Just In
Don't Miss!
- News
కూలిన ఇండియన్ ఆర్మీ హెలికాప్టర్.. పైలట్ మృతి.. మరొకరికి తీవ్రగాయాలు
- Finance
రూ.50వేలకు దిగువనే బంగారం ధరలు, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే
- Lifestyle
Republic Day 2021 : పరేడ్ లో పురుషుల కవాతుకు నాయకత్వం వహించిన ఫస్ట్ లేడో ఎవరంటే...
- Sports
World Test Championship ఫైనల్ వాయిదా!!
- Automobiles
ఆటోమేటిక్ టెయిల్‌గేట్ కలిగి ఉన్న భారతదేశపు మొట్టమొదటి హ్యుందాయ్ క్రెటా, ఇదే
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
సాహో నుంచి సెకండ్ సింగిల్.. ప్రభాస్, శ్రద్ద రొమాంటిక్ లుక్ అదుర్స్
జక్కన్న తెరకెక్కించిన 'బాహుబలి' సిరీస్ తర్వాత ప్రభాస్ కెరీర్‌లో రాబోతున్న మరో భారీ ప్రాజెక్టు 'సాహూ'. పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్‌టైనర్ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమాలో భారీ యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను కనువిందు చేయనున్నాయి. ఇప్పటికే షూటింగ్ ఫినిష్ చేసుకున్న ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాలను మరింత వేగవంతం చేసింది. ప్రభాస్ హీరో కావడం, తెలుగులో ఇప్పటివరకు రాని భారీ యాక్షన్ ఓరియెంటెడ్ సినిమా కావడంతో దేశవ్యాప్తంగా 'సాహో'పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ మేరకు ప్రేక్షకుల అంచనాలకు రెక్కలు కడుతూ సాహోకి సంబందించిన అప్‌డేట్స్ విడుదల చేస్తున్నారు యూనిట్ సభ్యులు. ఇందులో భాగంగా షేడ్స్ ఆఫ్ సాహో పేరిట విడుదల చేసిన వీడియోలు, ఫస్ట్ సాంగ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. దానికి కొనసాగింపుగా రెండో పాటను విడుదల చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేసింది చిత్రయూనిట్. రేపు అనగా (జులై 30) సాహో సెకండ్ సాంగ్ విడుదల కానుంది. ఈ విషయాన్ని తెలుపుతూ చిత్రయూనిట్ విడుదల చేసిన పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పోస్టర్‌లో ప్రభాస్, శ్రద్ద కపూర్ రొమాంటిక్ లుక్ అదుర్స్ అంటూ పెద్ద ఎత్తున కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు.

యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్‌తో 'సాహూ' సినిమా తెరకెక్కుతోంది. యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో రాబోతున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ సినిమాలో ప్రభాస్, శ్రద్ధ కపూర్ జంటగా నటిస్తున్నారు. శ్రద్ద కపూర్‌కి ఇదే తొలి తెలుగు సినిమా కావడం విశేషం. చిత్రంలో నీల్ నితిన్ ముఖేష్, టైగర్ ష్రాఫ్ లాంటి భారీ తారాగణం పాలుపంచుకుంటున్నారు. భారీ అంచనాల నడుమ ఇండిపెండెన్స్ డే కానుకగా ఆగస్టు 15వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.