For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  GODSE Teaser: మీకు లక్షల కోట్లు ఎలా వస్తున్నాయ్.. రాజకీయ నాయకులకు గాడ్సే సూటి ప్రశ్న

  |

  కొంత కాలంగా విభిన్నమైన చిత్రాలతో తెలుగు సినీ ఇండస్ట్రీలో విలక్షణ హీరోగా గుర్తింపును సొంతం చేసుకున్నాడు యంగ్ సెన్సేషన్ సత్యదేవ్. కెరీర్ ఆరంభంలో సపోర్టింగ్ ఆర్టిస్టుగా నటించిన అతడు.. పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన 'జ్యోతి లక్ష్మీ' అనే మూవీతో హీరోగా పరిచయం అయ్యాడు. ఇందులో ఛార్మీ తర్వాత అంతటి గుర్తింపును తెచ్చుకుని సత్తా చాటాడు. అప్పటి నుంచి హీరోగా, సహాయ నటుడిగా ద్విపాత్రాభినయం చేస్తూ ముందుకు వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ పలు చిత్రాల్లో అత్యుత్తమ నటనను కనబరిచాడు. దీంతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు.

  Sunny Remuneration: సన్నీ ప్రైజ్‌మనీలో భారీ కోత.. అన్ని కలిపి కోటి పైనే.. చేతికొచ్చేది మాత్రం ఇంతే!

  సహజ సిద్ధమైన నటనతో ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న హీరో సత్యదేవ్. ఈ ఏడాది ఆరంభంలో శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వంలో 'తిమ్మరుసు' అనే సినిమాలో నటించాడు. ప్రియాంక జావాల్కర్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్ బ్యానర్‌పై మహేశ్ కోనేరు నిర్మించారు. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించారు. కన్నడంలో సూపర్ డూపర్ హిట్ అయిన 'బీర్బల్'‌ అనే మూవీకిది రీమేక్‌గా వచ్చింది. సెకెండ్ వేవ్ తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి మంచి స్పందనే వచ్చింది. దీంతో సత్యదేవ్ ఖాతాలో మరో మంచి చిత్రంగా ఇది నిలిచిపోయింది.

  Satyadevs GODSE Teaser Unveiled by Chiranjeevi

  కెరీర్ ఆరంభం నుంచీ సరికొత్త కథాంశాలతో సినిమాలు చేస్తున్న సత్యదేవ్.. ప్రస్తుతం 'బ్లఫ్ మాస్టర్' దర్శకుడు గోపీ గణేష్‌తో మరో సినిమా చేస్తున్నాడు. 'గాడ్సే' అనే వివాదాస్పదమైన టైటిల్‌తో రాబోతున్న ఈ సినిమాను సీకే స్క్రిన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత సీ కల్యాణ్ నిర్మిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ చాలా రోజుల క్రితమే ప్రారంభం అయింది. అయితే, మధ్యలో కొంత బ్రేక్ రావడంతో ఇంకా షూటింగ్‌ను పూర్తి చేసుకోలేదు. కానీ, ఈ మూవీ నుంచి ఆ మధ్య ఓ పోస్టర్‌ను వదిలారు. దీనికి మంచి స్పందన దక్కింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ చిత్రం నుంచి టీజర్‌ను విడుదల చేశారు.

  Hamsa Nandini: క్యాన్సర్‌ బారిన పడిన టాలీవుడ్ హీరోయిన్.. సర్జరీలు జరిగినా కష్టమే.. పరిస్థితి దారుణం

  సత్యదేవ్.. గోపీ గణేష్ కాంబినేషన్‌లో వస్తున్న 'గాడ్సే' మూవీ టీజర్‌ను మెగాస్టార్ చిరంజీవి కొద్ది సేపటి క్రితమే విడుదల చేశారు. 'ఏ నినాదాల వెనుక ఎవరి ప్రయోజనాలు దాగున్నాయో తెలుసుకోనంత కాలం ప్రజలు మోసపోతూనే ఉంటారు' అని సత్యదేవ్ గంభీరంగా చెప్పే డైలాగ్‌తో ఇది ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత పోలీసులంతా గాడ్సేను పట్టుకోవడం కోసం శ్రమిస్తున్న సన్నివేశాలను చూపించారు. ఇక, చివర్లో 'సాధారణంగా ఉద్యోగం చేస్తే డబ్బులొస్తాయి. వ్యాపారం చేస్తే డబ్బులొస్తాయి. వ్యవసాయం చేస్తే డబ్బులొస్తాయి. కానీ, సేవ చేస్తున్నందుకు మీకు వందల, వేల, లక్షల కోట్లు ఎలా వస్తున్నాయ్ రా' అని హీరో చెప్పే డైలాగ్ అదిరిపోయింది.

  యాక్షన్ థ్రిల్లర్‌గా రాబోతున్న 'గాడ్సే' మూవీ ప్రభుత్వంపై పోరాటం చేసే ఒక యువకుడి కథతో తెరకెక్కుతోందని తెలుస్తోంది. ఇదే విషయాన్ని టీజర్‌లో కూడా చూపించారు. ఇక, ఇందులో మలయాళ భామ ఐశ్వర్య లక్ష్మీ హీరోయిన్‌గా నటిస్తోంది. నాగబాబు, బ్రహ్మాజీ, తణికెళ్ల భరణి, నోయల్ సీన్, పృథ్వీ రాజ్ తదితరులు కీలక పాత్రలను చేస్తున్నారు. సునీల్ కశ్యప్ సంగీతం అందిస్తున్నాడు.

  English summary
  Satyadev Kancharana Now Doing Godse Movie Under Gopi Ganesh Direction. Now This Movie Teaser Unveiled by Chiranjeevi.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X