RajKundra Arrest : చిక్కుల్లో శిల్పా శెట్టి.. అదే నిజమైతే ఆమె కూడా అరెస్ట్?

పోర్న్ ఫిల్మ్ లేదా పోర్నోగ్రఫీ కేసు విషయంలో ముంబై పోలీస్ క్రైమ్ బ్రాంచ్ సోమవారం రాజ్ కుంద్రాను అరెస్టు చేసింది. ఆ తర్వాత ఈరోజు ఉదయాన్నే ఆయనని కోర్టులో ప్రవేశపెట్టగా మేజిస్ట్రేట్ ఆయనకి జూలై 23 వరకు పోలీసు కస్టడీకి ఇచ్చారు. రాజ్ కుంద్రాతో పాటు ఆయన కంపెనీ ఐటీ హెడ్ ర్యాన్ థార్ప్‌ను కూడా పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఇప్పుడు ఈ మొత్తం విషయంలో దర్యాప్తు రాజ్ కుంద్రా భార్య, నటి శిల్పా శెట్టి వైపు తిరిగింది. శిల్పా శెట్టి, తన రాజ్ కుంద్రా యొక్క దాదాపు అన్ని సంస్థలలో వాటాలు ఉన్నాయని అంటున్నారు. దీంతో శిల్పా శెట్టికి దీని గురించి ఏమైనా తెలుసా అని పోలీసులు ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నారు.

ఆమె కూడా ఈ వ్యవహారంలో పాల్గొన్నారా ? అనే కోణంలో పోలీసులు వ్యవహరిస్తున్నారని అంటున్నారు. ఈ కేసులో విచారణ కోసం పోలీసులు త్వరలో శిల్పా శెట్టిని పిలిపించవచ్చని కూడా భావిస్తున్నారు. అయితే దర్యాప్తులో శిల్పా శెట్టి పాత్ర ఇంతవరకు తెరపైకి రాలేదని ముంబై పోలీసు జాయింట్ కమిషనర్ మిలింద్ భరంబే చెప్పినప్పటికీ, ఇప్పుడు దర్యాప్తు జరుగుతోందని అంటున్నారు. రాజ్ కుంద్రా యొక్క రెండు కంపెనీలు లండన్లో ఉన్నాయని, అయితే మొత్తం పనులు ముంబైలోని రాజ్ కుంద్రా కార్యాలయం నుండి నడుస్తున్నాయని ఆయన అన్నారు.

shilpa shetty to be prosecuted in porn apps case

అందుకే రాజ్ కుంద్రా ఐటీ హెడ్ ర్యాన్ తోర్పేను కూడా అరెస్టు చేశారు. మిలింద్ భరంబే మాట్లాడుతూ, 'అతని మోడస్ ఆపరెండీ గురించి వెల్లడించారు. అతను వెబ్ మోడల్స్ మరియు ఫిల్మ్‌లలో పని పొందడం కోసం తిరిగే కొత్త మోడళ్లను మరియు మహిళలను పిలిచేవాడు. ఆపై షూటింగ్ సమయంలో వారి చేత పోర్న్ వీడియోలు చేసి రిలీజ్ చేయడం ప్రారంభించాడు. ఈ కేసులో ఇప్పటి దాకా ఇందులో 9 మందిని అరెస్టు చేశారు. దాడుల సమయంలో పెద్ద ఎత్తున ఎలక్ట్రానిక్ వస్తువులు కూడా స్వాధీనం చేసుకున్నారని తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X