‌కు భారీ షాకిచ్చిన నటి: కొత్త రిలీజ్ డేట్‌ను అలా లీక్ చేసింది.. డిలీట్ చేసే లోపే పట్టేశారుగా!
- 10 hrs ago
చార్ కదమ్ అంటూ చిరు రచ్చ.. మెగా ఫ్రేమ్‌లో నలుగురు దర్శకులు!
- 11 hrs ago
అది ఒత్తిడితో కూడుకున్న పని.. వారి వల్లే సాధ్యమైంది.. దూసుకెళ్తోన్న శివజ్యోతి
- 11 hrs ago
నాగ్‌తో అలా చిరుతో ఇలా.. ప్లానింగ్ మామూలుగా లేదు.. మెగా ఇంట్లో సోహెల్ రచ్చ
Don't Miss!
- Lifestyle
శనివారం దినఫలాలు : వృశ్చిక రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా అదృష్టం కలిసి వస్తుంది...!
- News
మూడ్ ఆఫ్ ది నేషన్ 2021: రైతుల ఆందోళనను మోడీ సర్కారు బాగా నియంత్రించింది
- Finance
భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు: వెండి రూ.1,000కి పైగా డౌన్
- Sports
భారత్ చారిత్రక విజయం వెనుక ఆ ముగ్గురిది కీలక పాత్ర: ఇంజమామ్ ఉల్ హక్
- Automobiles
అలెర్ట్.. ఇక రోడ్డుపై అలా వెళ్తే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
'హోటల్‌లో కలిసి చెప్పాడు.. సరిలేరు నీకెవ్వరు సినిమా బ్లాక్‌బస్టర్ ఖాయం'
సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఘట్టం రానే వచ్చింది. నగరం నడిబొడ్డున ఎల్బీ స్టేడియంలో సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతోంది. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేస్తుండటంతో సంబరాలు రెట్టింపయ్యాయి.

మెగా సూపర్ ఈవెంట్
అటు సూపర్ స్టార్ అభిమానులు, ఇటు మెగా అభిమానులు ఒక్కచోటుకు రావడంతో అంతా సందడిగా మారింది. ఇప్పటికే సరిలేరు నీకెవ్వరు చిత్రంపై అంచనాలు ఆకాశన్నంటాయి. పోస్టర్స్, సాంగ్స్, టీజర్‌తో ఫ్యాన్స్‌లో జోష్ నింపిన సరిలేరు టీమ్.. నేడు వారి ఆకలిని తీర్చేందుకు ముందుకు వచ్చింది. ఈ ఈవెంట్‌లోనే సరిలేరు ట్రైలర్‌ను కూడా విడుదల చేయబోతోంది.

సభా ప్రాంగణమంతా సందడే సందడి
ఎల్బీ స్టేడియం లోపల, ఆ ప్రాంగణం చుట్టూ మెగాస్టార్, సూపర్ స్టార్ భారీ కటౌట్లను ఏర్పాటు చేశారు. అయితే అభిమానుల తాకిడి కూడా ఎక్కువయ్యే అవకాశముందనుకున్న పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు జారీ చేశారు. ఆ రూట్‌లకు బదులుగా ప్రత్యామ్నాయ మార్గాలను సూచించారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకున్నారు. నేటి ఉదయం నుంచే అభిమానుల తాకిడి ఎక్కువ కావడంతో అక్కడి ప్రాంగణమంతా సందడిగా మారింది.
టైటిల్ పెట్టినప్పటి నుంచి బజ్ నెలకొంది
ఈ వేదికపై లిరిక్ రైటర్ రామ జోగయ్య శాస్త్రి మాట్లాడుతూ.. ''మీ అందరినీ చూస్తుంటే కన్నుల పండుగగా ఉంది. మెగా సూపర్ ఈవెంట్ చాలా చల్లగా చక్కగా సాగుతోంది. సరిలేరు నీకెవ్వరు ఈ టైటిల్ పెట్టినప్పటి నుంచి బజ్ నెలకొంది. నాకు సరిలేరు నీకెవ్వరు పూర్తి కథ ఓ హోటల్‌లో కలిసినప్పుడు అనిల్ రావిపూడి చెప్పాడు. విజయశాంతిని మళ్ళీ తెరపైకి తీసుకురావడం గ్రేట్. ప్రకాష్ రాజ్, రాజేంద్రప్రసాద్ లాంటి ఎందరో గ్రేట్ నటీనటులతో మంచి కథ, కామెడీ టైమింగ్‌తో ఈ సినిమా రూపొందించారు.

మీ అందరితో పాటు నేను కూడా ఎదురు చూస్తున్నా
ఇందులో నేను రెండు పాటలు రాశాను. మహేష్ ఫ్యాన్స్‌కి, ఉభయ రాష్ట్రాల తెలుగు ప్రేక్షకులకి ఈ మంచి పాటలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఈ సినిమా నాకు అవకాశమిచ్చింది. జనవరి 11 కోసం మీ అందరితో పాటు నేను కూడా ఎదురు చూస్తున్నాను.