For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  WWW మూవీ గ్రాండ్‌గా రిలీజ్.. అదృష్టాన్ని పరీక్షించుకోనున్న శివానీ రాజశేఖర్

  |

  సెకండ్ వేవ్ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు ఓపెన్ కావడంతో సినిమాలన్నీ వరసబెట్టి రిలీజ్ అవుతున్నాయి. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. కొందరు నటీనటులు వెండి తెరపైన, బాక్సాఫీస్ వద్ద తమ అదృష్ణాన్ని పరీక్షించుకోవడానికి సిద్దమవుతున్నారు. అలానే టాలీవుడ్ యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్, జీవిత కూతురు శివానీ రాజశేఖర్ కూడా కెరీర్‌ గ్రాఫ్‌ను పరిగెత్తించేందుకు సిద్దమయ్యారు. ఆమె నటించిన WWW (ఎవరు? ఎక్కడ? ఎందుకు?) అనే చిత్రం విడుదలకు సిద్దమైంది.

  కల్యాణ్ రామ్ హీరోగా 118 లాంటి మూవీని తెరకెక్కించిన ప్ర‌ముఖ‌ సినిమాటోగ్రాఫ‌ర్ కేవి గుహన్ ద‌ర్శ‌కత్వంలో ఆదిత్య అరుణ్ హీరోగా WWW చిత్రం రూపొందుతున్నది. సస్సెన్స్, థ్రిల్ల‌ర్, మిస్టరీ అంశాలతో రామంత్ర క్రియేషన్స్ పతాకంపై ప్రొడ‌క్ష‌న్ నంబర్‌గా 1గా డాక్టర్ రవి పీ రాజు దాట్ల నిర్మిస్తున్న ఈ చిత్రం ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ భాగ‌స్వామ్యంతో థియేట‌ర్స్‌లో గ్రాండ్‌గా విడుద‌ల‌కానుంది. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్, ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలైన పాటలన్నీ విశేష ఆదరణ దక్కించుకుని సినిమాపై అంచనాల్ని భారీగా పెంచాయి.

  Shivani Rajasekhars WWW to release in theatres

  సినిమా రిలీజ్ సందర్భంగా ప్రొడ్యూస‌ర్ సురేష్‌ బాబు దగ్గుబాటి మాట్లాడుతూ.. ఇటీవల WWW సినిమా చూశా. నటీనటుల ఫెర్ఫార్మెన్స్‌, సాంకేతిక విలువలతో థ్రిల్లింగ్‌గా తెర‌కెక్కించారు. ప్ర‌స్తుత కోవిడ్ ప‌రిస్థితుల్ని, క‌రోనా కారణంగా వర్చువల్ వరల్డ్‌లో వ‌చ్చిన మార్పుల‌ని చ‌క్క‌గా చూపించారు. అంత‌ర్లీనంగా ఒక మంచి ప్రేమ‌క‌థ కూడా ఉంది. WWW ఒక మంచి చిత్రాన్ని మీకు థియేటర్లలో అందిస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది అని అన్నారు.

  చిత్ర నిర్మాత డాక్టర్ రవి పీ రాజు దాట్ల మాట్లాడుతూ - మా బేన‌ర్‌లో రూపొందిన ఫ‌స్ట్ మూవీ డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు చిత్రానికి సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ స‌మ‌ర్ప‌కులుగా వ్యవ‌హరించ‌డం చాలా సంతోషంగా ఉంది. ఇది మా ఫస్ట్ సక్సెస్ గా భావిస్తున్నాం. ఈ సందర్భంగా సురేష్ బాబుగారికి మా బ్యానర్ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తెలుగులో తొలిసారి రూపొందిన కంప్యూటర్‌ స్క్రీన్‌ మూవీ ఇది. గుహ‌న్‌ మేకింగ్ చాలా కొత్త‌గా ఉంటుంది. అలాగే అదిత్‌ అరుణ్, శివాని రాజశేఖర్ ఇద్ద‌రు సెటిల్డ్ పెర్‌ఫామెన్స్ ఇచ్చారు. వారిద్ద‌రి కెమిస్ట్రి త‌ప్ప‌కుండా ఆక‌ట్టుకుంటుంది. త్వ‌రలో ట్రైల‌ర్ రిలీజ్ చేసి సినిమాను థియేటర్లోకి తీసుకొస్తాం. క‌మ‌ర్షియ‌ల్‌గా పెద్ద విజ‌యం సాధిస్తుంద‌ని న‌మ్మ‌కం ఉంది అని అన్నారు.

  చిత్ర ద‌ర్శ‌కుడు కేవీ గుహన్ మాట్లాడుతూ WWW సినిమా చాలా బాగా వ‌చ్చింది. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ స‌మ‌ర్ప‌ణ‌లో ఈ మూవీ విడుద‌ల‌ కావ‌డం నిజంగా హ్యీపీగా ఉంది. అదిత్‌, శివానీ ఇద్ద‌రు చాలా బాగా న‌టించారు. టెక్నీషియ‌న్స్ అంద‌రూ మంచి స‌పొర్ట్ అందించారు. తప్పకుండా ఒక డిఫరెంట్ మూవీ అవుతుంది అన్నారు.

  నటీనటులు: అదిత్‌ అరుణ్, శివాని రాజశేఖర్, ప్రియదర్శి, వైవా హర్ష, దివ్య, రియాజ్ ఖాన్, సత్యం రాజేష్ తదితరులు
  స‌మ‌ర్ఫ‌ణ‌: సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌
  బ్యానర్‌: రామంత్ర క్రియేషన్స్
  కథ, స్క్రీన్‌ ప్లే, సినిమాటోగ్రఫి, దర్శకత్వం: కె వి గుహన్
  నిర్మాత: డాక్టర్ రవి పీ రాజు దాట్ల
  కో ప్రొడ్యూసర్‌: విజయ్‌ ధరణ్‌ దాట్ల
  సంగీతం: సైమన్‌ కే కింగ్
  ఎడిటింగ్‌: తమ్మిరాజు
  ఆర్ట్‌: నిఖిల్‌ హాసన్
  డైలాగ్స్‌: మిర్చి కిరణ్
  లిరిక్స్‌: రామజోగయ్యశాస్త్రి, అనంత శ్రీరామ్, రోల్‌రైడా
  కొరియోగ్రఫి: ప్రేమ్‌ రక్షిత్
  స్టంట్స్‌: రియల్‌ సతీష్
  కాస్ట్యూమ్‌ డిజైనర్‌: పొన్మని గుహన్
  ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: కె. రవి కుమార్

  English summary
  Actor Rajashekhar' daughter Shivani Rajasekhar's WWW movie to release in theatres. Suresh Productions is presenting this movie.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X