Don't Miss!
- News
హెచ్సీయూలో ఉద్రిక్తత: పోటాపోటీగా ప్రదర్శనలు, భారీగా చేరుకున్న పోలీసులు
- Sports
INDvsNZ : ‘షోలే2’ వచ్చేస్తుంది.. బాలీవుడ్ సీన్ రీక్రియేట్ చేసిన టీమిండియా కెప్టెన్!
- Finance
upi limit: UPI తో ఎంత డబ్బు పంపించవచ్చో తెలుసా ? అంతకు మించి పంపాలంటే..
- Lifestyle
ఈ ఆహారాలకు ఎక్స్ పైరీ డేట్ ఉండదని మీకు తెలుసా?
- Automobiles
అప్డేటెడ్ హోండా యాక్టివా కొనేవారు తప్పకుండా తెలుసుకోవాల్సిన 5 విషయాలు
- Technology
Poco X5 Pro 5G ఇండియా లాంచ్ తేదీ మరియు ధర లీక్ అయింది! వివరాలు
- Travel
భాగ్యనగరపు పర్యాటక ఆకర్షణ.. గోల్కొండ కోట!
నా వల్ల కావట్లేదు బాబోయ్… నటనకు గుడ్ బై చెప్పేస్తున్న హీరోయిన్!
సినిమా
ఇండస్ట్రీలో
వారసత్వం
అనేది
చాలా
కామన్.
చాలా
మంది
నటీనటులు
అలాగే
ఇతర
టెక్నీషియన్స్
కుమార్తెలు,
కుమారులు
సినీ
ఇండస్ట్రీలోకి
ఎంట్రీ
ఇచ్చి
తమకిష్టమైన
క్రాఫ్ట్
లో
తమ
లక్
పరీక్షించుకుంటారు.
కలిసి
వస్తే
సరే,
లేదంటే
సైలెంట్
అయిపోవడం
అందరికీ
తెలిసిన
సంగతే.
స్టార్
హీరోయిన్
కూతురిగా
ఎంట్రీ
ఇచ్చిన
ఒక
హీరోయిన్
అవకాశాలు
రాకపోవడంతో
ఇక
పూర్తిగా
నటనకు
గుడ్
బై
చెప్పాలని
భావిస్తున్నట్లు
సమాచారం.
దానికి
సంబంధించిన
వివరాల్లోకి
వెళితే

రాధ కుమార్తెగా ఎంట్రీ
తెలుగులో అనేక సూపర్ హిట్ సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ హోదా అనుభవించిన రాధ దాదాపు అందరికీ పరిచయమే.. ఆమె కుమార్తెగా పదిహేడేళ్ళ వయసులో నాగచైతన్య సరసన ఎంట్రీ ఇచ్చింది కార్తీక నాయర్.. జోష్ సినిమాలో నాగచైతన్యతో పాటు నటించిన ఈమె మొదటి సినిమాతోనే నటనకు మంచి పేరు తెచ్చుకుంది. ఆమెకు ఆ పాత్రకు గాను కొన్ని అవార్డులు కూడా దక్కాయి.

మూడు బాషలలో ఎంట్రీ
ఆ తర్వాత రెండేళ్ల పాటు ఆమెకు ఎలాంటి అవకాశాలు దక్కలేదు. అదేం విచిత్రమో సినిమా ఆడకపోయినా హీరోయిన్లకు అవకాశాలు వస్తూ ఉంటాయి. కానీ రెండేళ్లపాటు ఈ భామ సినిమా అవకాశం కోసం ఎదురు చూడాల్సి వచ్చింది. రెండేళ్ల తర్వాత కేవీ ఆనంద్ దర్శకత్వంలో కో అనే సినిమా ద్వారా తమిళ ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఆ సినిమా కూడా కలిసి రాలేదు తరువాత అదే ఏడాది ఆమె మలయాళంలో కూడా ఎంట్రీ ఇచ్చింది. అదేం దురదృష్టమో అక్కడ కూడా కలిసి రాలేదు.

కాలం కలిసిరాక
ఆ తర్వాత తెలుగులో దమ్ము, బ్రదర్ అఫ్ బొమ్మాలి సినిమాలు చేసి సైలెంట్ అయిపోయింది.. అదే విధంగా తమిళంలో కూడా చివరిగా 2016లో ఆమె సినిమా చేసింది.. ఆ తర్వాత నుంచి ఆమె సోషల్ మీడియాలో సైతం పెద్దగా యాక్టివ్ గా లేదు. అడపాదడపా వీడియోలు షేర్ చేస్తూ ఉన్నా ఈమెకు ఇప్పుడు సినిమా అవకాశాలు ఏ మాత్రం దక్కడం లేదని తెలుస్తోంది. ఆమె మాత్రం హీరోయిన్ గాని చేయాలని పట్టుబడుతూ ఉంటే అక్క,వదిన పాత్రలకు ఆమెను సంప్రదిస్తున్నారట దర్శకనిర్మాతలు.

ఇక టెన్షన్ వద్దు
దీంతో మొత్తం మీద సినిమాలకు దూరం అవ్వాలని ఆమె నిర్ణయం తీసుకున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. చాలా సంవత్సరాలు ఆఫర్‌ల కోసం ఎదురుచూసిన తరువాత ఆమెకు విరక్తి కలిగిందని అంటున్నారు. తాజాగా కార్తీక మాట్లాడుతూ, యుటిఎస్ గ్రూపుల హోటళ్లను నడుపుతున్నందున ఇప్పుడు తన వ్యాపారంపై దృష్టి పెట్టాలని కోరుకుంటున్నానని వెల్లడించింది.

రిసార్ట్ బిజినెస్ లో
ఇక ఆమె కేరళలోని ఉదయ్ సముద్రా లీజర్ బీచ్ హోటల్ & స్పాలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. పూర్తిగా ఆ బిజినెస్ మీద ఫోకస్ పెట్టనున్నట్టు తెలుస్తోంది. అన్నట్టు ఈమె సోదరి తులసి నాయర్ కూడా తమిళ ఇండస్ట్రీ ద్వారా సినిమా రంగంలోకి ప్రవేశించింది. అదేం విచిత్రమో అక్కలాగే ఆమెకు కూడా పెద్దగా అవకాశాలు లభించలేదు. ఆమె అయితే మరీ దారుణంగా రెండు సినిమాలకే పరిమితం కావాల్సి వచ్చింది.