Just In
- 8 min ago
‘ప్లే బ్యాక్’ నేను తీద్దామని అనుకున్నా కానీ.. సుకుమార్ కామెంట్స్ వైరల్
- 1 hr ago
పబ్లిక్ ప్లేస్‌లో ఘాటు రొమాన్స్.. భర్తతో లిప్ లాక్‌తో రెచ్చిపోయిన శ్రియ
- 2 hrs ago
మహేశ్ బాబు కొత్త సినిమాలో ప్రియాంక: ప్రకటనకు ముందే మొదలైపోయిన వార్తలు
- 2 hrs ago
ఆ సినిమా కోసం అలా.. ఇన్నాళ్లకు తెర ముందుకు బీ గోపాల్
Don't Miss!
- Sports
మిథాలీ రాజ్ హాఫ్ సెంచరీ.. అయినా తప్పని ఓటమి!
- Finance
బిట్‌కాయిన్ వ్యాల్యూ 4.2 శాతం జంప్, 50,948 డాలర్లకు..
- News
నేను అల్లాటప్పా పామును కాదు, కోబ్రాను! ఒక్క కాటు చాలు: మిథున్ చక్రవర్తి సంచలనం
- Lifestyle
ఈ వారం మీ జాతకం ఎలా ఉందో ఇప్పుడే చూసెయ్యండి... మీ లైఫ్ కు సరికొత్త బాటలు వేసుకోండి...
- Automobiles
మహీంద్రా కార్స్‌పై అదిరిపోయే ఆఫర్స్ ; ఏ కార్‌పై ఎంతో చూసెయ్యండి
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
శివరాత్రికి ‘శ్రీకారం’.. శర్వానంద్ సందడి అప్పుడే!
యంగ్ హీరో శర్వానంద్‌కు ప్రస్తుతం ఓ హిట్ పడాలి. లేదంటే వ్యవహారం వేరేలా ఉండేట్టు కనిపిస్తోంది. శతమానంభవతి తరువాత శర్వానంద్‌కు ఒక్కటంటే ఒక్కటి కూడా సరైన సినిమా పడలేదు. రాధ, రణరంగం, పడి పడి లేచే మనసు వంటి చిత్రాలతో శర్వానంద్ ప్రేక్షకులను నిరుత్సాహపరిచాడు. అవేవీ కూడా సక్సెస్ కాలేకపోయాయి. కానీ ఇప్పుడు మాత్రం శర్వానంద్ మంచి హిట్ కొట్టేలానే కనిపిస్తున్నాడు.
వరుస ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్న శర్వానంద్.. ముందుగా శ్రీకారం అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్‌ను బరిలోకి దించనున్నాడు. అది కాకుండా శర్వానంద్ ఓ ద్విభాషా చిత్రాన్ని లైన్‌లో పెడుతున్నాడు. దాని తరువాత రష్మిక కాంబోలో వస్తోన్న ఆడాళ్లూ మీకు జోహార్లు అనే మూవీని సెట్ చేశాడు. అలా పక్కా ప్లానింగ్‌తో వస్తోన్న శర్వానంద్ ఈ సారి మాత్రం హిట్లు కొట్టేలానే కనిపిస్తున్నాడు. తాజాగా శ్రీకారం అప్డేట్‌ను శర్వానంద్ ఇచ్చాడు.

ఇప్పటికే శ్రీకారం పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. భలేగుంది బాలా, సంక్రాంతి సందళ్లే అనే రెండు పాటలు అందరినీ కట్టిపడేశాయి. ఇక ఈ మూవీ మహా శివరాత్రి సందర్భంగా విడుదల కాబోతోందని ప్రకటించారు. మార్చి 11న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోందని తాజాగా ప్రకటించారు. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్‌పై రాబోతోన్న ఈ మూవీలో ప్రియాంక మోహనన్ హీరోయిన్‌గా నటిస్తోంది.. మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందిస్తుండగా..కిషోర్ బి దర్శకత్వం వహిస్తున్నాడు.