For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  RRR రిలీజ్ తర్వాతి రోజే మహాసముద్రం: అదిరిపోయే పోస్టర్‌తో విడుదల తేదీ ప్రకటన

  |

  ఈ మధ్య కాలంలో ప్రముఖ హీరోల అభిమానులు, తెలుగు సినీ ప్రేక్షకుల ఆలోచనా ధోరణి గణనీయంగా మారిపోయింది. అందుకే గతంతో పోలిస్తే ఇప్పుడు ఎక్కువగా ప్రయోగాత్మక చిత్రాలు వస్తున్నాయి. వాటిలో చాలా సినిమాలకు ప్రేక్షకుల మద్దతు దక్కుతుండడంతో సూపర్ డూపర్ హిట్లు అవుతున్నాయి. ఈ కోవలోనే మల్టీస్టారర్ మూవీల సంఖ్య కూడా భారీగా పెరిగింది. అందుకే ఇటీవలి కాలంలో అలాంటివి ఎన్నో చిత్రాలు వచ్చాయి. మరికొన్ని షూటింగ్‌ను జరుపుకుంటున్నాయి. ఈ జోనర్‌లో వస్తున్న ఆసక్తికరమైన సినిమాల్లో 'మహాసముద్రం' కూడా ఒకటి.

  కాలేజ్‌ టైమ్‌లో అలాంటి పనులు.. ఆ ఉద్దేశం లేకపోయినా: నిరుపమ్ భార్య మంజుల షాకింగ్ కామెంట్స్

  'RX100' వంటి సూపర్ డూపర్ హిట్ వచ్చిన చాలా కాలం తర్వాత దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కిస్తోన్న చిత్రమే 'మహాసముద్రం'. మల్టీస్టారర్‌గా వస్తున్న ఈ మూవీలో టాలెంటెడ్ హీరో శర్వానంద్.. హ్యాండ్సమ్ గాయ్ సిద్దార్థ్ హీరోలుగా నటిస్తున్నారు. సున్నితమైన ప్రేమకథకు భావోద్వేగాలను జోడించి ఈ సినిమాను రూపొందించారు. ఎప్పుడో మొదలైన ఈ చిత్ర షూటింగ్.. ఇటీవలే పూర్తైంది. ఆ వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను కూడా మొదలెట్టి దాదాపుగా కంప్లీట్ చేసేశారు. ఇటీవలే ప్రమోషన్ కార్యక్రమాలు కూడా ప్రారంభించారు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించారు.

  Sharwanand and Siddharths Mahasamudram Release on October 14th

  భారీ అంచనాలతో రూపొందిన 'మహాసముద్రం' సినిమాను అక్టోబర్ 14న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ కాసేపటి క్రితమే ప్రకటించింది. ఇందుకోసం ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేసింది. సముద్రం బ్యాగ్రౌండ్‌తో ఉన్న ఈ పోస్టర్‌లో హీరోలు శర్వానంద్, సిద్ధార్థ్ ఒకరికొకరు తుపాకీలు గురి పెట్టుకుని నీటిలో నిల్చుని ఉన్నారు. వీళ్లిద్దరి మధ్యలో సముద్రపు అలల్లో హీరోయిన్ అతిథి రావు హైదరి కనిపిస్తోంది. తద్వారా ఇది ఇద్దరి మధ్య ప్రేమ వల్ల జరిగే సంఘర్షణతో తెరకెక్కిన చిత్రం అని తెలుస్తోంది. ఫలితంగా దీనిపై అంచనాలు రెట్టింపు అయ్యాయి.

  సుడిగాలి సుధీర్ రెమ్యూనరేషన్ లీక్: ఏ షోకు ఎంత వస్తుందంటే.. వామ్మో నెలకే అంత ఆదాయమా!

  టాలీవుడ్‌లోనే ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం RRR. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాలో స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్నారు. వాస్తవానికి ఈ సినిమాను అక్టోబర్ 13న ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నట్లు చిత్ర యూనిట్ గతంలో ప్రకటించింది. ఇక, ఇప్పుడు ఈ మూవీ రిలీజ్ డేట్ మారుతుందని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో 'మహాసముద్రం' విడుదల తేదీని అక్టోబర్ 14 అని ప్రకటించారు. దీంతో RRR వాయిదా పడడం నిజమేనన్న టాక్ వినిపిస్తోంది. అందుకే ఆరోజున సినిమాను తీసుకొస్తున్నారని తెలుస్తోంది.

  మల్టీస్టారర్ జోనర్‌లో రూపొందిన 'మహాసముద్రం' సినిమాను తన డ్రీమ్ ప్రాజెక్టుగా తెరకెక్కించాడు దర్శకుడు అజయ్ భూపతి. ఇద్దరు స్నేహితుల మధ్య ప్రేమ చిచ్చు పెట్టి.. వాళ్లను శత్రువులుగా మార్చేసిందన్న కాన్సెప్టుతో ఇది తెరకెక్కినట్లు తెలుస్తోంది. పూర్తి స్థాయిలో ఎమోషనల్‌గా సాగే ఈ సినిమాలో అదితి రావ్‌ హైదరీతో పాటు అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌గా చేస్తోంది. దీన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. ఇక, ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన 'హే రంభ' అనే పాటకు భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే.

  English summary
  Sensational Director Ajay Bhupathi Now Doing Mahasamudram Movie with Sharwanand and Siddharth. This Movie Release on October 14th in Theaters.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X